27, మే 2017, శనివారం

ఏదేశమేగినా..యెనుకాలిడినా

ఆంధ్రావళి - రాయప్రోలు సుబ్బారావు

3. జన్మభూమి
ఏ దేశ మేగినా, ఎందుకాలిడిన,
ఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనిన,
పొగడరా నీతల్లి భూమి భారతిని,
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమొ,
జనియించినాడ వీ స్వర్గ ఖండమున;
ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావొ,
నిను మోచె ఈ తల్లి కనకగర్భమున.

లేదురా ఇటువంటి భూదేవి యెందు,
లేరురా మనవంటి పౌరు లింకెందు.
సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక,
ఓడల జండాలు ఆడునందాక,
అందాక గల ఈ యనంత భూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు;
పాడరా నీ తెన్గు బాల గీతములు
పాడరా నీ వీరభావ భారతము

తమ తపస్సులు ఋషుల్‌ ధారపోయంగ,
శౌర్యహారము రాజచంద్రు లర్పింప,
భావసూత్రము కవిప్రభువు లల్లంగ,
రాగదుగ్ధము భక్తరత్నముల్‌ పిదుక,
దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగ,
రాళ్ళ తేనియ లూరు రాగాలు సాగ,
జగముల నూగించు మగతనం బెగయ,
సౌందర్య మెగబోయు సాహిత్య మలర,
వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్ర!
దీపించెనీ పుణ్యదేశంబు పుత్ర!

పొలముల రత్నాలు మొలిచెరా యిచట,
వార్ధిలో ముత్యాలు పండెరా యిచట,
పృథివి దివ్యౌషధుల్‌ పిదికెరా మనకు,
కానల కస్తూరి కాచెరా మనకు,
అవమాన మేలరా! అనుమాన మేల
భారతీయుడనంచు భక్తితోపాడ.

24, మే 2017, బుధవారం

పలుపలు వరములు జనులకు

పలుపలు వరములు జనులుకు
గలుపుదుమనుచును గలగల గడు కపటములన్
బలుకుచు గెలుపుల కలలలొ
గులుకుచు గదిలె డల శునక గణిక కొడుకుల గనుమా!

14, మే 2017, ఆదివారం

ఎవరు రాయగలరూ..అమ్మా యను

Happy Mother's Day !!

ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం

ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా...  అమ్మేగా తొలిపలుకు  నేర్చుకున్న  భాషకి
అమ్మేగా  ఆదిస్వరం  ప్రాణమనే  పాటకి                
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం

అవతారమూర్తి  అయినా  అనువంతే పుడతాడు
అమ్మపేగు   పంచుకునే  అంతవాడు  అవుతాడు  [ 2 ]
అమ్మేగా... అమ్మేగా  చిరునామా  ఎంతటి  ఘనచరితకి
అమ్మేగా  కనగలదు  అంతగొప్ప అమ్మని                  
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం  

శ్రీరామరక్ష  అంటూ.. నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు  అంటూ.. నిత్యం  దివించింది        [ 2 ]
నూరేళ్ళు ....నూరేళ్ళు  ఎదిగి  బ్రతుకు  అమ్మ  చేతి  నీళ్ళతో
నడక  నేర్చుకుంది  బ్రతుకు  అమ్మచేతి  వేళ్ళతో        
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు  నేర్చుకున్న  భాషకి
అమ్మేగా  ఆదిస్వరం  ప్రాణమనే  పాటకి                
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగం కన్న తియ్యని రాగం

చనుబాలు  తాగితేనే  బ్రతుకు  తీపి  తెలిసింది
ఆరురుచులు  తగలగానే  అమ్మే  చేదవుతుంది      [ 2 ]
రోమ్మేగా ... రోమ్మేగా  అందించెను  జీవితాన్ని  నోటికి
అమ్మేగా  తన నెత్తురు  నింపెను  నీ  ఒంటికి            
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగంలా  తియ్యని రాగం

ఆలైన బిడ్డలైన  ఒకరు  పొతే  ఇంకొకరు
అమ్మా  పదవి  ఖాలీ  అయినా  అమ్మా  అవరు  ఇంకెవరు    [ 2 ]
అమ్మంటే ...అమ్మంటే  విరమించని  వట్టి  వెట్టి  చాకిరీ
అమ్మంటే  రాజీనామా  ఎరగని  ఒక  నౌకరి
ఎవరు  రాయగలరు  అమ్మా  అను మాట కన్న కమ్మని  కావ్యం
ఎవరు  పాడగలరు  అమ్మా  అను రాగంలా  తియ్యని రాగం

9, మే 2017, మంగళవారం

దనవీరసూరకర్ణ డైలాగ్స్

దాన వీర శూర కర్ణ డైలాగుల

ఆగాగు !

ఆచార్య దేవ, హహహ!  ఏమంటివి?  ఏమంటివి ?

జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా !

ఎంత మాట,  ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ  పరీక్ష కాదే ?

కాదూ  కాకూడదు ఇది కులపరీక్షయే అందువా

నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?

మట్టి కుండలో పుట్టితివికదా ! హహహ  నీది ఏ కులము?

ఇంతయేల, అస్మతపితామహుడు కురుకుల వృధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయౌ గంగా గర్భమున జనియిన్చలేదా  ! హహహ   ఈయనదే కులము  ?

నాతోనే చెప్పింతువేమయ్య  , మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవవేశ్యయగు ఊర్వశీ  పుత్రుడు కాదా ?

ఆతడు పంచామజాతి కన్యయగు  అరుంధతియందు శక్తిని,                               ఆశక్తి చండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు  విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న,  హ,                           ఈ విదురదేవుని కనలేదా?

సందర్భావసరములనుబట్టి  క్షేత్రభీజప్రాదాన్యములతో  సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగ, నేడు కులము కులము అను వ్యర్ధవాదములెందుకు.

ఊం.. ఉ..  హహహ

విరాగియైన పాండురాజుకు సరాగినియై కులప్రవర్తనాసక్తయైన కుంతికి జనియించిన పాండవులు !

ఆబాల్యము ఆటపాటలలో మమ్ము అలమటపెట్టిన పాండవులు !

లాక్కాగృహమును నిశీధిన నిట్టనిలువునా ధహించివేసారన్న నీలాపనిందను మామీద వేసిన పాండవులు !

ఏకచక్రపురములో విప్రవేషములతో ఇల్లిల్లు తిరిపమెత్తి పలుకు వళ్ళుమెక్కు పాండవులు !

అంతకుతగ్గగంతగా అతుకులబొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు !

స్నాయుతాసంకల్పశల్యమున సంప్రాప్తించిన సుంకంమ్మన్నటుల

మా పిత్రుదేవదయాలభ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో    నేడీ యాగకార్యదుర్వహుగులగుటయా !

నరకలోకముననున్న తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు

జేర్చుట దీని ఆంతర్యమట ! ఏమి కల్పనాచాతుర్యము ? ఏమి కల్పనాచాతుర్యము ?

ఐనను కుంతీ మూలమున స్వర్గనరకాధిపతులిరవురును  పాండురాజునకు తమ్ములేగదా !

ఇందు జరుగనిదేమి ? లోపమేమి ?

అయ్యారే ! సకలరాజన్యులోకమూ సోహోనినాదములు సలుప భారతభారతీ శుభాస్సీసులతో పరిపాలనసాగించెడి మాకు మారాటుగా సార్వభౌమత్వమును సాదింపగోరి  పాండవుల దుష్ప్రయత్నమా ఇది !

సాటిరాజులలో రారాజు కావలెననెడి  ధర్మజుని దుష్టంతమా ఇది !

ఐన కుతంత్రముతో కుచ్చితబుద్ధితో  సేయనెంచిన ఈ యాగము సాగరాదు,  మేమేగరాదు.

అహొ !

అమ్లానభావసంభావితమైన  ఈ దివ్యప్రసూనమాలికారాజమును కురుసింహుని గళసీమనలనలంకరించిన వారెవ్వరు ? అ.. హహహ ..

అనిమిషయామినీ  అథిధిసత్కార  దివ్యసేవాప్రభావమౌనా ! ఔ,, ఔ,,

ఆ.. హహ్హహ,,

ఓ..

ఆ.. ఏమా సుమధుర సుస్వరము !

కాకలీకలకంటికంటి  కూకూఉకారసుతిహిత దివ్యసురకామినీ కామినీయక సుస్వాగతమౌనా ! హాహ్హహ.. అహా .

సొబగు సొబగు.. సొబగు సొబగు..

ఔరా.. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా ! హాహ్హహ..

ఔ.. ఔ..

అయ్యారే !

భ్రమ.. ఇదినా భ్రమ ..

కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..

భళా !

సముచితసత్కారస్వీకారసంత్రుప్తస్వాంతుడనగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణాభూషణములచే  ఈ సభాభవనము ధన్యము..ధన్యము..

అకుంచితనిర్మాణచాతురీదుర్యుడవగు ఓ మయబ్రహ్మా.. నీ శిల్పచాతురీమధురిమ ఆ బ్రహ్మకుగాని విశ్వబ్రహ్మకుగాని   లేదు.. లేదు.. లేదు ..

ఆ.. లేవచ్చును, లేకపోవచ్చును.. కాని పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుటమాత్రం మానధనులమైన మాబోంట్లకు దుస్సహము.

విశ్వవిశ్వంబరావినుతశాశ్వతమహైశ్వరీమహైశ్వరులము కావచ్చు..

అఖిల నదీనదసాగరవారిదర్గర భూకృత అనఘ్రముక్తామణీమ్రాతమ్ములు మాకుండిన ఉండవచ్చు..

సాగరమేఘరాసతీకరగ్రహణంబోనర్చి సార్వభౌమత్వమందిన అందవచ్చు..

కాని ఇట్టి సభాభవనము  మాకు లేకపోవుట మోపలేని లోపము.

చతుర్కృతాపచారములకంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయములకు దావాలనసధృశము. ఇక మేమిందుండరాదు.

ఏమీ ! నిరాఘాటపదట్టనకు నాకీ కవాటఘట్టనమా ! పరులేవ్వరు లేరుకదా ! మా భంగాపాటును పరికించలేదుకదా ! ఇస్సీ! ఈమయసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట

నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్ము అవమానిచుటకే.

ఆ.. ఏమీ ! సభాభవన గర్భమున సుందర జలచరసంతియైన  జలాశయమా ! ఆహ్

అంతయు మయామోహితముగా ఉన్నదే !

ఉ.. అహ్హహ్హ.. ఇదియును అట్టిదియే.. అహహ్హహ…

పాంచాలీ… పంచభర్త్రుక …

వదరుపోతా.. వాయునందనా …

పాంచాలి..  పంచభర్త్రుక..  ఏమే.. ఎమేమే..  నీ ఉన్మత్తవికటాట్టహాసము  ఎంత మరువయత్నించినను మరపునకురాక హృదయ శల్యాభిమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.

అహొ   ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహొత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యదౌరేయుండనై …

నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేన్యులగు శతసోదరులకు అగ్రజుండనై …

పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాత్రవిద్యాపారియుండైన రాధేయునకు మిత్రుండనై.. మానధనుడనై  మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికా పరీవృతయై పగులబడి నవ్వుటయా ?

అహొ ! తన పతులతో తుల్యుడనగు నను భావగా  సంభావింపక, సమ్మానింపక.. గృహిణిధర్మ పరిగ్దగ్ధయై.. లజ్జావిముక్తయై.. ఆ పంతకి పాంచాలి ఎట్టఎదుట యేల గేలి సేయవలె ?

అవునులే.. ఆ బైసిమాలిన భామకు ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున  మగలముందొక మగనిని వచ్చనపర్యంతము  రెచ్చిన కడుపిచ్చితో పచ్చిపచ్చి  వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ మేమేల కటకట పడవలే ?  ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా !  ఆ.. అని సరిపెట్టుకొందున ! ఈ లోకమును మూయ మూకుడుండునా !

దుర్వ్యాజమున   సాగించు యాగమని తెలిసి మేమేల  రావలె … వచ్చితిమి పో !

నిజరత్నప్రభాసమపేతమై సర్వర్త్రు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలె.. అయినది పో !

అందు చిత్రచిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష మాకేల కలుగవలె …  కలిగినది  పో !

సజీవ జలచర సంతాలవితాలములకు ఆలవాలమగు ఆ జలాశాయములో మేమల కాలు మోపవలె .. మోపితిమి పో !

సకల రాజన్యుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం  చెందవలె..  ఏకత్సమయమునకే  పరిచారికాపరీవృతయై  ఆపాంచాలి  యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ?

ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..

ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబానలా జ్వాలలు  ధగ్ధమోనర్చుచున్నవి మామా..

విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా ?

పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా..

ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక ఆశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా…


  • ఇప్పుడేదీ కర్తవ్యము ?  మనుటయా? మరణించుటయా ?

అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
 ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
 నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ _ Idi oka  amm a pad yam yeh

2, మే 2017, మంగళవారం

కలమెత్తిన హలమెత్తిన
మలమెత్తినవారి నొక్కమై జూడవలెన్
వలతియు నలతియు లేదిట
బలు వృత్తులు సాగినపుడె బ్రతుకులు సాగున్‌!’

అని ‘తెలుగులెంక’ తుమ్మల వారి ఆకాంక్ష నీరుగారి పోయిందే ఈనాడు !!