18, సెప్టెంబర్ 2017, సోమవారం

నీతి నియతిలేని నీచుని చేతిలో

మరి తెలుగుపత్రికలకు మార్గదర్శకునిగా వెలుగొందిన నార్ల వారు 1956 కు ముందే..
నీతి నియతిలేని నీచుని చేతిలో
పత్రికుండెనేని ప్రజకు చేటు;
హంత చేతికత్తి గొంతుకలు కోయదా?
నవయుగాల బాట నార్ల మాట!

ఆయనే..
పత్రికా రచనను పడపు వృత్తిగ మార్చు
వెధవకంటె పచ్చి వేశ్య మేలు;
తనువు నమ్ము వేశ్య, మనసును కాదురా
నవయుగాల బాట నార్ల మాట!...
అని కూడా అన్నారు

మరి పత్రికలకు కిరీటాలు పెట్టి కౌగలించుకుందామా!!

2, సెప్టెంబర్ 2017, శనివారం

బట్టతల సౌఖ్యం

బట్టతల సౌఖ్యముల గురించి...
*తలనూనె రాసెడు తగులాటముండదు-*
*క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు/*
*పేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును-*
*చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు/*
*పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ-*
*జుట్టింత దొరకదు పట్టుకొనగ/*
*అద్దంబు దువ్వెన లవసరమే లేదు-*
*పర వనితలు వెంటబడుట కల్ల/*
తేటగీతి.
*కడకు కుంకుడు, శీకాయ ఖర్చు మిగులు/*
*తలకు స్నానంబు చేయుట సులభమౌను/*
*ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ/*
*బట్టతల గల్గు వాడె పో భాగ్యశాలి.*