28, మార్చి 2019, గురువారం
తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు, వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు, లక్షాధికారైన లవణ మన్న మెకాని, మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు, విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని, కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు, పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి దానధర్మము లేక దాఁచి దాఁచి, తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ? తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!\ ----- (శేషప్పకవి)
5, మార్చి 2019, మంగళవారం
దయచేసి సభలలో ముఖ్య అతిథి,ప్రధాన అతిథి అని పిలవకండి. అకస్మాద్గృహ మాయాతః - సోఽతిథిః ప్రోచ్యతే బుధైః' -- ఊరుపేరు తెలియనివాడు, ఆకస్మికముగా (భోజనార్థము) ఇంటికి వచ్చినవాడిని అతిథి అంటారు.కాలనియమము లేక అన్నార్థియై వచ్చినవాడు అని అతిథి పదానికి ఇంకొక అర్థం. మన సభలకు వచ్చే ప్రముఖుడు తిండికి లేనివాడు కాడు.ఆకస్మికంగా వచ్చిన వాడు కాడు. అన్నార్థి కాడు.మనం ఆహ్వానిస్తే వచ్చినవాడు.కనుక దయచేసి సభలలో ముఖ్య అతిథి,ప్రధాన అతిథి అని పిలవకండి.భాషను అవమానించకండి. ముఖ్య వ్యక్తి, ప్రధాన వ్యక్తి అని పిలుచుకోవచ్చు.
2, మార్చి 2019, శనివారం
నిజమైన స్నేహం అనేది ధృఢమైన ఆరోగ్యం వంటిది, పోగోట్టుకున్నాక గాని దాని విలువ మనకు అర్ధం కాదు. నా స్నేహితులే నా సమస్తం,ప్రపంచం,ఐశ్వర్యం,జీవన పరమార్ధం . ప్రపంచమంతా నిన్నొదిలి వదిలి ఒంటరిని చేసి వెళ్ళిపోయినప్పుడు నీ చెంత నిలబడి, అక్కున చేర్చుకొని అభయం ఇచ్చి, కన్నీరు తుడిచేవాడే నిజమైన స్నేహితుడు. నీ హృదయం లో పలికే అనురాగపూరిత ,స్నేహమయ సంగీతాన్ని అర్ధం చేసుకొని,ఆస్వాదిస్తూ, నువ్వు మర్చిపోయి,మాటల కోసం తడబడుతున్నప్పుడు,అందుకునేవాడే నిజమైన స్నేహితుడు. నిన్ను నువ్వు నమ్మడం మానేసాక కూడా నిన్ను నమ్మేవాడే నిజమైన స్నేహితుడు. ప్రేమతో కూడిన ఆలింగనం లక్ష మాటల కంటే గొప్పది. స్నేహితుడు అంతకంటే గొప్పవాడు. మనలో ఎంతమంది నిజమైన స్నేహితులుగా వున్నామో,ఎంతమందికి నిజమైన స్నేహితులు వున్నారో ఆత్మ పరిశీలన చేసుకుందాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)