29, జులై 2016, శుక్రవారం



ఆయన పాటందుకుంటే చాలు
సప్తస్వరాలు ఒకదానికొకటి పోటీ పడుతూ
రాగవిన్యాసం చేస్తాయి
ఆయన వాక్ప్రవాహానికి
ఝరులు, సాగరాలు ఉరకలేస్తూ వొచ్చి
సాష్టాంగంగా సాగిలపడతాయి
అక్షరాలకు ఆకృతిని
పదాలకు పరమార్థాన్ని
మాటలకు మకరందాన్ని
అందించిన అక్షర నారాయణుడు
జ్ఞానపీటాన్ని అధిష్టించి
తెలుగు ఖ్యాతిని
విశ్వంభరాలకు చాటి చెప్పిన
పదకవితా పద్మభూషణుడు
ఆయన తీక్షణమైన చూపు
ఎక్కు పెట్టిన రామబాణం
ఆయన చిరునవ్వు
చల్లని వెన్నెల కిరణం
ఆయన నవ్వినా కవిత్వమే
నడచినా కవిత్వమే
ఆయన కర స్పర్శతో కవిత్వం
తపించి తరిస్తుంది
తలవొంచి నమస్కరిస్తుంది
ఆయనే సినారె
షాయర్ కినారే....
Like
Comment

7, జులై 2016, గురువారం

స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజ విద్వాన్ సర్వత్ర పూజ్యతే..

7, జూన్ 2016, మంగళవారం

ఆ రోజులే బాగున్నాయ్
------------------------

టెన్షన్లు.. ఒత్తిళ్లు... డబ్బు సంపాదన...
కోసం అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన ఆరోజులు బాగున్నాయ్...!

ఆదివారం ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన ఆ రోజులు బాగున్నాయ్...!

మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర...
నీళ్లు తాగిన ఆ రోజులు బాగున్నాయ్...!

ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం...
ఎర్రని ఎండను సైతం లెక్కచేయని...
ఆ రోజులు బాగున్నాయ్..!

వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన ఆ రోజులు బాగున్నాయ్...!

సెలవుల్లో అమ్మమ్మ..నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలన్న ఆలోచనే లేని...
ఆ రోజులు బాగున్నాయ్...!

ఏసీ కార్లు లేకున్నా ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని..
ఆ స్వాధించిన ఆ రోజులు బాగున్నాయ్...!

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన ఆ రోజులు బాగున్నాయ్...!

మటన్ బిర్యానీ.. చికిన్ బిర్యానీ లేకున్నా...
ఎండాకాలం మామిడి కాయ పచ్చడితో...
అందరం కలసి కడుపునిండా అన్నం తిన్న...
ఆ రోజులు బాగున్నాయ్...!

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర...
కాజేసిన ఆ రోజులే బాగున్నాయ్...!

సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ ఒకే బ్యాట్ తో...
క్రికెట్టాడిన ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా...
పావలా ఆశా చాక్లెట్ తిన్న...
ఆ రోజులే బాగున్నాయ్...!

చిన్న చిన్న మాటలకే దూరం...
పెంచుకుంటున్న ఈ రోజుల్లో...
పిల్లలం కొట్టుకున్నా సాయంత్రంకల్లా...
కలసిపోయిన ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే చిరుతిళ్ల కోసం...
ఎదురు చూసిన ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లు...
చల్లగా నోట్లో నానుతున్నా అమ్మ...
చీరకొంగు పైసలతో పుల్లఐసు కొనితిన్న...
ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...!

పొద్దుపోయేదాకా చేల్లో పనులు చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని చందమామను చూస్తూ...
నిదురించిన ఆ రోజులు బాగున్నాయ్...!

ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...
ఆ రోజులు ఎంతో బాగుంటాయ్...
ఎందుకంటే గడచి పోయిన ఆ రోజులు...
మళ్లీ తిరిగి రావు కాబట్టి...!!

23, మే 2016, సోమవారం



రాయలు మా కాపు అంటారు వేరొకరు
బ్రహ్మన్న మావాడు అంటారు ఇంకొకరు
కవిదిగ్గజాలు మా వారు అని ఒకరు
వేమన్న మావాడు అని వేరొకరు
వీరబ్రహ్మము మావాడు అని మరి ఒక్కరు
అంబేద్కరు మావాడు అంటారు మరి ఒకరు
జాతికే వన్నె తెచ్చిన వజ్రాలు వారు
కులము పేరు చెప్పి తుళ్ళి పడబోకు
నీ వెనుకబాటుతనము వారికెందుకయ్యో
అంట బోకు వారి పేర్లను కలలోన
వీర విక్రమ దీక్షా స్పూర్తులతోడ
జాతి తేజము వెలుగంగ జేసిన
ఘనులకు కులమన్నది లేదాయె ఎపుడు
జాతి రత్నాలకు కులగజ్జి అంటిచబోకయ్యొ

10, మే 2016, మంగళవారం



" చెల్లియో చెల్లకో తమకు సేసిన యెగ్గులు సైచిరందరున్ ,
తొల్లి , గతించె; నను దూతగఁ బంపిరి సంధిసేయ , నీ
పిల్లలు పాపలున్ బ్రజలు పెంపు వహింపఁగ సంధిసేసెదో,
యెల్లి ,రణంబెఁ గూర్చెదవొ , యేర్పడఁ జెప్పుము? కౌరవేశ్వరా!
.
" అలుఁగుటయే యెఱుంగని మహా మహితాత్ముఁ డజాత శత్రువే
యలిగిన నాడు సాగరములన్నియు యేకముఁ గాక పోవు; క
ర్ణులు పదివేవురైన యని జత్తురు ,నొత్తురు ,రాజరాజ! నా
పలుకుల విశ్వసింపుము! విపన్నుల లోకులఁ గావు మెల్లరన్;
.
" జండాపై కపిరాజు ముందు శితవాజి శ్రేణియుం బూన్చి నే
దండంబున్ గొని దోల స్యందనము మీదన్నారి సారించుచున్
గాండీవంబు ధరించి ఫల్గుణుఁడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱలాలకిపడు ; కురుక్ష్మానాధ! సంధింపఁగన్ !
నను దూతగఁ బంపిరి సంధిసేయ!

4, మే 2016, బుధవారం



 సృష్టికర్త ఒక బ్రహ్మ
 అతనిని సృష్టించినదొక అమ్మ  ॥
 ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
 ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో  ॥

 చరణం : 1

 బొట్టుపెట్టి పూజచేసి
 గడ్డి మేపి పాలు తాగి
 వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోతకోత  ॥
 విత్తునాటి చెట్టు పెంచితే...
 చెట్టు పెరిగి పళ్ళు పంచితే...
 తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మితే
 లోకమా ఇది న్యాయమా? (2)  ॥

 చరణం : 2

 ఆకుచాటు పిందె ముద్దు
 తల్లిచాటు బిడ్డ ముద్దు
 బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు  ॥
 ఉగ్గుపోసి ఊసు నేర్పితే...
 చేయిబట్టి నడక నేర్పితే...
 పరుగు తీసి పారిపోతే
 చేయిమార్చి చిందులేస్తే
 లోకమా ఇది న్యాయమా? (2)  ॥
డ్

26, ఏప్రిల్ 2016, మంగళవారం

పసి తనంలో గుడిలో నాన్న భజాల పైకి ఎక్కి దేముడిని చూసాననుకున్నానుగాని....సాక్షాత్ దేముడి భుజాల పైకి ఎక్కి రాతిబొమ్మను చూస్తున్నానని తెలుసుకోలేకపోయాను....వయసువచ్చి తెలిచే తప్పటకిి నాన్న దూరమయ్యారు....