16, నవంబర్ 2015, సోమవారం

Your Broadband User Id is:  nu8674249639_scdrid@bsnl.in
Your IP Address is:  117.197.231.4
Since you have declined to opt for the "speed restoration"
from now onwards & till the end of the month, You shall be able to browse at reduced speed as per your broadband plan.
To continue browsing with reduced speed
If you have missed an opportunity to avail FUP-SPEED restoration plan
Please Click here Again
** want to TopUp later, Please save & use below link..
172.30.3.130:8080
Please visit http://www.bsnl.co.in for tariff details.
TEST(DON'T CLICK) https://172.30.3.64/bsnlfup/bod_test.php for tariff details.
Kind regards

12, నవంబర్ 2015, గురువారం

11, నవంబర్ 2015, బుధవారం

ఈ దీపావళి పండుగవేళ...
వింటారా..నా బతుకు గోల..!!

నాఈ దేహానికి రాబోయే జనవరి కి 65 సంవత్సరములు రాబోతున్నాయి...పేద్దవాడినవుతున్నాని సంతోషినచనా...ఆయువుతరుగుతుందని విచారించనా...ఇన్నేళ్లుగా..ఏమి సాధించాను..?కష్టపడివుద్యోగంసాధించాను..దాన్ని నిలబెట్టుకోడానికి 40 ఏండ్లు కష్టపడ్డాను..తోడుకోసం అందరిలా పెళ్ళాడాను..పిల్లల్నికన్నాను.. వారి భవిషత్త్తు కోసం నిరంతరం ఆలోచించాను...వారినిసెటిల్ చేసాను...వారికి మంచి జీవిత భాగస్వాములకొరకు ఆరాటపడ్డాను...పెళ్ళిళ్ళు చేసాను.....వారికి పిల్లలుపుట్టాలని ఆశ పడ్డా... పుట్టినపిదప ఆపిల్లలు దగ్గర లేరని బాధ పడుతున్నా..ఇదేనా ...?జీవితమంటే...ఇంతకుమించి నెనుసాధించినది ఏమిటి...?ఈ దేశంలో సామాన్యుడు బ్రతకడమే గొప్ప..ఇంకా సాదించేదేముంటుంది..అనిసరిపెట్టుకొనా...అలా ఆలోచించనా....? త్వరలో..నేను ఎంతగానో ప్రేమించిన అమ్మ నాన్నలనుకలుసుకునే అవకాశము రాబోతుందని... దివంగతులయిన నా తల్లిదండ్రులను చేరే రోజుదగ్గరవుతుందనీ.. మా నాన్న ప్రక్కలో పడుకుని ఆయన కిష్టం అయిన లవకుశ సినీమా లోని పాటలు వినిపించవచ్చుఁ అని... ఆనందించనా....?అలాగే.నా జీవితకాలంలో..నన్ను ప్రేమించిన ..నా
సన్నిహితులను....నా శ్రేయస్సుకోరిన..నాకు సహాయపడిన,దివంగత మిత్రులనందరికలుసుకునే తరుణం రాబోతుందని ...నేను నా జీవితకాలంలో పడిన కష్టసుఖాలు అమ్మా నాన్నలకు చెప్పి బావురుమని తనివితీర వారిఒడిలోచేరి ఏడ్చే అద్భుత అవకాశము నాకు దగ్గరవుతుందనిసంతోసించనా..లేక..నేను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసుకున్న నా బిడ్డలకు..వారిబిడ్డలను...నన్ను మా అమ్మ పోయిన..తర్వాత అర్ధాంగి మాత్రమేగాక.. .ఒక అమ్మలా కంట్లోపెట్టుకునికాపాడుకుని..నన్ను సంతోషపెట్టి...నాకు ఇంత కుటుంబాన్ని..ఇన్ని ఆప్యాయతలు..అనురాగాలు..ఆత్మీయతలను... పంచి ఇఛ్చిన...నా అమాయక   ఇల్లాలను వంటరినిచేసి.. వదిలేసి వెళ్ళ వలసిన రోజు కు దగ్గరవుతున్నానని ..బాధపడనా.......

కవికోకిల,దువ్వూరి రామిరెడ్డి గారన్నట్లు....
అంతములేని యీ భువనమంత పురాతన పాంథశాల, వి
శ్రాంతి గృహంబు, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా
క్రాంతులు పాదుషాలు బహురామ్ జమిషీడులు వేనకువేలుగా
గొంత సుఖించి పోయిరెటుకో పెరవారికి చోటొసంగుచున్....

ఏమిటో...ఈ జీవితం..!!
నిన్న మావూర్లో పిల్లాడిని..
నేడు ఈటౌన్ లోని ముసలోడ్ని...
విధిచేతిలో ఆడిన ఓ కీలుబొమ్మను....
రేపు  నే నేమయినాగానీ...కానీ
ఈ రోజుమాత్రం మీ అందరికీ మంచి స్నేహితుడ్ని!!󾮗

(పండగరోజు  చేసిన నాజీవన సింహావలోకనం...ఆత్మావలోకనం)H









9, నవంబర్ 2015, సోమవారం

ఏతమేసి తోడినా ఏరు ఎండదు 
పొగిలిపొగిలి ఏడ్చినా పొంత నిండదు 
దేవుడి గుడిలోదైనా పూరిగుడిసెలోదైనా గాలి యిసిరి కొడితే.. 
ఆ దీపముండదు.. ఆ దీపముండదు..!!ఏతమేసి!!
పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా 
పసుపుతాడు ముడులేస్తే ఆడదాయిరా
కుడితి నీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాదీ
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుచుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో..!!ఏతమేసి!!
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదరపడినాక పాడె ఒక్కటే ఒల్లకాడు ఒక్కటే
కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా..!!ఏతమేసి!!
జాలాది గారి రచన చక్రవర్తి గారి సంగీతం
బాలు గారి గానం
మూడు సత్యాలు
'ఆధ్యాత్మిక జీవితం' ... అది ఎవరిదైనా నిజంగా ఎంత హాయిగా వుంటుంది. ఎప్పటికప్పుడు తనకు తాను 'చెక్' చేసుకుంటూ, తన గుణగణాలను మెరుగు పెట్టుకొంటూ, తానున్న పరిస్థితులలోనే శాశ్వత ప్రయోజనాలకై కృషి చేస్తూ సాగిపోయే ఆ జీవిత గమనం యొక్క రహదారి దివ్యంగా ఉండదూ, మరి.
సరే ..., ఇప్పుడు ఓ సత్య సిద్ధాంతాన్ని చూద్దాం.
We Won't Get What We Desire,
...We Will Get only What We Deserve.
"మనం కోరుకున్నది మనకు లభించదు, ... మనకు అర్హమైనదే మనకు లభిస్తుంది."
వేటినైతే మనం ఆశిస్తూ, కోరుకుంటూ ఉంటామో అవన్నీ మనవైపోవడం లేదు. వాస్తవానికి దేనిని పొందేందుకైతే మనకు అర్హత ఉంటుందో అది మాత్రవే మనదవుతోంది.
ఇంకొంచెం ముందుకు పోయి
... ఇంకొంచెం లోతైన రెండవ సత్యాన్ని తెలుసుకుందాం:
We Won’t Get What We Deserve,
...We will Get Only What We Need.
"అర్హమైనది దక్కక పోవచ్చు గానీ ... మన నిజమైన అవసరం మాత్రం తప్పకుండా తీరుతుంది."
"నేనంటే ఈ కనిపించే భౌతిక శరీరం మాత్రమే" అనిపించే భ్రమ నుంచి "నేనంటే ఈ దృశ్య ప్రపంచానికి ఆధారమైన ఆత్మ స్వరూపాన్ని” అన్న అవగాహన వచ్చిన తర్వాత ఆత్మ పరిణతిని మించిన శ్రేయస్సు ఇంకేముంటుంది? అంచేత ఇక అప్పటినుంచి అర్హత ఉంది కదా అని వర్తమాన ఆధ్యాత్మిక జీవితానికి అంతగా ఉపయోగించని భౌతిక జీవిత కోరికలు మనకు తీరవు. కేవలం, ఏవేవి లభిస్తే మన 'ఆధ్యాత్మిక ఎదుగుదల' మరింత ఎక్కువుగా సాధ్యపడుతుందో, అటువంటివి మాత్రమే మనవౌతాయి.
ఇకముందుకుపోయి అత్యంత లోతైన మూడో సత్య సిద్ధాంతాన్ని చూద్ధాం.
We Won`t Get What We Need,
... We Will Get Only Those Have That Are Needed For The Society Through Us.
"మన అవసరాలు తీరకపోవచ్చుగానీ ... మన ద్వారా సమాజ ప్రగతికి అవసరాలేవేవైతే వున్నాయో అవి మటుకు తప్పకుండా తీరుతాయి."
ధ్యానిగా, యోగిగా తన జీవిత వైచిత్రాన్ని అంతరంగంలోకి వీక్షించుకున్న ఒకానొక 'ఆత్మజ్ఞాని'కి, ఏ భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలైనా ప్రత్యేకించి ఏముంటాయి? తనలోని బ్రహ్మ పదార్ధమే సకల జీవరాశిలోనూ స్థితమై భాసిల్లుతోందని గ్రహించిన బ్రహ్మజ్ఞాని కి 'స్వంత పరిణితి' అంటూ విడిగా ఏముంటుంది?
తన వాతావరణాన్నీ, సమాజాన్నీ అన్ని విధాలా ఉద్ధరించే కార్యక్రమంలో అంకిత భావంతో మునిగి ఉంటాడు నిజమైన జ్ఞాని. అప్పుడు "నా ద్వారా ఏం జరిగితే అది సమాజ ప్రగతికి తోడ్పడుతుందో అవి మాత్రమే నాకు లభిస్తూంటాయి." అన్న సద్యోస్ఫూర్తి కలిగి వుంటా

6, నవంబర్ 2015, శుక్రవారం

వ్యధలెన్నో వరిస్తేనే,విరియును పెదవులపై ఈ నవ్వులు
గర్వమైన నడకవేనుక దాగున్నవి ఎన్నో పాదాల పగుళ్ళు
శ్రమతోప్రయత్నిన్చందే విజయం నిన్ను వరించదు
చమురు వత్తి కాలందే దీపం వెలుగు నివ్వలేదు
గులాబిపువ్వైనా విచ్చుకోనిదే పరిమళాలు అందించలేదు