11, నవంబర్ 2015, బుధవారం

ఈ దీపావళి పండుగవేళ...
వింటారా..నా బతుకు గోల..!!

నాఈ దేహానికి రాబోయే జనవరి కి 65 సంవత్సరములు రాబోతున్నాయి...పేద్దవాడినవుతున్నాని సంతోషినచనా...ఆయువుతరుగుతుందని విచారించనా...ఇన్నేళ్లుగా..ఏమి సాధించాను..?కష్టపడివుద్యోగంసాధించాను..దాన్ని నిలబెట్టుకోడానికి 40 ఏండ్లు కష్టపడ్డాను..తోడుకోసం అందరిలా పెళ్ళాడాను..పిల్లల్నికన్నాను.. వారి భవిషత్త్తు కోసం నిరంతరం ఆలోచించాను...వారినిసెటిల్ చేసాను...వారికి మంచి జీవిత భాగస్వాములకొరకు ఆరాటపడ్డాను...పెళ్ళిళ్ళు చేసాను.....వారికి పిల్లలుపుట్టాలని ఆశ పడ్డా... పుట్టినపిదప ఆపిల్లలు దగ్గర లేరని బాధ పడుతున్నా..ఇదేనా ...?జీవితమంటే...ఇంతకుమించి నెనుసాధించినది ఏమిటి...?ఈ దేశంలో సామాన్యుడు బ్రతకడమే గొప్ప..ఇంకా సాదించేదేముంటుంది..అనిసరిపెట్టుకొనా...అలా ఆలోచించనా....? త్వరలో..నేను ఎంతగానో ప్రేమించిన అమ్మ నాన్నలనుకలుసుకునే అవకాశము రాబోతుందని... దివంగతులయిన నా తల్లిదండ్రులను చేరే రోజుదగ్గరవుతుందనీ.. మా నాన్న ప్రక్కలో పడుకుని ఆయన కిష్టం అయిన లవకుశ సినీమా లోని పాటలు వినిపించవచ్చుఁ అని... ఆనందించనా....?అలాగే.నా జీవితకాలంలో..నన్ను ప్రేమించిన ..నా
సన్నిహితులను....నా శ్రేయస్సుకోరిన..నాకు సహాయపడిన,దివంగత మిత్రులనందరికలుసుకునే తరుణం రాబోతుందని ...నేను నా జీవితకాలంలో పడిన కష్టసుఖాలు అమ్మా నాన్నలకు చెప్పి బావురుమని తనివితీర వారిఒడిలోచేరి ఏడ్చే అద్భుత అవకాశము నాకు దగ్గరవుతుందనిసంతోసించనా..లేక..నేను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసుకున్న నా బిడ్డలకు..వారిబిడ్డలను...నన్ను మా అమ్మ పోయిన..తర్వాత అర్ధాంగి మాత్రమేగాక.. .ఒక అమ్మలా కంట్లోపెట్టుకునికాపాడుకుని..నన్ను సంతోషపెట్టి...నాకు ఇంత కుటుంబాన్ని..ఇన్ని ఆప్యాయతలు..అనురాగాలు..ఆత్మీయతలను... పంచి ఇఛ్చిన...నా అమాయక   ఇల్లాలను వంటరినిచేసి.. వదిలేసి వెళ్ళ వలసిన రోజు కు దగ్గరవుతున్నానని ..బాధపడనా.......

కవికోకిల,దువ్వూరి రామిరెడ్డి గారన్నట్లు....
అంతములేని యీ భువనమంత పురాతన పాంథశాల, వి
శ్రాంతి గృహంబు, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా
క్రాంతులు పాదుషాలు బహురామ్ జమిషీడులు వేనకువేలుగా
గొంత సుఖించి పోయిరెటుకో పెరవారికి చోటొసంగుచున్....

ఏమిటో...ఈ జీవితం..!!
నిన్న మావూర్లో పిల్లాడిని..
నేడు ఈటౌన్ లోని ముసలోడ్ని...
విధిచేతిలో ఆడిన ఓ కీలుబొమ్మను....
రేపు  నే నేమయినాగానీ...కానీ
ఈ రోజుమాత్రం మీ అందరికీ మంచి స్నేహితుడ్ని!!󾮗

(పండగరోజు  చేసిన నాజీవన సింహావలోకనం...ఆత్మావలోకనం)H









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి