12, జనవరి 2016, మంగళవారం

కుంకుళ్ళెరుగని తల అంట్లు..
నలుగులెరుగని స్నానాలు..
సాంబ్రాణి ధూపం తెలియని కురులు..
పూలకి నోచుకోని కత్తిరించుకున్న జడలు..
కాటుకెరుగని కళ్ళు..
గాజులెరుగని కరాలు
అందెలు తెలియని పాదాలు
గోరింట మెరియని నఖాలు
వరిపిండే కలవని రంగవల్లులు..
పట్టుపావడాలెరుగని చిన్నారులు
ఓహో.. పండగొస్తోంది..
ప్లాస్టిక్ తోరణాలు..
ఫేసుబుక్కుల్లో ముగ్గులు
కొని తెచ్చుకున్న పిండివంటలు ..
వాట్స్ అప్పుల్లో శుభాకాంక్షలు..
ఓహో సంబరాలిస్తుంది..
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకంటూ
కోడిపుంజుల చావులు..
సంప్రదాయమంటూ నాయకుల వికృతాలు..
జూదాలంటూ జనాల అప్పులు..
వహ్వా పట్టేయ్యాలంటూ పోలీసుల లంచాలు..
ఓహో సంక్రాంతి  సంబరాలు..
తెలుగు నేలపై కృత్రిమ కోలాహలాలు..
ఓహో సంక్రాంతి పండగొస్తోందోచ్.....
--:o0o:--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి