19, ఆగస్టు 2016, శుక్రవారం

ఆంధ్రుల ఆత్మ గౌరవం.....

కుమ్మరి చేతిని ఉన్న మట్టి కుండను నేను
మంగలి చేతిన ఉన్న దువ్వేన కత్తెర నేను
స్వర్ణకారుని చేతినున్న బంగారం పూత నేను
మాదిగల రూపొందించిన చెప్పుల సప్పుడు నేను
నా మాల సోదరుల డప్పుల గోల నేను
చాకలి ఆయుధమైన ఉతికే బండను నేను
కాపు రెడ్లు కమ్మలు దున్నుతున్న కడెద్దుల కొమ్మును నేను
బ్రాహ్మణుని బతుకుతెరువు జంద్యం గుర్తును నేను
శత్రువులను నరికేసే క్షత్రియ కత్తిని నేను
ఊరూరా తిరుగుతున్న గంగిరెద్దు గెంతును నేను
పెళ్ళింట మొగుతున్న సన్నాయి సప్పుడు నేను
చావింట మొగుతున్న జంగమయ్య గంటను నేను
వైశ్యుడి వ్యాపారం తారాజు ముల్లును నేను
చెనేతల బట్టను కుట్టనెత్తే మాఘమ్ నేను
గౌడన్నలు కల్లును తీసే మోకును నేను
పడవల్ల్లో వెళ్లిన గంగపుత్రుల వలను నేను
వడ్రంగుల చేతిన మలచిన చక్కని బొమ్మనేను
ఇంటి ఇంటికి వెళ్లి బుర్రకథను చెప్పే అరుపు నేను
పల్లె పల్లెనా ఉట్టిన కట్టే బట్టను నేను
పూసల్లోల్ల చేసిన చక్కని పూసల దండను నేను
నా జాతినున్న ప్రతి కులపు బతుకు తెరువు నాదే
అన్నమయ్య చేతునున్న ఘట్టం నేను
శ్రీ శ్రీ రాసిన విప్లవ కవిత్వపు ఉరుము నేను
వీర శివాజీ చేతినున్న భవాని ఖడ్గం కొనను నేను
ఝాన్సీ లక్ష్మి రుద్రమ్మ ధైర్యం నా శక్తికి రూపం
నేనెవరు నేనెవరు నేనెవరు అని అడిగితే
.... ఈ బ్రహ్మండం బద్దలు కొట్టేలా
.... పంచభూతాలు విలయతాండవం చేసేలా
..... నా అరుపుల విన్న గుండెకు జడిసేలా
అరిసి అరిసి గట్టిగా అరిసి చెప్తున్నా....
గర్వంగా చెప్తున్నా
ధైర్యం గా చెప్తున్నా
తెలుగు వాడినన్న పొగరు తో చెప్తున్నా....నేను తెలుగు వాడి
ఆత్మగౌరవం ను...తెలుగు వాడిని నేను తెలుగు నాడు నాది ......

ఆస్తుల కోసం పుట్టిన పార్టీ కాదు..
ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ .....

అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు...
అధినాయకుడి పౌరుషం లో నుండి పుట్టిన పార్టీ ....

పాలించడం కోసం పుట్టిన పార్టీ కాదు...
పేదల కన్నీళ్ళు తుడవడానికి పుట్టిన పార్టీ ....

అన్నా...అన్నా....అన్నా......
అంటూ రాష్ట్రం మొత్తం హోరేత్తితే సింహ గర్జన తో...
ఢిల్లీ సింహాసనం ను వణికించిన వీరుడి
చెమట నెత్తుటితో పుట్టిన పార్టీ...

అలాంటి అభిమానులే ఈ తెలుగుదేశం జెండాను..
ఈ తెలుగుదేశం పార్టీ నీ కనురెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు...

కత్తులతో దాడులు చేసినా.
బాంబులతో చంపినా..
కాళ్లు చేతులు విరిచినా....

మా వైకల్యం మాత్రం పార్టీ కీ అడ్డు రాదు..
అడ్డు లేదు అనీ....

మా వెంట ప్రచార కార్యక్రమాల వెంబడి ..
వీల్ చైర్లు వేసుకొనీ మరీ వచ్చిన వారిని చూసాము....

నాయకులు వీల్లకి వచ్చే బిల్లు లు తిన్నా..
ఇంఛార్జ్ లు కనీసం వీరికి వచ్చే ఫండ్స్ నొక్కేసినా...

కాళ్లు లేకున్నా..ఎత్తుకొని వచ్చేవారిని చూసాను..
కళ్లు కనిపించకపోయినా స్పీచ్ విందామనీ వచ్చే వాల్లని చూసాను...

శరీరం సహకరించకపోయినా ....మహానాడు కు మన నేత వస్తాడు అనీ ఎదురు చూపుతో వచ్చే వారిని చూసాను..

34 సంవత్సరాల కాలంలో పార్టీ లో ఎంతో మంది వచ్చారు పోయారు..

అన్న గారి వారసులు కూడా పార్టీ ని వీడారు..మౌనం వహించారు ...

పదవుల కోసం అధికారం కోసం తగువులాడుకున్నారు కానీ.

నిజమైన అభిమానులు మాత్రం
అప్పటి కీ ఇప్పటి కీ ఎప్పటికీ....

ఇలాగే ఉన్నారు ..
వాల్ల పరిస్థితులు మారలేదు ..
వాల్ల బతుకులు మారలేదు..
అలాగే పార్టీ పట్ల వారి అభిమానం కూడ మారలేదు ..

పార్టీ మాకేమిచ్చింది అనీ కాదు..
పార్టీ కి మనమేం ఇచ్చాం అనే కార్యకర్తలు కేవలం తెలుగుదేశం లోనే ఉన్నారు ...

నిజంగా వీరి అభిమానం ఉండబట్టే ఇంకా ysr ని ఎదిరించి మరీ నిలబడింది ....

కానీ..విషాదకరమైన విషయం ఏంటంటే వీల్లని పట్టించుకొనే నాధుడే లేడు....

అయినా తెలుగుదేశం జెండా కనిపిస్తే..
తెలుగుదేశం గురించి ఎవరైనా సప్పోర్ట్ గా మాట్లాడితే...
అన్నా అంటూ వయస్సు చిన్నదైనా ..
ఆప్యాయంగా మాట్లాడే ఇలాంటి కార్యకర్తలు..

నిజంగా నా అన్న తెలుగుదేశం పార్టీ లోనే ఉన్నారు..

I'm really proud of you.....

Ysrcp.లోకి వచ్చేయండీ..జీవా..మీకు వేలల్లో డబ్బులు వేస్తాం.....

అన్నా గానీ....

సున్నితంగా తిరస్కరించి ....

మాకు ఇలాంటి కార్యకర్తలు ఒక కుటుంబం లాగా ఉన్నామండీ..మమ్మల్ని వేరు చేయకండీ...

కులాలకు అతీతం మా తెలుగుదేశం పార్టీ ...
మా పార్టీ కార్యకర్తలు పేదలై ఉండొచ్చు..
కానీ అభిమానం లో శ్రీమంతులు ...అనీ అన్నాను...

అందుకే ఈ జన్మ ఏ జన్మ ల అనుబంధమో...
ఈ పార్టీ లో మేమంతా ఒక కుటుంబం ....
మాదంతా తెలుగుదేశం ....

కమ్మ కాపు రెడ్డి బోయ గౌడ కురువ మాల మాదిగ వెలమ రాజు లు అనే తేడా లేకుండా ...

కార్యకర్తలం కలిసే ఉన్నాం కలిసే ఉంటాం.కలిసే చస్తాం ..

నాయకులకు పార్టీ జెండా భారం అవొచ్చు..
కానీ కార్యకర్తలు ఎప్పుడు గుండెల మీద మోస్తునే ఉన్నారు..

ఇదే మా పార్టీ గొప్పతనం ...

ఏం పెట్టావ్ తాతా...
ఈ పార్టీ జెండాలో...

పసుపు జెండాను చూస్తే కల్లు పైరెక్కి పచ్చగ అయి
గుండె అన్నా అన్నా అంటూ...
జై తెలుగుదేశం అంటూ .....
తొడగొట్టి మీసం మెలేసీ...మరీ....
విజిల్స్ వేయాలనీ అనిపిస్తుంది ...

తెలుగుదేశం కార్యకర్తలు అంటే సాఫ్ట్ వేర్ అయినా ఎంప్లాయ్స్ అయినా ..క్లాస్ అనుకున్నారేమో...

మా....స్......ఊ....ర...మా.....స్...

ఎలక్షన్లకు మూడు నెలలు ముందు దిగే బాపతు కాదు మాదీ
అయిదేళ్ళు అనుక్షణం పార్టీ నీ తలచుకొనే కేడర్‌ మాది...

జై తెలుగుదేశం
జై జై తెలుగుదేశం ..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి