20, ఫిబ్రవరి 2018, మంగళవారం

లడు హోంహోం
Click Here!

వ్యాధులు - బాధలు
 చూసుకోండ.మీ ట్రైగ్లిజరైడ్లు!

కొలెస్ట్రాల్‌.. దీని గురించి మనకు ఇప్పుడు ఎంతో కొంత తెలుసు. మనం కొలెస్ట్రాల్‌ గురించి ఎక్కువే ఆందోళన చెందుతున్నాం. తరచుగా కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకుని చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే వెంటనే తగ్గించుకునే మార్గం గురించి ఆలోచిస్తున్నాం. ఇది అవసరమేగానీ.. ఇంతకంటే ప్రాముఖ్యం ఉన్నదీ, మనం బాగా నిర్లక్ష్యం చేస్తున్నదీ మరోటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు!

మనం ‘లిపిడ్‌ ప్రొఫైల్‌’ పరీక్ష చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్‌తో పాటుగా రిపోర్టులో ఇది కూడా ఉంటుందిగానీ దీన్ని గురించి మనం ఎక్కువగా పట్టించుకోవటం లేదు. ఇది సరికాదు. ఆరోగ్య పరంగా, వైద్యపరంగా కొలెస్ట్రాల్‌ కంటే ట్రైగ్లిజరైడ్లకు కాస్త ఎక్కువ ప్రాధాన్యమే ఉందిగానీ తక్కువ కాదు. ముఖ్యంగా మన భారతీయుల్లో చాలా అనారోగ్యాలకు, వ్యాధులకు ట్రైగ్లిజరైడ్లే కీలక పాత్ర  పోషిస్తున్నాయి. అందుకే దీనికి సంబంధించిన వివరాలు మీ ముందుకు తెస్తోంది సుఖీభవ!
భారతీయుల్లో మరీ ఎక్కువ: మన భారతీయులకు రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువుండటం కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువుండటమనే సమస్య అధికం! ఈ విషయాన్ని యాభై ఏళ్లుగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వంటి అత్యున్నత సంస్థలు చేస్తున్న అధ్యయనాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఆ విజ్ఞానం రోగుల వరకూ, చికిత్సల వరకూ రావటం లేదు. వైద్యులు కూడా కొలెస్ట్రాల్‌ గురించి తీసుకున్నంతటి శ్రద్ధ ఈ ట్రైగ్లిజరైడ్ల విషయంలో చూపించటం లేదన్న వాదన ఉంది. కానీ మన భారతీయులకు సంబంధించి ట్రైగ్లిజరైడ్లు మరీ కీలకమైనవని గుర్తించటం చాలా అవసరం.
ఎక్కువుంటే నష్టం ఏమిటి?
* ట్రైగ్లిజరైడ్లు ఎక్కువుంటే గుండె జబ్బులు పొంచి ఉంటాయి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువ ఉండటం వల్ల ఎప్పుడైనా కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, రక్తనాళాల వ్యాధుల వంటివన్నీ పొంచి ఉంటాయి. ఇదొక రకం సమస్య అయితే... గుండె, రక్తనాళాల జబ్బుల బారినపడుతున్న 70% మందికి కొలెస్ట్రాల్‌ సాధారణ స్థాయిలోనే ఉండి, కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి చాలా రకాల జీవనశైలి సంబంధ రుగ్మతలకు ట్రైగ్లిజరైడ్లను మూలంగా భావిస్తున్నారు.
* ట్రైగ్లిజరైడ్ల స్థాయి చాలా ఎక్కువైతే (ఈ సమస్య మద్యం ఎక్కువగా తాగే వారిలో మరీ అధికం) క్లోమగ్రంథి దెబ్బతినే ‘పాంక్రియాటైటిస్‌’ అనే తీవ్ర సమస్య తలెత్తుతుంది.
* ట్రైగ్లిజరైడ్లు అనేవి కొవ్వు పదార్థం. ఇవి ఎక్కువగా ఉంటే శరీరంలోని ప్రతి జీవ రసాయన క్రియకూ అడ్డుపడుతూ శారీరక ప్రక్రియలన్నింటినీ మందగింపజేస్తాయి. హైపోథైరాయిడిజం, లివర్‌ సిరోసిస్‌ వంటి సమస్యలుంటే దీనివల్ల అవి ఎక్కువ కావచ్చు.
* ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం వల్ల అతిపెద్ద నష్టం- రక్తనాళాల గోడలు దెబ్బతినటం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ కొవ్వు ముద్దలు పేరుకోవటం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి అక్కడ కొలెస్ట్రాల్‌ పేరుకోవటానికి ముందే- రక్తంలో అధికంగా ఉన్న ట్రైగ్లిజరైడ్లు ఆ ప్రాంతాన్ని (ఎండోథీలియం) దెబ్బతీస్తాయి. ఇవి ముందు దెబ్బతీస్తే.. తర్వాత ఆ  ప్రదేశంలో కొలెస్ట్రాల్‌ (ఎథిరోమా) వచ్చి పేరుకుంటుంది. వాస్తవంగా పరీక్షించి చూస్తే అక్కడ పేరుకునే దానిలో కొలెస్ట్రాలే ఉండొచ్చుగానీ అసలు దారి తీసే పరిస్థితిని సృష్టించేవి ఈ ట్రైగ్లిజరైడ్లే! కాబట్టి ముందే వీటిని అడ్డుకుంటే కొలెస్ట్రాల్‌ పేరుకునే సమస్యను బాగా నివారించవచ్చు.
ఎందుకు పెరుగుతాయి?
1. వూబకాయం, 2. మధుమేహం
3. మద్యం ఎక్కువగా తీసుకోవటం వల్లగానీ, క్లోమంలో రాళ్ల వల్లగానీ ఏదైనా కారణంతో పాంక్రియాస్‌ గ్రంథి వాపునకు గురైతే దానివల్ల ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి.
4. లివర్‌ జబ్బులు, సిరోసిస్‌, 5. పసరుతిత్తిలో రాళ్ల వంటివీ ట్రైగ్లిజరైడ్లను పెంచుతాయి.
6. పుట్టుకతో వచ్చే కొన్ని కొవ్వుల సమస్యలు. ఇవి ప్రధాన కారణాలేగానీ..
వాస్తవానికి భారతీయుల్లో 70% మందికి ఇవేమీ లేకుండా కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీటి విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది.
మన తీరు వేరు!
మనం ఆహారం తీసుకుంటాం. అది జీర్ణమై.. మన శరీరానికి అవసరమైన శక్తి రూపంలోకి ఎలా పరిణామం చెందుతోంది? ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందన్న దానిపై బెంగళూరుకు చెందిన సెయింట్‌ జాన్స్‌ వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం వారు దాదాపు 25 ఏళ్ల క్రితమే లోతుగా అధ్యయనం చేసి.. ఈ విషయంలో మన భారతీయులకూ - పాశ్చాత్యులకూ మధ్య చాలా కీలకమైన వ్యత్యాసం ఉందని గుర్తించారు. ఆహారం తీసుకున్నప్పుడు దానిలోని కొవ్వు పదార్ధాల్ని మన భారతీయుల్లో శరీరం ముందుగా గ్లిజరాల్‌, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చుకుని.. పేగుల గోడల్లోనే ‘ట్రైగ్లిజరైడ్లు’గా మార్చేసుకుని.. అక్కడి నుంచే దాన్ని దాచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అలా నిల్వ రూపంలోకి మార్చుకోగా మిగిలే దాన్నే శక్తిగా మార్చుకుని ఖర్చు పెడుతోందని గుర్తించారు. కానీ పాశ్చాత్యుల్లో వారి శరీరం తిన్న ఆహారంలోని కొవ్వుల్ని ముందుగా గ్లిజరాల్‌, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చుకుని.. శక్తిలా వినియోగించుకుంటూ, అలా వాడుకోగా మిగిలిన దాన్ని అప్పుడు ట్రైగ్లిజరైడ్లు, కొవ్వులుగా మార్చుకుని నిల్వ చేసుకుంటోంది. మన భారతీయులకూ, పాశ్చాత్యులకూ ఇంత తేడా ఎందుకు వచ్చిందన్న దానికి చాలా సిద్ధాంతాలున్నాయి. బలంగా వినిపించేది మాత్రం ‘థ్రిఫ్టీ  జీన్‌’ సిద్ధాంతం. దీనిప్రకారం ఒకప్పుడు మన ప్రాంతంలో కరవులు, క్షామాలు ఎక్కువగా ఉండటం వల్ల శక్తిని, ఆహారాన్ని ఎక్కువగా నిల్వ ఉంచుకునేందుకు మనలో జన్యుపరంగానే మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్ల పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయుల్లో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తలెత్తుతోంది. కొలెస్ట్రాల్‌ కంటే మరీ ప్రమాదం..  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలన్నీ కూడా కొలెస్ట్రాల్‌ కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం మరింత ప్రమాదకరమైన విషయమని నానాటికీ గుర్తిస్తున్నాయి. క్రమేపీ వైద్యరంగం దృష్టి కొలెస్ట్రాల్‌ మీది నుంచి ట్రైగ్లిజరైడ్ల మీదికి మళ్లుతోంది. అందుకు ముఖ్యమైన ఉదాహరణ- ఆధునిక రుగ్మతలన్నింటికీ మూలకారణంగా భావిస్తున్న ‘మెటబాలిక్‌ సిండ్రోమ్‌’ను నిర్వచించే విషయంలో దానికి కారణమయ్యే అంశాల్లో ‘టోటల్‌ కొలెస్ట్రాల్‌’కు బదులుగా ట్రైగ్లిజరైడ్లను ఉంచటం! ఆ కారణాలేమిటన్నది చూస్తే- బొజ్జ, అధిక బీపీ, రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్‌ తక్కువుండటం. దీన్నిబట్టి ట్రైగ్లిజరైడ్ల ప్రాధాన్యం సుస్పష్టం.
తగ్గించుకునేదెలా?:  ట్రైగ్లిజరైడ్లు స్థాయిని మించి ఉంటే వాటిని తగ్గించుకోవటం అవసరం. ఇందుకు జీవనశైలిని మార్చుకోవటం కీలకం.
* లావుగా ఉంటే బరువు తగ్గాలి.
* మద్యం, పొగతాగటం వల్ల ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. వాటికి దూరంగా ఉండాలి.
* కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండే మాంసాహారం తగ్గించాలి.
* అన్ని రకాల నూనెలు, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి.  * తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు తింటే ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి వీటిని బాగా తగ్గించాలి. బజార్లో ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాలు, రకరకాల చిప్స్‌, నూడుల్స్‌, సేమియా, పాస్తా, పిజ్జాల వంటివి, కేకులు, బిస్కట్లు.. ఇవన్నీ తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలే.
వీటన్నింటినీ తగ్గించాలి
* పంచదార, జామ్‌లు, జెల్లీల వంటివి ఎక్కువగా తినేవారికి ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పంచదార, తీపి పదార్థాలు బాగా తగ్గించెయ్యాలి. కాఫీలో కూడా పంచదార మానెయ్యటం మంచిది.
* మామూలుగా మధుమేహం ఉన్నవారు పండ్ల వంటివి మితంగా తినటం, కాఫీలో పంచదార వంటివి మితంగా వేసుకున్నా ఫర్వాలేదుగానీ ట్రైగ్లిజరైడ్లు ఎక్కువున్న వారు మాత్రం పండ్లు, పంచదార, కూల్‌డ్రింకుల వంటి వాటన్నింటినీ మానెయ్యటం, మరీ అవసరమైతే చాలాచాలా మితంగానే తీసుకోవటం ముఖ్యం.
తేలికగా జీర్ణమయ్యే వరి అన్నం మానేసి గోధుమలకు, చపాతీలకు మారటం మంచిది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను ఇవ్వటం వల్ల ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయన్న భావన ఒకటుందిగానీ వీటితో ఆశించినంత ఫలితం ఉండటం లేదని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.
ఎంత ఉండాలి?
మన రక్తంలో ట్రైగ్లిజరైడ్లు..
* 100 ఎంజీ/డీఎల్‌ లోపు ఉండటం ఉత్తమం
* 150 ఎంజీ/డీఎల్‌ వరకూ ఫర్వాలేదు, దాటితే రిస్కులు పెరుగుతాయి * 200 ఎంజీ/డీఎల్‌ దాటితే చికిత్స తప్పదు.
పరీక్ష ఎలా?:  మన రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయులు తేలికగా ప్రభావితమవుతుంటాయి. కాబట్టి పరీక్షకు వెళ్లే ముందు రోజు రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తీసుకోకుండా ఉండాలి. రాత్రిపూట ప్రయాణాలు చేసినా, రాత్రంతా మేలుకున్నా, మద్యం తాగినా, మసాలా పదార్థాలు తిన్నా ట్రైగ్లిజరైడ్లు పెరిగిపోతాయి. కాబట్టి ఇవేమీ చెయ్యకుండా ఉదయం పరగడుపున, లేచిన గంటలోపు పరీక్ష కోసం రక్తం నమూనా ఇవ్వాలి. సాధారణంగా కొలెస్ట్రాల్‌ పరీక్షతో పాటే దీన్నీ చేస్తారు.
ఏమిటీ ట్రైగ్లిజరైడ్లు? ట్రైగ్లిజరైడ్లనేవి ఒక రకమైన కొవ్వులు. ఇవి కూడా మనకు కీలకమైన శక్తి నిల్వలు. ఈ ట్రైగ్లిజరైడ్లను మన శరీరం గ్లూకోజుగా మార్చుకుని శక్తిగా వినియోగించుకుంటుంది. మనం ఆహారం తీసుకున్న మొదటి రెండు మూడు గంటల్లో రక్తంలో గ్లూకోజు పెరిగినట్లే ట్రైగ్లిజరైడ్లు కూడా పెరుగుతుంటాయి. గ్లూకోజు కొద్దిగంటల్లోనే తరిగిపోతుందిగానీ ట్రైగ్లిజరైడ్లు మాత్రం నిల్వ రూపాలు కాబట్టి అంత త్వరగా తగ్గవు. మన శరీరం నిరంతరం గ్లూకోజును, దానితో పాటే ఈ ట్రైగ్లిజరైడ్ల నిల్వలను శక్తిరూపంలో మార్చుకుని వాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ మనం 15-18 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండిపోతే అప్పుడు శరీరంలో గ్లూకోజు నిల్వలు మొత్తం అయిపోయి.. అప్పుడు శరీరం పూర్తిగా ట్రైగ్లిజరైడ్ల మీదే, వాటిని శక్తిగా మార్చుకోవటం మీదే ఆధారపడుతుంది. అయితే ట్రైగ్లిజరైడ్లు కేవలం శక్తిగా మారటమే కాదు.. కొలెస్ట్రాల్‌ కొవ్వుగా కూడా మారుతుంటాయి. అందుకే ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే అవి ఎల్‌డీఎల్‌ వంటి కొలెస్ట్రాల్‌ రూపంలోకి మారుతూ... కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగటానికీ దోహదం చేస్తాయి. ఇదే వీటితో పెద్ద సమస్య. మొత్తమ్మీద- ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ. 70% భారతీయుల్లో కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువ ఉంటాయి, వీటిని వదిలేస్తే మున్ముందు కొలెస్ట్రాల్‌ పెరగటానికి దారి తీస్తాయి. కాబట్టి ట్రైగ్లిజరైడ్లనే నియంత్రిస్తే మున్ముందు కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకునే అవకాశం ఉంటుందని గుర్తించాలి. కాబట్టి కొలెస్ట్రాల్‌ పరీక్ష ఒక్కటే చేసి చూసుకుంటూ అది బాగుంటే అంతా బాగుందని భావించటం సరికాదు. ట్రైగ్లిజరైడ్లు కూడా చూసుకోవటం అవసరం. రక్తంలో ట్రైగ్లిజరైడ్లు స్థాయికి మించి ఉండటాన్ని ‘హైపర్‌ ట్రైగ్లిజరిడీమియా’ అంటారు. ఇవి ఎక్కువున్నా ఎటువంటి లక్షణాలూ ఉండవుగానీ క్రమేపీ శరీరంలో వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
చికిత్స: కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు.. ఈ రెంటిలో ట్రైగ్లిజరైడ్లను తగ్గించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే కొలెస్ట్రాల్‌!
* హైపోథైరాయిడిజం, పాంక్రియాటైటిస్‌, మధుమేహం వంటి ఇతరత్రా కారణాల వల్ల ట్రైగ్లిజరైడ్లు పెరిగితే.. ఆ సమస్యలకు చికిత్స చేస్తే ట్రైగ్లిజరైడ్లూ తగ్గిపోతాయి.
* ఇతరత్రా సమస్యలేమీ లేకుండా కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే 200 కంటే ఎక్కువ ఉంటే వారికి పిండి పదార్థాలు తగ్గించటం వంటి జీవనశైలి మార్పులతో పాటు ప్రత్యేకించి ట్రైగ్లిజరైడ్లను తగ్గించేందుకు ఇచ్చే ‘ఫైబ్రైట్స్‌’ రకం మందులు కూడా ఇస్తారు.
* ట్రైగ్లిజరైడ్లతో పాటు కొలెస్ట్రాల్‌ కూడా ఎక్కువగా ఉంటే ముందు కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లను సిఫార్సు చేస్తారు. దానితో ట్రైగ్లిజరైడ్లూ తగ్గుతాయి. ఒకవేళ అలా తగ్గకపోతే ట్రైగ్లిజరైడ్లను తగ్గించే ఫైబ్రైట్స్‌ సిఫార్సు చేస్తారు. ఒకవేళ కొలెస్ట్రాల్‌ పరిమితుల్లోనే ఉండి కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువగా ఉంటే ‘ఫైబ్రైట్స్‌’ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది.
* కొలెస్ట్రాల్‌ తగ్గించటానికి ఇచ్చే స్టాటిన్‌ మందులూ, ట్రైగ్లిజరైడ్లు తగ్గించేందుకు ఇచ్చే ఫైబ్రైట్‌ మందులూ.. రెండూ కలిపి వాడితే శరీరంలోని కండర క్షీణత రావచ్చు. కాబట్టి ఈ రెంటినీ వాడుకునేటప్పుడు 3 నెలలకు ఒకసారి సీపీకే అనే ఎంజైమ్‌ (క్రియాటినైన్‌ ఫాస్ఫో కైనేస్‌) పరీక్ష చేయించుకుని అది పెరుగుతున్నట్లుంటే వైద్యుల సలహాతో ఈ రెంటిలో ఏదో ఒక దాన్నే తీసుకోవాల్సి ఉంటుంది.
* మధుమేహం ఉన్న వారికి మధుమేహాన్ని సమర్థంగా నియంత్రణలోకి తెస్తే ట్రైగ్లిజరైడ్లు కూడా చాలా వరకూ నియంత్రణలోకి వస్తాయి. ఒకవేళ రాకపోతుంటే దీనికీ మందు తీసుకోవాలి.  మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోవటం, దాన్ని తగ్గించుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వటం తప్పనిసరి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పండ్లు మానెయ్యటం, లేదా బాగా తగ్గించటం మంచిది.
 Facebook Share Twitter Share Google Share WhatsApp Share

మరిన్ని

మైనస్‌కు బెదరొద్దు!
హ్రస్వదృష్టి(మయోపియా).చిన్నతనంలోనే మొదలయ్యేచూపు సమస్య.ఇది పిల్లలతో పాటే ఎదుగుతూ వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే .

జుట్టుకూ ‘ఉప్పు’ బాధలు?
మనం రోజూ ఉద్యోగాలు, వ్యాపారాల మీద పలు చోట్లకు తిరుగుతుంటాం. ఇలాంటి పనుల్లో పడి పెద్దగా గమనించం గానీ గాలి, .

ఆసక్తి సరే..అతి విశ్వాసం వద్దు!
ఊబకాయం.. ప్రపంచానికే పెద్ద గుదిబండ! అందుకే ఒంటి బరువు వదిలించుకునేందుకు నోరు కట్టుకోవటం, ఒళ్లు వంచటం నుంచి పొట్ట కుట్టేయటం వరకూ.. రకరకాల విధానాలపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకీ వచ్చాయి. .

ఆందోళన సాధారణమా? సమస్యనా?
ఉన్నట్టుండి ఏదో ప్రమాదం ఎదురైందనుకోండి. వెంటనే వెన్నులోంచి భయం పుట్టుకొస్తుంది. గుండెదడ మొదలవుతుంది..

యుద్ధం..మరో అడుగు ముందుకేద్దాం!
యుద్ధం నేర్చాం! వ్రణంతో అనాదిగా సాగుతున్న రణంలో గుట్టుమట్లన్నీ శోధించి.. అస్త్రశస్త్రాలన్నీ సంధించి.. ఇప్పటికి శత్రువును సమర్థంగా మట్టుబెట్టగలుగుతున్నాం! అనుమానమేం లేదు.. ఇప్పుడు క్యాన్సర్‌పై మనది పైచెయ్యే. కానీ ఇక్కడితో ఆగితే ఈ యుద్ధానికి అర్థం లేదు. ఇప్పుడు వేగం తగ్గిస్తే పడిన కష్టానికి ఫలితం ఉండదు..

సరిగా పట్టడం లేదా?
నిద్ర సరిపోకపోవడం, రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టకపోవడం, పగలు మత్తుగా అనిపించడం.. ఏదో తెలియని ఆందోళన ఇవన్నీ.....

మహా ద్వారం మంచిగుండాలి!
నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది. మనందరికీ తెలిసిన చక్కటి సామెత ఇది! దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. నోరు మంచిగా ఉంటే.. ఒళ్లు మంచిగా ఉంటుంది! ఎందుకంటే నోటి శుభ్రత అన్నది దంత సమస్యలు రాకుండా ఉండటం కోసమే కాదు.. ఒంట్లో ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి కూడా కీలకమే!.

బీపీ.. ఇంట్లోనే చూసుకోవడం మేలట!
ఒక సినిమా చూస్తూ అందులో ఒక సీన్‌ని మాత్రం మనం స్క్రీన్‌షాట్‌ తీశామనుకోండి... అదే మొత్తం కథ అవుతుందా? అలాగే బీపీ చూసుకోవటం కూడా! రోజంతా మన శరీరంలో రక్తపోటు వివిధ రకాలుగా మారుతూ ఉంటుంది..

కోత చిన్నది! లాభం పెద్దది!!
ఓ చిక్కుముడితో మొదలుపెడదాం! చాలా చిన్న ఇరుకు గది.. నాలుగ్గోడలతో పూర్తిగా మూసేసి ఉంది. ఆ గది మధ్యలో ఒక మోటరు పంప్‌. అది రోజంతా ఆడుతూనే ఉంటుంది. కాలం నడిచిపోతోంది, అంతా బానే ఉంది. కానీ కొన్నేళ్లకు ఆ మోటారు.. మొరాయించటం మొదలెట్టింది. అప్పుడు మనమేం చేస్తాం? దానికి ఏం మరమ్మతు చెయ్యాలన్నా గోడ పగలగొట్టాలి.. లోపలకు వెళ్లాలి. రిపేరు చేసి మళ్లీ గోడ మూసెయ్యాలి. దానికి పెద్ద ఆలోచనేం అక్కర్లేదు. చాలాకాలంగా ఆ పనే చేస్తున్నాం! కానీ గోడ మొత్తం పగలగొట్టకుండా...

చురుకుగా ఉండండి చాలు!
జీవనశైలిలో చేసుకునే మార్పులు, రోజువారీ వ్యాయామం.. ఈ రెండూ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి..

ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారా?
మంచి కెరీర్‌.. ఆర్థికపపరంగా మెరుగైన జీవితం.. వీటికి కావల్సిన ప్రణాళికల్ని ఏడాది మొదట్లోనే ఓ చోట రాసిపెట్టుకుంటాం. వీటి కోసం ముందస్తు ప్రణాళికలూ....

రాత్రిళ్లు ఫోన్‌కి దూరంగా!
సంతాన లేమి, మెదడులో కణుతులు... నిద్రలేమి వీటికీ.. సెల్‌ఫోన్‌ వాడకానికి ఏదైనా సంబంధం ఉందా అంటే... ఉందనే అంటున్నాయి కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ వెలువరించిన తాజా నివేదికలు....

చలికాలం గుండె పదిలం
వణికించే చలితో చర్మం పొడిబారటం వంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు మాత్రమే తలెత్తుతాయనుకుంటే పొరపాటే! ప్రాణాలను హరించే గుండె సమస్యలు కూడా....

ఎందుకీ కొరకటం?
సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. ఇంటర్వ్యూకు వెళ్లబోయే ముందు, ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పబోయే ముందు.. ఏదైనా ‘టెన్షన్‌’లో ఉన్నప్పుడు టకటక గోళ్లు....

ఎదురుగాలికి బెదరొద్దు!
మహా యుద్ధంలో చిరుగాయాలు తప్పవు. గాయాలను చూసి యుద్ధం ఆపం! క్యాన్సర్‌పై పోరాటమూ అంతే! కణంకణం కలిసి తామరతంపరగా పెరిగిపోతుండే పుట్టకురుపును అంతం చేసేందుకు ఓ మహాయుద్ధమే అవసరమవుతుంది. సమర సన్నాహంతో ముప్పేటల తుదముట్టిస్తేనే ఆ మహా వ్రణం తోకముడుస్తుంది. ఈ దాడిలో ప్రతిఘటనలు తథ్యం. ఎదురుగాలులు అనివార్యం. చికిత్స పొడవూనా.. అడుగడుగునా దుష్ప్రభావాలు....

నిద్రలోనే శుభ్రం! నిద్రతోనే భద్రం!!
కంటి నిండా నిద్ర.. మెదడు నిండా జ్ఞాపకాలు.. ఈ రెంటి మధ్యా విడదీయరాని సంబంధం ఉందన్న విషయం తెలుసా మీకు? తగినంత నిద్ర లేకపోతే మదిలోని జ్ఞాపకాల నిధి చెల్లాచెదరైపోతుందని వైద్యపరిశోధనా రంగం ఎప్పుడో గ్రహించింది. అయితే నేటి ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న అతి తీవ్రమైన మతిమరుపు వ్యాధి ‘ఆల్జిమర్స్‌’కూ.. నిద్ర లేమికీ మధ్య కూడా గట్టి లంకే ఉందని గుర్తించటం తాజా విస్మయకర వాస్తవం..

పులిరాజా పడుకుంది..కానీ!
పులిరాజా పీచమణిచాం. కోరలు తీసి పడుకోబెట్టాం. అక్కడెక్కడో ఆఫ్రికాలో పుట్టి.. ప్రపంచాన్ని చుట్టబెట్టి.. గజగజ వణికించి.. ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను సమర్థంగా కట్టడి చేశాం. ప్రజల్లో అవగాహన పెరిగింది. పరీక్షలు చేయించుకోవటానికీ, చికిత్స తీసుకోవటానికీ స్వతహాగా ముందుకొస్తున్నారు. సమర్థవంతమైన మందులూ అందుబాటులోకి వచ్చాయి. వీటి ఫలితంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతమాత్రాన సంతోషిస్తూ కూచోవాల్సిన పనిలేదు.....

‘మూడోరకం’ పొగతోనూ!
సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగటమే కాదు.. ఇతరులు కాల్చిన సిగరెట్ల వంటి వాటి నుంచి వెలువడే పొగను పీల్చినా ప్రమాదమే. ఇది కూడా పొగ తాగటంతో సమానంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలామంది గ్రహించకపోవచ్చు గానీ మూడో రకం పొగ కూడా అనర్థ దాయకమే......

కాళ్ల మీద పాములు!
అదేంటో కాళ్లలో ఒకటే చిరచిర. చర్మం కింద పాములేవో పాకుతున్నట్టు ఉబ్బెత్తు వంకర్లు. నున్నగా, నిగనిగలాడే కాళ్లను చూడాలంటేనే ఇబ్బంది. అందుకే సిరల ఉబ్బు (వెరికోస్‌ వీన్స్‌) అనగానే ఇప్పుడంతా లేజర్‌ చికిత్సల వైపే చూస్తున్నారు. సత్వరమే శస్త్రచికిత్స చేయాల్సిన సమస్యగానే భావిస్తున్నారు. అసలు సమస్య ఉందో లేదో తెలుసుకోకుండానే.. అవసరమున్నా లేకపోయినా చికిత్సలు చేయించేసుకుంటున్నారు. అనంతరం కొత్త ఇబ్బందులూ కొని తెచ్చుకుంటున్నారు. వీటికి తోడు ఎన్నెన్నో అపోహలు.....

కిడ్నీలకూ చెడుగాలి దెబ్బ
వాయు కాలుష్యం వూపిరితిత్తులకే కాదు.. గుండె, మెదడుకూ కీడు చేస్తుంది. గుండెజబ్బు, పక్షవాతం ముప్పులూ తెచ్చిపెడుతుంది. ఇది కిడ్నీలనూ దెబ్బతీస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. గాలిలో నుసి పదార్థం (పీఎం 2.5) పెరగటానికీ కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గటానికీ నేరుగా సంబంధం....

మతిమరుపు ‘వాసన’
ముక్కుకు వంటకాల ఘుమఘుమ తగిలితే చాలు. కడుపులో ఆకలి రగులుతుంది. మంచి పరిమళానికి మనసు గాల్లో తేలిపోతుంది. మెదడుకూ ముక్కుకూ ఉన్న సంబంధం అలాంటిది మరి. అందుకే తీవ్రమైన మతిమరుపు, తికమక వంటి వాటిని తెచ్చిపెట్టే డిమెన్షియా.....

అల్జీమర్స్‌ మూలాలు రక్తంలో..!
తీవ్రమైన మతిమరుపు, తికమక వంటి లక్షణాలతో వేధించే అల్జీమర్స్‌ మెదడులోనే పుట్టుకొస్తుందని నిపుణులు చాలాకాలంగా భావిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో రక్తమూ పాలు పంచుకుంటున్నట్టు తాజా పరిశోధనలు పేర్కొంటున్నాయి. బీటా అమీలాయిడ్‌....

మందులు సరిగా వేసుకుంటున్నారా?
అప్పటిదాకా..ఒళ్లంతా జ్వరంతో భగభగా మండిపోతుంటుంది.సమ్మెటతో బాధుతున్నట్టుగా తలంతా ఒకటే నొప్పి, పోట్లు.పేగులన్నీ మెలితిరిగిపోతున్నట్టు కడుపులో ఏదో బాధ, విరేచనాలు.అడుగు తీసి అడుగు వేయలేనంతగా విలవిలలాడించే కాలి నొప్పి.చల్లగాలిలో కొద్దిగా తిరిగినా ఉక్కిరి బిక్కిరి చేసే ఆయాసం. అదేంటో.. ఒక మాత్రో, మందో వేయగానే అంత నొప్పీ.. అంత బాధా.. అంత ఇబ్బందీ.. అంత ఆయాసమూ.. ఉన్నట్టుండి ఉఫ్‌ మని ఎగిరిపోతుంది.అవును.. ఇదంతా మందుల మాయే! ఎన్నో పరిశోధనలు, ఎన్నెన్నో ప్రయోగాల అనంతరం వైద్యరంగం మనకు అందించిన మంత్రదండాల మహిమే! ఇన్‌ఫెక్షన్‌ జబ్బులను తగ్గించటం దగ్గర్నుంచి దీర్ఘకాల సమస్యల నియంత్రణ, వాటి దుష్ప్రభావాల నుంచి కాపాడటం వరకూ మన ఆరోగ్యం విషయంలో మందుల పాత్ర ఎనలేనిది. జాగ్రత్తగా, సరైన పద్ధతిలో వాడితే ఇవి బ్రహ్మాస్త్రాల్లా పనిచేస్తాయి. లేకపోతే భస్మాసుర హస్తంలా మొదటికే మోసం తెస్తాయి. నిజానికి వీటిపై శ్రద్ధ ఆసుపత్రికి వెళ్లే ముందే మొదలవ్వాలి. డాక్టర్‌ను ఏం అడగాలి? ఏయే సందేహాలు నివృత్తి చేసుకోవాలి? మందులు ఎలా వాడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఆచరిస్తేనే పూర్తి ఫలితాలు దక్కుతాయి. అందుకే మందుల వాడకంపై సమగ్ర కథనం మీ కోసం. .

మీ రక్తంలో క్యాల్షియం ఉందా?
ఎముకలు, దంతాలు, కీళ్లు దృఢంగా ఉండటంలో క్యాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణ, మధుమేహ నివారణకూ తోడ్పడుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో సంగతీ బయటపడింది. రక్తంలో క్యాల్షియం మోతాదులు తగ్గితే హఠాత్తుగా గుండె ఆగిపోయే (ఎస్‌సీఏ) ముప్పు పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగ తాగటం, వూబకాయం, హైబీపీ వంటి గుండెజబ్బు ముప్పు కారకాలు, మందుల వాడకం వంటి వాటిని మినహాయించి చూసినా క్యాల్షియం ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుండటం గమనార్హం.

అబ్బా.. శిరోవేదన!
ఒకటే వేదన. ఎవరో బాదుతున్నట్టు, సూదులతో పొడుస్తున్నట్టు తల నిండా ఒకటే నొప్పి. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఎప్పుడు చూసినా ధ్యాసంతా తల మీదే. ఇలా- తలనొప్పితో పడే పాట్లు అన్నీఇన్నీ కావు. జలుబు, జ్వరం వంటి సమస్యల్లో తలనొప్పి రావటం తెలిసిందే. మానసిక ఒత్తిడి, ఆందోళన, తీరికలేని శ్రమ సైతం ఇప్పుడు ఎంతోమందికి ‘శిరోవేదన’ కలిగిస్తున్నాయి. నిజానికి జీవితంలో ఎప్పుడో అప్పుడు ఒక్కసారైనా తలనొప్పి బారినపడని వారుండరంటే అతిశయోక్తి కానే కాదు..

పుండూ.. పుండూ.. ఎందుకు మానట్లేదు?
కొన్ని పుండ్లు ఒక పట్టాన మానవు. దీర్ఘకాలం విడవకుండా వేధిస్తుంటాయి. పుండు పడిన భాగానికి రక్త సరఫరా సరిగా లేకపోవటం.. ఆక్సిజన్‌, పోషకాలు అంతగా అందకపోవటం.. అపరిశుభ్ర వాతావరణం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తాయి..

చేయొద్దు చలి తప్పులు
ఒకవైపు చల్లగాలి వీస్తుంటుంది. మరోవైపు నులివెచ్చటి ఎండ కాస్తుంటుంది. మొత్తమ్మీద చలికాలం కాసింత ఆహ్లాదంగానే అనిపిస్తుంటుంది. అయితే చలికాలంతో పాటు చాలామందికి బద్ధకం కూడా ముంచుకొస్తుంటుంది. బాగా పొద్దు ఎక్కేవరకూ ముసుగుతన్ని పడుకోవటం, బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవటం వంటివి చేస్తుంటారు. ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపుతాయి. కాబట్టి చలికాలంలో చేయకూడని తప్పులేంటో ఓసారి చూద్దాం!.

ఒంట్లో గడియారం
జీవితమే ఒక లయ! ప్రతీ దశా క్రమబద్ధమే!! నవ మాసాలు నిండగానే తల్లి కడుపులోంచి బయటపడతాం. మూణ్నెల్లు రాగానే బోర్లా పడతాం, ఏడాది వచ్చేసరికి నిలబడతాం. బాల్యం దాటుతూనే పలకరించే నవ యవ్వనం.. దాంతో పాటు మారిపోయే శరీరం.. అన్నీ లయాత్మకమే. అంతెందుకు? రాత్రవుతూనే నిద్ర ముంచుకొస్తుంది. పొద్దు పొడవగానే మెలకువ వచ్చేస్తుంది. భోజనం వేళకు కడుపులో ఆకలి మంట రగులుతుంది. ఇవన్నీ ఠంచనుగా.. ఏదో గంట కొట్టినట్టుగా.. సమయం ప్రకారం ఎలా జరుగుతున్నాయి? వీటన్నింటినీ వెనక నుంచి నడిపిస్తున్న అదృశ్యశక్తేంటి? అదే మన జీవగడియారం! సర్కాడియన్‌ రిథమ్‌! చీకటి, వెలుతురు.. రాత్రి, పగలుకు అనుగుణంగా సాగే 24 గంటల చక్రభ్రమణం. మన నిద్ర తీరుతెన్నులు, ఆహార అలవాట్లు, హార్మోన్ల ఉత్పత్తి, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత...

ఆఫీసులోనూ మనసు పదిలం!
ఆరోగ్యమంటే ఒక్క ఇంటితోనే ముడిపడింది కాదు. మన ఆఫీసు, పనిచేసే చోటు కూడా కీలకమే. నిజానికి చాలామంది ఇల్లు తర్వాత ఎక్కువ సమయం గడిపేది ఆఫీసుల్లోనే. నేటి పోటీ ప్రపంచంలో.. ముఖ్యంగా ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలు తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్నాయి. సమయానికి లక్ష్యాలను సాధించటం, మెరుగ్గా పని పూర్తిచేయటం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లోనూ చిక్కుకుంటున్నారు.

గొంతు పదిలం!
ఎవరి గొంతు వారిదే. ఏ ఇద్దరి మాటా ఒకేలా ఉండదు. వేలి ముద్రల మాదిరిగానే ఇదీ ప్రత్యేకమైందే. శ్వాసనాళం మొదట్లో స్వరపేటికలోని రెండు స్వరతంత్రులు కంపించటం ద్వారా మాట పుట్టుకొస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు స్వరతంత్రులు రెండూ ఒకదగ్గరికి వస్తాయి..

ఆన్‌లైన్‌లో ఆరోగ్య సమాచారమా?
ఒకప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏ సమాచారం కావాలన్నా డాక్టర్లను అడిగేవాళ్లం. పత్రికలు, మ్యాగజైన్లు వంటివి చదివి తెలుసుకునేవాళ్లం. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు ఆరోగ్య సమాచారం అరచేతిలోకి వచ్చి వాలింది. ఏదైనా జబ్బుందని తెలియగానే....

మన గుండె మన ఆరోగ్యం మన బాధ్యత!
ఎంతో పురోగమించాం. గుండెజబ్బుల చికిత్సలో మరెంతో సాధించాం. గుండెపోటు వస్తే మరణం తథ్యమనే రోజుల నుంచి బయటపడి.. ఇప్పుడెంతో మంది ప్రాణాలను కాపాడుకుంటున్నాం. అయితే- ఇందుకు భారీ ‘మూల్యాన్నీ’ చెల్లించుకుంటున్నాం. ఖరీదైన వైద్య పరీక్షల దగ్గర్నుంచి స్టెంట్లు, బైపాస్‌ సర్జరీల వరకూ లక్షల కొద్దీ రూపాయలు వెచ్చిస్తున్నాం. ఇంతచేసినా- గుండెజబ్బుల.

మూత్రం చెబుతుంది!
తగినంత నీరు తాగకపోయినా.. చెమట ఎక్కువగా పట్టినా.. మూత్రం తక్కువగా వస్తుంటుంది. కాస్త రంగు కూడా మారొచ్చు....

ఒంట్లో.. ఒకటే నస!
ఒకటే దురద. గోకితే దద్దు. తుమ్ము మీద తుమ్ము. ఉక్కిరి బిక్కిరి చేసే ఆయాసం. ఇలా అలర్జీలు తెచ్చిపెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం ఎంతోమంది చిన్నారులు.. ముఖ్యంగా పట్టణప్రాంత పిల్లలు వీటితో పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. అందరిలా ఆడుకోలేక, అందరిలా....

జర భద్రం!
స్వైన్‌ఫ్లూ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ముఖ్యంగా రోగనిరోధకశక్తి....

ఒంటికీ బాధే!
అనవసర భయాలతో ఏం జరుగుతుందోనని చింతిస్తుంటే శరీరం, మనసు.. రెండూ గతి తప్పుతాయి..

వృద్ధాపి జీర్ణం!
ఉదయాన్నే ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు పరుగెత్తాల్సిన పనిలేదు. డెడ్‌లైన్‌ దాటిపోతుందేమోనన్న బెంగ లేదు. కావాల్సినంత సమయం చేతిలో ఉంటుంది. మనవలు, మనవళ్లతో బోలెడంత కాలక్షేపం. వృద్ధాప్యానికి ఇదొక పార్శ్వం మాత్రమే. మరోవైపు- చర్మం....

మార్చేద్దాం జీవగడియారం!
మనకు సమయానికి కడుపులో ఆకలి రగులుతుంది. రాత్రి పడుకునే......

వెన్ను వెదురుకర్ర!
నొప్పి ఒకటే కావొచ్చు. అది నడుంలోనే ఉండొచ్చు! కానీ అన్ని నడుంనొప్పులూ ఒకటి కాదు. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడో, అడ్డదిడ్డంగా కూచోవటం వల్లనో తలెత్తే నొప్పి వేరు. ఇది విశ్రాంతి తీసుకుంటే తగ్గొచ్చు. కానీ ఒంట్లోనే పొడసూపే సమస్యలతో తలెత్తే నొప్పి వేరు. అలాంటిదే యాంకిలోజింగ్‌ .....

కోట గోడు!
మన ఒంటికి చర్మమే కోటగోడ! ఎండ, వాన, చలి.. ఏదైనా ముసరనీ అన్నింటినీ తట్టుకుంటూ.. దుమ్ము, ధూళి, పొగ.. ఏదైనా కమ్మనీ.. అన్నింటినీ నిలువరిస్తూ..బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌.. ఏదైనా తాకనీ.. అన్నింటినీ ప్రతిఘటిస్తూ.. అనుక్షణం మన శరీరాన్ని కాపాడుతుంటుంది!! అయినా కొన్నిసార్లు...

మార్పిడి కొంత్తెనా మేలే!
మోఒంట్లో ఎక్కడ నొప్పి తలెత్తినా ఇబ్బందే. ఇక మనం లేచి నిలబడటానికి, కాళ్లు ముడుచుకొని కూచోవటానికి.. అటూఇటూ తేలికగా తిరగటానికి తోడ్పడే మోకీళ్లలో నొప్పి మొదలైతే? పట్టుమని నాలుగడుగులు కూడా వేయలేక చతికిల పడిపోతుంటే? మందులు వేసుకుంటున్నా.....

గొంతులోనూ మొండి గనోరియా!
మన గొంతులో కోట్లాది సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది. వీటిల్లో చాలావరకు మనకు ఎలాంటి హానీ కలిగించవు..

జనని.. సకల జబ్బులకు!
నిపురు గప్పిన నిప్పు ఎప్పుడు భగ్గుమంటుందో తెలియదు. లోపల్లోపలే రాజుకుంటూ ఒక్కసారిగా విజృంభిస్తుంది. చేయాల్సిన అనర్థమంతా చిటికెలో చేసేస్తుంది. క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌- దీర్ఘకాలిక వాపు ప్రక్రియ కూడా ఇంతే. పైకేమీ కనిపించకుండా.. ఒంట్లోనే రగులుతూ...

కిడ్నీలోనూ తిత్తులు!
ర¹క్తాన్ని శుద్ధిచేసి, వ్యర్థాలను బయటకు పంపించే మూత్రపిండాల్లో నీటి తిత్తులు (సిస్టులు) ఉన్నాయనగానే ఎవరికైనా ఆందోళన మొదలవుతుంది. నిజానికివి అంత ప్రమాదకరమైనవేమీ కావు. కిడ్నీ పనితీరునూ దెబ్బతీయవు. అయితే తిత్తు

14, ఫిబ్రవరి 2018, బుధవారం

పదవి పాకుడు రాయి..పెదవి చీకటి హాయి

స్వర్గీయ నందమూరి తారకరామారావు మాజీ ముఖ్యమంత్రి గా అబిడ్స్ లోని అతని స్వగృహంలో ఉండగా, ఆయనని స్వయంగా కలిసినప్పుడు అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిన రెండు పద్యాలివి.  " వినుము తెలుగువీర మోహనాకార "  అనే మకుటం అతనినుద్దేశించినదే.  తెలుగువారి ఉనికికి  అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఘనత నందమూరి అందగాడికే దక్కుతుంది.

పదవి పాకుడు రాయి పెదవి చీకటి హాయి
జారిపోవు నిన్ను జారనిచ్చి
పదవి పెదవులందు పాపాలు మెండురా
వినుము తెలుగువీర మోహనాకార!

పదవిలోనవున్న పలుమారు బొగిడేరు
పనులజేయ కానిపనుల జేయ
పదవి జారినంత పలుకరించేదెవరు ?
వినుము తెలుగువీర మోహనాకార!

ఆ పద్యాలను విని ఆనందించిన అన్నగారి మోము వికసించడం ఇప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే!

భవదీయుడు
డా!! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి

                     శుభ సాయంత్రం!

.క్షమ కవచంబు

(భర్తృహరి సుభాషితం:)

క్షమ కవచంబు, క్రోధ మదిశత్రువు, జ్ఞాతి హతాశనుండు, మి
త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి
త్త, ముచితలజ్జ భూషణ్, ముదాత్త కవిత్వము రాజ్య మీ, క్షమా
ప్రముఖ పదార్ధముల్‌ గలుగుపట్టున తత్కవచాదు లేటికిన్!!

ఓర్పు కవచం లాంటిది, కోపము శత్రువు, దాయాది నిప్పులాంటివాడు, మిత్రుడు మంచి ఔషధం. దుర్జనులు సర్పములవంటివారు. మంచి విద్య చేతిలో ఉన్న ధనము వంటిది. వినయము భూషణము. సుకవిత్వం రాజ్యం. ఇన్ని సంపదలు కలవానికి వరే రక్షణ్ అవసరము లేదు!! అంటే సజ్జనునికి సద్గుణాలే రక్షణ కల్పిస్తాయి..

12, ఫిబ్రవరి 2018, సోమవారం

నవ్వవు జంతువుల్ నరుడె నవ్వును నవ్వులె చిత్తవృత్తికిం
దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వులవోలె ప్రేమరసముం గురిపించు విశుద్ధమైన లే
నవ్వులు సర్వ దు:ఖ దమనంబులు వ్యాధులకున్మహౌషదుల్
Sri Gurram Joshua.