14, ఫిబ్రవరి 2018, బుధవారం

పదవి పాకుడు రాయి..పెదవి చీకటి హాయి

స్వర్గీయ నందమూరి తారకరామారావు మాజీ ముఖ్యమంత్రి గా అబిడ్స్ లోని అతని స్వగృహంలో ఉండగా, ఆయనని స్వయంగా కలిసినప్పుడు అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిన రెండు పద్యాలివి.  " వినుము తెలుగువీర మోహనాకార "  అనే మకుటం అతనినుద్దేశించినదే.  తెలుగువారి ఉనికికి  అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఘనత నందమూరి అందగాడికే దక్కుతుంది.

పదవి పాకుడు రాయి పెదవి చీకటి హాయి
జారిపోవు నిన్ను జారనిచ్చి
పదవి పెదవులందు పాపాలు మెండురా
వినుము తెలుగువీర మోహనాకార!

పదవిలోనవున్న పలుమారు బొగిడేరు
పనులజేయ కానిపనుల జేయ
పదవి జారినంత పలుకరించేదెవరు ?
వినుము తెలుగువీర మోహనాకార!

ఆ పద్యాలను విని ఆనందించిన అన్నగారి మోము వికసించడం ఇప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే!

భవదీయుడు
డా!! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి

                     శుభ సాయంత్రం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి