22, డిసెంబర్ 2018, శనివారం
నిన్న ఎన్ టి ఆర్ బయో పిక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పురంధేశ్వరి గారు ఎన్ టి ఆర్ గురించి మాట్లాడుతూ చాణక్య నీతి దర్పణము నుండి ఈ క్రింది శ్లోకం ఉదాహరించారు. ఏకేనా-పి సువృక్షేణ పుష్పితేన సుగన్ధినా | వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా || అర్థము :- పుష్పి తేన = పుష్పించినదియు , సుగంధినా = సువాసన గలిగినదియు, సువృక్షేణ = మంచి వృక్షముతో, ఏకేనాపి = ఒక్కదానితోనైనను, తద్వనం = ఆ వనము, సర్వం = సమస్తము, వాసితం = సువాసగలదియగును, తథా = అట్లే, సుపుత్రేణ = మంచి పుత్రునితో, కులం = కులమంతయు నలంకరింపబడును. తాత్పర్యము:- సుపుత్రు డొక్కడైనను తన వంశమునకు ప్రతిష్ఠాదులు కలిగించునట్లు సువాసనగల పూలతో గూడిన వృక్షమొక్కియైనను ఆ వనము నంతిని సువాసన కలదానినిగా జేయును. ఎన్ టి ఆర్ బయో పిక్ లోని ఈ పాట చూడండి, సిరి వెన్నెల, చిత్ర, శ్రీనిధి, కీరవాణి బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా కంటపడని నీడై వెంట నడచు తోడై నీ సేవలన్నీ నిర్వహించగలిగే - బంటు రీతి నిన్ను పిలుచువారు నిన్ను తల్చువారి కోరుకున్న రూపే కనిపించు స్వామీ గుండెలోన కొలువై కంట చూడ కరువై ప్రాణవల్లభునిగా పలుకరించవేమి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి