21, ఫిబ్రవరి 2019, గురువారం

సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో పరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై శ్రీమన్నారయణుండు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖియైన లక్ష్మీదేవికి కూడా జెప్పక, శంఖ చక్ర గదాది ఆయుధములను జేపట్టక, పరివారంబును పిలువక, తనవాహనమైన గరుడునిపై గూడ నధిరోహింపక, జారిన జుట్టును గమనింపక, వేడుకలో లక్ష్మీదేవి కొంగుతో ముడివేసిన యామె పైటకొంగునుకూడ గమనింపక తొందరపాటుతో యీడ్చుచునే బయలుదేరెను. అట్టి భక్తజనోద్ధారుకుడైన శ్రీమన్నారాయణుడిట్లు సమస్త జంతుకోటి హృదయములందు అమరియున్నవాడై, ఆకాశంబు వేంచేయుచున్న సమయంబున కారణము తెలియక పతిని వెంబడించుచు లక్ష్మీదేవియు, ఆమెనుగూడి యామె అంత:పురజనుంబులు, వారివెనుక గరుత్మంతుడు, యాతని వెనుక విల్లును, కౌమాదకీ, శంఖచక్రగదాధి ఆయుధంబులునూ, నారద మహర్షియునూ, విష్వక్సేనుడును తోడుగా వచ్చిరి. వైకుంఠపురమందలి ఆబాలగోపాలమంతయు అబ్బురపడుచు అరుదెంచిరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి