23, జూన్ 2019, ఆదివారం
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. .... ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో.. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో...ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠం లెన్నో.. శ్రమజీవుల పచ్చి నెత్తురు తాగని ధనవంతులెందరో...అన్నార్తులు అనాధ లుండని ఆ నవయుగ మదెంత దూరమో.... కరువంటూ,కాటకమంటూ కనిపించని కాలాలేపుడో...అణగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో.... ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో...కులమతాల సుడి "గుండా"లకు బలియైన పవిత్రులెందరో... భారతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాళ్ళో.....
20, జూన్ 2019, గురువారం
17, జూన్ 2019, సోమవారం
మంత్రికి తెలివుండాలి*** బంటుకి భక్తుండాలి*** గుర్రానికి వేగముండాలి** ఏనుగుకి బలముండాలి*** సేనాధిపతికి వ్యూహముండాలి** సైనికుడికితెగింపుండాలి* యుద్ధం నెగ్గాలంటే, వీళ్ళందరి వెనుక కసి వున్న ఒక రాజుండాలి**** 👉#మనందరిలో_ఒక_రాజుంటాడు కానీ మనమే** #రాజులా *ఆలోచించడం ఎప్పుడో ఆపేశాం! 👉 *"మన కసి -అడవులని చీల్చయినా సరే, *సముద్రాలని కోసయినా సరే, కొత్త దారులు కనుక్కోగలదు" అని మనకి తెలుసు. అయినా... భయానికి బానిసయ్యాం. ఓటమికి తలొంచేసాం ! 👉చరిత్రలో... చాలా మంది రాజులు... 🌺ఓడిపోయారు 🌺పారిపోయారు 🌺దాక్కున్నారు 🌺దాసోహమయ్యారు. కానీ కొందరే... అన్నీ పోగొట్టుకున్నా కసితో మళ్ళీ తిరిగొచ్చి యుద్ధం చేశారు. 'రాజంటే స్థానం కాదు, రాజంటే స్థాయి' అని నిరూపించారు. 👉 డబ్బొచ్చినా, పోయినా వ్యక్తిత్వం కోల్పోకు... రాజ్యాలున్నా, చేజారినా రాజసం కోల్పోకు... 👉�రాజంటే.. కిరీటం, కోట, పరివారం కాదు.. రాజంటే ధైర్యం... రాజంటే ధర్మం... రాజంటేయుద్ధం...! 👉ఒకరోజు విందుభోజనం చేస్తావు.. ఇంకోరోజు అడుక్కుతింటావు- పాండవుల్లా...! 👉ఒక రాత్రి బంగారు దుప్పటి కప్పుకుంటావు.. మరో రాత్రి చలికి వణికిపోతావు- శ్రీరాముడిలా...! 👉ఎత్తు నుండి నేర్చుకో, లోతు నుండి నేర్చుకో... రెండింటి నుండి ఎంతో కొంత తీసుకో...! 👉 రాజంటే స్థానం కాదు రాజంటే స్థాయి... 👉స్థానం - భౌతికం.. కళ్ళకు కనపడుతుంది. స్థాయి - మానసికం.. మనసుకు తెలుస్తుంది...! మనందరిలో ఒక రాజుంటాడు... బ్రతికిస్తావో... *చంపేసుకుంటావో...నీ ఇష్టం..!
16, జూన్ 2019, ఆదివారం
11, జూన్ 2019, మంగళవారం
ఆహా.. ఏమి రా"సినారె". ------------------------ సినారె అచ్చంగా తెలుగు వాడు.. అందుకే.. నాకు బాగా నచ్చుతాడు.. గజళ్ళకు గజ్జెకట్టి నాట్యమాడించాడు... ..... శాతవాహనుల వ౦శాన పుట్టిన వాడు కాకతీయుల పొతుగడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు డిల్లీలొ సైతమ్ము పెద్దగద్దెలనేలి పేరుకెక్కినవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు ప౦చె కట్టుట లొ ప్రప౦చాన మొనగాడు క౦డువాలేనిదే గడపదాటనివాడు ప౦చబక్ష్యాలు తన క౦చాన వడ్డి౦చ గో౦గూర కొసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు నేల నల్దెసల డెరాలు దాటిన వాడు అన్ని మూసలలొల్న అట్టె ఒదిగిన వాడు “ఏ దేశమేగినా ఎ౦దుకాలిడినా” ఆవకాయ వియోగమసలె సైపని వాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు మ౦చి మనసెదురైన మాలలిచ్చెవాడు భాయి భాయి అన్న చెయి కలిపేవాడు తిక్కరేగి౦ద౦టే డొక్క చీల్చేవాడు చిక్కులెరగనివాడు చిత్తాన పసివాడు ఎవడయ్య ఎవడు వాడు ఇ౦కెవడయ్య తెలుగువాడు!
3, జూన్ 2019, సోమవారం
వాట్సాప్ మెసేజ్ ల పై పేరడీ పాట: _*పల్లవి:*_ నేను పుట్టాను, లేండ్ లైన్ వచ్చిందీ ... ... ... నేను ఏడ్చాను, సెల్ ఫోన్ వచ్చిందీ ... ... ... నేను నవ్వాను, స్మార్ట్ ఫోన్ వచ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥ _*1వ. చరణం:*_ మనిషిని మనిషిని కలిపేటందుకు లేండ్ లైన్ వచ్చిందీ ... ఎవరికి దొరకక తిరిగేటందుకె సెల్ ఫోన్ వచ్చిందీ ... ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై స్మార్ట్ ఫోన్ పుట్టిందీ ... అందరి బుర్రలు నమలడానికే వాట్సాప్ వెలిసింది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను ... ... ... ॥ _*2వ చరణం:*_ లేండ్ లైన్ మ్రోగితే, అందరి గుండెలు ఆనందించాయీ ... సెల్ ఫోన్ మ్రోగితే, అందరి మనసులు చిరాకు పడ్డాయీ ... స్మార్ట్ ఫోన్ తో, అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ ... తెల్లవారినా అవి, కొంచెం కూడా బాగవ కున్నాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*3వ చరణం:*_ వాట్సాపులో వసతులతోటీ, షరతులు వున్నాయీ ... హద్దు మీరితే అంతు తెలియనీ, శిక్షలు పడతాయీ ... స్మార్ట్ ఫోనులో భాషల కుండే, సొగసులు తగ్గాయీ ... ఎమోజీ(emoji) లతో, ఎవరికి తెలియని భాషలు పుట్టాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*4వ చరణం:*_ మనుషుల మనసులు, కలిపేటందుకె ఫోనులు వున్నాయీ ... ఏ ఫోనైనా, మంచిగ వాడే మార్గాలున్నాయీ ... మంచిగ వాడని, ఫోనుల కెపుడూ వైరస్ లొస్తాయీ ... వాట్సాపులో, పెట్టేటందుకె నీతులు వున్నాయి. డోన్ట్ టాక్. ॥ నేను పుట్టాను ... ... ... ॥ _*5వ చరణం (ఆఖరి చరణం):*_ గంటలు రోజులు స్మార్ట్ ఫోనులో, వాగుతు గడిపేసెయ్ ... ఫోన్లో వున్న బేటరి తీసి, బయటకు పారేసెయ్ ... వైఫై సిగ్నల్ ఆపేసెయ్ ... సిమ్ము కార్డును విసిరేసెయ్ ... డ్రైవ్ ద డేటాకార్డ్ ఔట్ ... ... ... హహ్హహ్హహ్హహ్హ !!! ॥నేను పుట్టాను ... ... ... ॥ _*ప్రేమ్ నగర్*_ సినిమా లోని _*ఘంటసాల మాస్టారు*_ పాడిన _*నేను పుట్టాను ... ... ... *_ పాటకు వరుస అన్వయం. *# ఇదీ మొత్తం పాట. #*
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)