23, మార్చి 2017, గురువారం

నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,

అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో.

నాన్న ఎప్పుడూ తుంటరివాడే,

అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో.

కని,పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది,

నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.

కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని

ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?

పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,

కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.

సేవచేయటం అమ్మవంతు,

సరిచేయటం నాన్నతంతు.

అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,

నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు
దోషాలుకూడా కనబడుతాయి.

ప్రేమించటం అమ్మవంతు అయితే,
దీవించటం నాన్నవంతు.

ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం నాన్నవంతు.

అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,

నాన్నదీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.

అమ్మగుండెలో పిల్లల సుఖానికి
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.

నాన్నగుండెలో పిల్లల క్షేమానికి
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.

అమ్మఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,

నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.

కనిపించే ఆరాటం అమ్మది,

కనిపించని పోరాటం నాన్నది.

అమ్మకి లైకులెక్కువ,

నాన్నకి షాకులెక్కువ.

అమ్మ ఏడవటం కనిపిస్తుంది,

నాన్నఎద చెరువవటం కనిపించదు.

గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,

గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.

పిల్లల జీవితానికి అమ్మ ఒకకళ అయితే,
నాన్న తళతళ.

కనిపించే దేవత అమ్మ అయితే,

కనపడని దేవుడు నాన్న.

పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి,

నాన్నకు మాత్రం అన్నీ నాస్తి....

19, మార్చి 2017, ఆదివారం

https://drive.google.com/open?id=0B8VeAg1T0udMLUJmRXJPcGo4V2s.......

చందమామ కథలు pdf

శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా



శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా.. జీవేశ్వరా
శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...

చరణం 1 :

ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...

నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
విని తరించరా ...

శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా...

చరణం 2 :

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు

పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా

నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..

శంకరా... నాదశరీరా పరా...
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా... శంకరా... శంకరా...
Naveen Kumar:
నిన్నే నీవెరుంగమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి,
ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మ ఫలమొసగు కర్మ భూమి,
గుడి పావురాలకై తొడగోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి,
కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతిపితను గన్న జన్మభూమి.సహజముగ పండు నేలలు చాల గలిగి,జీవధారలు ప్రవహించు చేవ గలిగి
అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి
ధరణి నేలెడు స్వామి నా భరతభూమి!
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై |2|
మల్లెల దారిలో మంచు ఏడారిలో |2|
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై |2|
మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప వూరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తన్మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది |2|


18, మార్చి 2017, శనివారం

చెయ్యెత్తి జే కొట్టు...శ్రీకృష్ణ

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!
                           
సాటిలేని జాతి-ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు-నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి||

వీర రక్తపుధార-వారబోసిన సీమ
పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి||

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనితల గన్న తల్లేరా!
ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి||

నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం
భావాల పుట్టలో-జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు
శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి||

దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు
మనుషులన్నమాట మరువబోకన్నాడు
అమరకవి గురజాడ నీవాడురా
ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి||

రాయలేలిన సీమ-రతనాల సీమరా
దాయగట్టె పరులు-దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా
వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి||

కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు
ధాన్యరాశులే పండు దేశానా!
కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి||

ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే
ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి||

పెనుగాలి వీచింది-అణగారి పోయింది
నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది
చుక్కాని బట్టరా తెలుగోడా!
నావ దరిచేర్చరా మొనగాడా!!
!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||

16, మార్చి 2017, గురువారం

****** శవం ********
    శవమే కదా అని టన్ను కట్టెలలో కాల్చకు
     ఆరడుగుల గోతిలో తోయకు దాన్ని
     శవానికి  విలువ కట్టే గీటురాయి లేదు
      షరాబు దైనా గరీబుదైనా
       శవాల విలువ ఒక్కటే సుమా
       నేత్ర దానం చేసి చూడు
     మీలోని ఇరువురి అంధులకు
         చూపునిచ్చే శవానికి విలువ కట్టే
         షరాబు కలడా
       శవాన్ని వైద్యకళాశాలకు దానం
         చేసిచూడు
        విద్యార్దులకు శవం ఒక ప్రయోగశాల
       కోసి లోనున్న భాగాలను చూసి వారు పొందే
        జ్ఞానానికి  విలువ కట్టే            
             షరాబు కలడా
       చులకనగా చూడకు శవమే కదా అని
 దాని విలువ కట్టే తూకపు రాళ్ళు నివద్ద లేవోయ్
           ******** హరి*********