29, డిసెంబర్ 2019, ఆదివారం
ఏ టీవీ చూసినా ఏమున్నది గర్వకారణం ?పత్రికలు సమస్తం అధికార భజనా పరాయణత్వం....ఏ ప్రభుత్వం ఎలా గెలిచిందో ? అది ఎన్నాళ్ళుందో ?తారీఖులూ, ధస్తావేజులూ.. ఇవి కావోయ్ వార్తలకర్ధం.. ప్రజాస్వామ్య ఘట్టంలో ఎన్నికల రూపమెట్టిదిసర్కారు ఎంపికలో ఓటరు పాత్ర ఏమిటి ?ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన కూలీలెవరు ? .............రెండేళ్ళ కిoదటి పాత పోస్టే..
25, డిసెంబర్ 2019, బుధవారం
23, డిసెంబర్ 2019, సోమవారం
***** వృద్ధుడు అంటే ..... ******మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడుముంగిట్లో కూచోబెడితేఇంటిని కాచే ఈశ్వరుడు*బతుకుబాటలో గతుకుల్నిముందుగా హెచ్చరించికాపాడే సిద్ధుడు వృద్ధుడువృద్ధులు సారధులైతేయువకులు విజయులౌతారుఅనుభవాల గనులు ఆపాత బంగారాలు*వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడుచేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడునిర్లక్ష్యంగా చూస్తే కేవలంమూడుకాళ్ల ముసలివాడుతగిన గుర్తింపునిస్తేవిజయాన్నిచ్చే త్రివిక్రముడు*ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడుతనను పట్టించుకోకున్నానువ్వు పచ్చగా ఉండాలని తపించేఉదాత్తుడు వృద్ధుడు*పలకరిస్తే చాలు ......పాలకడలిలా పొంగులు వారేపసివాడు వృద్ధుడువృద్ధుడంటే పైపైన చూస్తేజుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడుఅంతర్గతంగాతలపండిన పండితుడు.
20, డిసెంబర్ 2019, శుక్రవారం
బైరాగి -- చీకటి నీడలు లో.. కడుపుమంట...అనురాగం అంబరమైతేఆనందం అర్ణవమైతేమేం తోకచుక్కగా వస్తాంబడబానలమై మండిస్తాంప్రపంచమొక నందనవనమైజీవితమొక గులాబి ఐతేమేం ముళ్ళతొడుగుగా ఉంటాంసుఖస్వప్నం భంగపరుస్తాంఈ జీవిత కేళి గృహంలోసుఖమే ఒక విరిపాన్పైతేమేం కాలసర్పమై వస్తాంవిషజ్వాలల ధార విడుస్తాంమీ నిద్రాసుఖసమయంలోస్వాప్నిక ప్రశాంతి నిలయంలోమేం పీడకలలుగా వస్తాంరౌరవదృశ్యం చూపిస్తాంమీ ప్రణయోత్సుక మధుగీతంమీనృత్యమత్త సంగీతంమీకటుక్షుధారోదనంలోముంచేస్తామొక్క క్షణంలోమీ హేమాసన పాత్రల్లోమీ స్వప్నజగతి యాత్రల్లోమా అశృధార నింపేస్తాంమీబాటను జారుడు చేస్తాం.పానకపు పుడకగా వస్తాంటీకప్‌లో ఈగైచస్తాంమా ప్రాణాలైనా విడుస్తాంమీశాంతిని భగ్నంచేస్తాం.!!
19, డిసెంబర్ 2019, గురువారం
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁబూని తాచిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద ! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా !అరాళకుంతలా !....(1) శ్రీకృష్ణార్జున యుద్దం (1963) ఎన్ఠీఆర్ - వరలక్ష్మీ(2) శ్రీ కృష్ణ తులాభారం (1966 ) ఎన్ఠీఆర్ - జమున (3) శ్రీ కృష్ణ మాయ (1958 ) అక్కినేని - జమున
రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.అవును ఇది ఒక చేదు నిజం ।ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. వాళ్ళు...... రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !నడక అలవాటు ఉన్నవాళ్ళు! మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !వాళ్ళు...... ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు! పూజకు పూలు కోసే వాళ్ళు !..వాళ్ళు.....పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !మడిగా వంట వండేవాళ్ళు !దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !వాళ్ళు . అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !తోచిన సాయం చేసేవాళ్ళు !చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !.వాళ్ళు .ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! Xఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు! వాళ్ళు పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! ..వాళ్ళు .... .తీర్థయాత్రలు చేసేవాళ్ళు !ఆచారాలు పాటించే వాళ్ళు !తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !.వాళ్ళు .....చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు !చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు ! .వాళ్ళు ....తలకు నూనె రాసుకునే వాళ్ళు !జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !మీకు తెలుసా ? .వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు..మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి ..లేదంటే ......లేదంటే .....ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది...వాళ్ళ ప్రపంచం వేరు .సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!. స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !.కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది! ద్వేషం, మోసం లేని జీవనం గడిపిన తరం అది!.సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది! లోకానికి భయపడే జీవనం గడిపిన తరం అది !.ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!H.వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది .మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి !!!తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!.సర్కారు చేసే చట్టాలు కాదు 🙏🙏
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)