19, డిసెంబర్ 2019, గురువారం
రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.అవును ఇది ఒక చేదు నిజం ।ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. వాళ్ళు...... రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !నడక అలవాటు ఉన్నవాళ్ళు! మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !వాళ్ళు...... ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు! పూజకు పూలు కోసే వాళ్ళు !..వాళ్ళు.....పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !మడిగా వంట వండేవాళ్ళు !దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !వాళ్ళు . అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !తోచిన సాయం చేసేవాళ్ళు !చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !.వాళ్ళు .ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! Xఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు! వాళ్ళు పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! ..వాళ్ళు .... .తీర్థయాత్రలు చేసేవాళ్ళు !ఆచారాలు పాటించే వాళ్ళు !తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !.వాళ్ళు .....చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు !చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు ! .వాళ్ళు ....తలకు నూనె రాసుకునే వాళ్ళు !జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !మీకు తెలుసా ? .వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు..మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి ..లేదంటే ......లేదంటే .....ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది...వాళ్ళ ప్రపంచం వేరు .సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!. స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !.కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది! ద్వేషం, మోసం లేని జీవనం గడిపిన తరం అది!.సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది! లోకానికి భయపడే జీవనం గడిపిన తరం అది !.ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!H.వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది .మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి !!!తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!.సర్కారు చేసే చట్టాలు కాదు 🙏🙏
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి