19, నవంబర్ 2014, బుధవారం

"మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.!
.

10, నవంబర్ 2014, సోమవారం

విశ్వనాథాష్టకం:
గంగాతరంగరమణీయజటాకలాపం -
గౌరీనిరంతరవిభూషితవామభాగమ్
నారాయణప్రియమనంగమదాపహారం - 
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్!
వాచామగోచరమనేకగుణస్వరూపం -
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్
వామేన విగ్రహవరేణ కలత్రవంతం -
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్!
భూతాధిపం భుజగభూషణభూషితాంగం -
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం -
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్!
శీతాంశుశోభితకిరీటవిరాజమానం -
భాలేక్షణానలవిశోషితపంచబాణమ్
నాగాధిపారచితభాసురకర్ణపూరం -
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్!
పంచాననం దురితమత్తమతంగజానాం -
నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్
దావానలం మరణశోకజరాటవీనాం -
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్!
తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం -
ఆనందకందమపరాజితమప్రమేయమ్
నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం -
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్!
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం -
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం -
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్!
రాగాదిదోషరహితం స్వజనానురాగం -
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్
మాధుర్యధైర్యసుభగం గరలాభిరామం -
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్!!

7, నవంబర్ 2014, శుక్రవారం

నాలో నన్ను వెతుక్కుంటూ
నాతో నేను ఘర్షణ పడుతూ
నన్ను నేను ప్రశ్నించుకుంటూ
నన్ను నేను సమాధానపరుచుకుంటూ
ఓటమి పాఠాలను ఓదార్పులతో
సమస్యలు ఇచ్చిన ధైర్యంతో
నిస్సహాయతల నిట్టూర్పులతో
తాత్కాలిక ఆనందాల స్వాంతనతో
సాగుతున్న ఈ చిత్రమైన ప్రయాణంలో
నన్ను నేను తృప్తి పరచటానికే
నాతో నేను రాజీ పడలేక చస్తుంటే
ఇంక నీ కోసం కూడా ఎక్కడ రాజీ పడేది
నీతో ఉంటే నాతో నేను లేనట్టే
నన్ను నేను మాత్రమే భరించగలను
ఎందరిలో ఉన్నా నేనెప్పుడూ ఒంటరినే
ఒంటరిగా ఉంటేనే నయం ఎక్కడున్నా
నీ అంత సహనం నాకు లేదు
నేను అంత సాహసమూ చేయలేను
నాది ఒళ్ళు పొగరని నువ్వనుకుంటున్నావు
ఆత్మవంచన చేసుకోలేనని నేనంటున్నాను
ఏ మాత్రం రాజీ పడకూడదు అనుకుంటుంటే
నా మీద అలిగితే నేనేం చేయగలను
ఇప్పటికే చాలా రాజీ పడి బతుకుతున్నా
ఇంతకన్నా పడితే అది నాకు బతుకే కాదు
నా మనో భావాలే నాకు చాలా ముఖ్యం
అందుకే నాకు మనుషులకు చాలా దూరం
మీ సమాజంలో నాబోటి వాళ్ళకి చోటు లేదు
చచ్చి బతికిపోదామంటే చావు కూడా రాదు
నీకు నచ్చేట్టు నేను ఉండలేను
నీకే కాదు ఎవరీకి నచ్చను నేను
అందుకే నాలానే నేను ఉంటాను
అందుకే నాతోనే నేను ఉంటాను

4, నవంబర్ 2014, మంగళవారం

.
కిడ్నీలో రాయి పడింది
కొడితే కాసు కరిగింది
ఇంట్లో చెక్కర నిండుకుంది
ఒంట్లో చెక్కర దండిగుంది.
నా రక్తం పౌరుషంతో పోటెక్కింది
అందుకే కూరలో ఉప్పు తగ్గింది.
పొయ్యిలో గ్యాస్ అపుడే ఆవిరయ్యింది
పొట్టలొ గ్యాస్ ఇంక బయట పడకుంది.
దేహమే దేవాలయం అని బోద పడింది
నా జీవం జబ్బులతో గంట కొట్టింది.
ఉండగ చిన్ని పాకయు, పరుండగ చాపయు రొట్టెలొక్కటో
రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి చెంతనుండగా
పండుగ గాదె జీవితము! భ్రష్ట నికృష్టుల కొల్వు సేయుటల్
దండుగ గాదె! ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే?
కలలో భయ పడితే కన్ను తెరుస్తావ్ !!!
జీవితం లో భయ పడితే కన్ను మూస్తావ్ !!
అందంలో చందురూడు,
ఆదరణలో ఆంధ్రభోజుడు,
మానస చోరుడు, మన్మధ రూపుడు,
అతనిమది అతివల కలల నిధి.
మగసిరి ఉట్టిపడే ఆ ధృడత్వం,
సొగసరి ఇష్టపడే ఆ మృదుత్వం,
ప్రేయసి మనసుపడే ఆ సాహసం.
తాపసి కోరుకునే ఆ నిర్మలత్వం,
రూపసి చేరుకునే ఆ కోమలత్వం,
సఖులు కోరుకునే ఆ సన్నిహితం,
చెలులు కలలుకనే ఆ సున్నితం.
కలతలేని ఆ నిరాడంబరం,
కళ్ళెం లేని ఆ దానగుణం,
శత్రువుని ఎదిరించే ఆ శూరత్వం,
ఎల్లలు చెరిపేసే ఆ ధీరత్వం.
నడకలో సాహసం, నవ్వులో సరసం,
నా హృదిలో ప్రణయం, అతనితోనే నా జీవన ప్రయా

3, నవంబర్ 2014, సోమవారం

సీ. మందార మకరంద మాధుర్య రుచులతో
అలరారు కమ్మని అమ్మభాష
నిండైన గమనంబు నిండైన తేజంబు
కలుపుతూ తరలింది కడలి వోలె
చల్లని గాలిలా చక్కని కవితలా 
మనసుని తడిమింది మంచువోలె
కమనీయ రమణీయ గారాల నడకతో
కనువిందు చేసింది ఘనముగాను.
తే. పద్యపు సొగసుతో కూడి వన్నె తెచ్చె
గద్యపు నడకతో కూడి ఘనము కూర్చె
జాన పదములతో కూడి జలధియయ్యె
అట్టి మన భాష పలుకంగ అవధులేల?
జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండ తాండవం తనోతునశ్శివశ్శివం!

జటాకటాహ సంభ్రమ ద్భ్రమ న్నిలింప నిర్ఝరీ,
విలోలవీచివల్లరీ విరాజమానమూర్థని;
ధగధగ ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే,
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ!
ధరా ధరేంద్ర నందినీ విలాస బందు బంధుర,
స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే ,
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుందరాపది,
క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని .
జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభ,
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే;
మదాంధ సిందురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే,
మనోవినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి!
సహస్రలోచన ప్రభృ త్యశేష లేఖ శేఖరః,
ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః;
భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకః,
శ్రియైచిరాయజాయతాం చకోరబంధు శేఖరః
లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా,
నిపీత పంచసాయకం నమ న్నిలింపనాయకం;
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం,
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః!
కరాల ఫాల పట్టికా ధగద్ధగద్ధగ జ్జ్వల,
ద్ధనంజయాహుతికృత ప్రచండపంచసాయకే;
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక,
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ!
నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధరస్ఫురత్,
త్కుహు నిశీధీనీతమః ప్రబంధ బంధకంధరః;
నిలింపనిర్ఝరీధర స్తనోతు కృత్తిసింధురః,
కలానిదానా బంధురః శ్రియం జగద్ధురంధరః!
ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచ కాలి మచ్ఛటా,
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం;
స్మరచ్చిదం, పురచ్చిదం, భవచ్చిదం, మఖచ్చిదం,
గజచ్ఛి దంధ కచ్చిదం తమంత కచ్ఛిదం భజే.
అగర్వ సర్వ మంగళా కలాకదంబ మంజరీ,
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం;
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం,
గజాంత కాంధ కాంతకం తమంతకాంతకం భజే!
జయత్వ దభ్ర విభ్రమ ద్భ్రమద్భుజంగ మస్ఫుర,
ద్ధగ ద్ధగ ద్వినిర్గ మత్కరాల ఫాల హవ్యవాట్;
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వన మృదంగ తుంగ మంగళ,
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః.
దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తి కస్రజో,
ర్గరిష్ఠరత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః;
తృణారవింద చక్షుషోః ప్రజా మహీ మహేంద్రయో,
స్సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహమ్!
కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోట రేవస,
న్విముక్త దుర్మతిస్సదా శిరస్థ మంజలిం వహన్;
విముక్త లోల లోల లోచనో లలాట ఫాల లగ్నక,
శ్శివేతి మంత్ర ముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్!
ఇమం హి నిత్యమేవ ముత్త మోత్తమం స్తమం,
పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధి మేతి సంతతం;
హరే గురౌ సుభక్తి మాశు యాతినాన్యథా గతిం,
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్!
పూజావసాన సమయే దశ వక్త్ర గీతం,
య శ్శంభు పూజన మిదం పఠతి ప్రదోషే;
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం,
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః!
ఇతి రావణ కృతం శివతాండవ స్తోత్రం సంపూర్ణం!!