3, నవంబర్ 2014, సోమవారం

సీ. మందార మకరంద మాధుర్య రుచులతో
అలరారు కమ్మని అమ్మభాష
నిండైన గమనంబు నిండైన తేజంబు
కలుపుతూ తరలింది కడలి వోలె
చల్లని గాలిలా చక్కని కవితలా 
మనసుని తడిమింది మంచువోలె
కమనీయ రమణీయ గారాల నడకతో
కనువిందు చేసింది ఘనముగాను.
తే. పద్యపు సొగసుతో కూడి వన్నె తెచ్చె
గద్యపు నడకతో కూడి ఘనము కూర్చె
జాన పదములతో కూడి జలధియయ్యె
అట్టి మన భాష పలుకంగ అవధులేల?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి