నాలో నన్ను వెతుక్కుంటూ
నాతో నేను ఘర్షణ పడుతూ
నన్ను నేను ప్రశ్నించుకుంటూ
నన్ను నేను సమాధానపరుచుకుంటూ
ఓటమి పాఠాలను ఓదార్పులతో
సమస్యలు ఇచ్చిన ధైర్యంతో
నిస్సహాయతల నిట్టూర్పులతో
తాత్కాలిక ఆనందాల స్వాంతనతో
సాగుతున్న ఈ చిత్రమైన ప్రయాణంలో
నన్ను నేను తృప్తి పరచటానికే
నాతో నేను రాజీ పడలేక చస్తుంటే
ఇంక నీ కోసం కూడా ఎక్కడ రాజీ పడేది
నీతో ఉంటే నాతో నేను లేనట్టే
నన్ను నేను మాత్రమే భరించగలను
ఎందరిలో ఉన్నా నేనెప్పుడూ ఒంటరినే
ఒంటరిగా ఉంటేనే నయం ఎక్కడున్నా
నీ అంత సహనం నాకు లేదు
నేను అంత సాహసమూ చేయలేను
నాది ఒళ్ళు పొగరని నువ్వనుకుంటున్నావు
ఆత్మవంచన చేసుకోలేనని నేనంటున్నాను
ఏ మాత్రం రాజీ పడకూడదు అనుకుంటుంటే
నా మీద అలిగితే నేనేం చేయగలను
ఇప్పటికే చాలా రాజీ పడి బతుకుతున్నా
ఇంతకన్నా పడితే అది నాకు బతుకే కాదు
నా మనో భావాలే నాకు చాలా ముఖ్యం
అందుకే నాకు మనుషులకు చాలా దూరం
మీ సమాజంలో నాబోటి వాళ్ళకి చోటు లేదు
చచ్చి బతికిపోదామంటే చావు కూడా రాదు
నీకు నచ్చేట్టు నేను ఉండలేను
నీకే కాదు ఎవరీకి నచ్చను నేను
అందుకే నాలానే నేను ఉంటాను
అందుకే నాతోనే నేను ఉంటాను
నాతో నేను ఘర్షణ పడుతూ
నన్ను నేను ప్రశ్నించుకుంటూ
నన్ను నేను సమాధానపరుచుకుంటూ
ఓటమి పాఠాలను ఓదార్పులతో
సమస్యలు ఇచ్చిన ధైర్యంతో
నిస్సహాయతల నిట్టూర్పులతో
తాత్కాలిక ఆనందాల స్వాంతనతో
సాగుతున్న ఈ చిత్రమైన ప్రయాణంలో
నన్ను నేను తృప్తి పరచటానికే
నాతో నేను రాజీ పడలేక చస్తుంటే
ఇంక నీ కోసం కూడా ఎక్కడ రాజీ పడేది
నీతో ఉంటే నాతో నేను లేనట్టే
నన్ను నేను మాత్రమే భరించగలను
ఎందరిలో ఉన్నా నేనెప్పుడూ ఒంటరినే
ఒంటరిగా ఉంటేనే నయం ఎక్కడున్నా
నీ అంత సహనం నాకు లేదు
నేను అంత సాహసమూ చేయలేను
నాది ఒళ్ళు పొగరని నువ్వనుకుంటున్నావు
ఆత్మవంచన చేసుకోలేనని నేనంటున్నాను
ఏ మాత్రం రాజీ పడకూడదు అనుకుంటుంటే
నా మీద అలిగితే నేనేం చేయగలను
ఇప్పటికే చాలా రాజీ పడి బతుకుతున్నా
ఇంతకన్నా పడితే అది నాకు బతుకే కాదు
నా మనో భావాలే నాకు చాలా ముఖ్యం
అందుకే నాకు మనుషులకు చాలా దూరం
మీ సమాజంలో నాబోటి వాళ్ళకి చోటు లేదు
చచ్చి బతికిపోదామంటే చావు కూడా రాదు
నీకు నచ్చేట్టు నేను ఉండలేను
నీకే కాదు ఎవరీకి నచ్చను నేను
అందుకే నాలానే నేను ఉంటాను
అందుకే నాతోనే నేను ఉంటాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి