2, జనవరి 2015, శుక్రవారం


*చీకటి వెనుక వచ్చే ఉదయంకోసం వేచి చూడు
*రచయిత కాదల్చుకున్నవాడు ముందుగా ఉత్తమ పాఠకుడు కావాలి
*ఆనందకరమైన జీవితం నిశ్చలమైన మనస్సులో కొలువుంటుంది
*సంపద ఉప్పునీరు లాంటిది. త్రాగేకొద్దీ దాహం పెరుగుతుంది
*అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే, ఎప్పుడో ఒకప్పుడు అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది
*పగ తీర్చుకోవడం అప్పటికప్పుడు తృప్తినిస్తే, ఓర్పు ఎప్పటికీ తృప్తినిస్తుంది 
త్మవిశ్వాసం మెండుగా ఉన్నమనిషి ప్రతికూల పరిస్థితుల్లో కూడాతనని తాను 'ఆవిష్కరించుకోవడం' లో కూడా ముందుంటాడు, విజేతగా నిలుస్తాడు.
*యుద్ధానికి పొమ్మనికాని, పెళ్లి చేసుకొమ్మని కాని ఎప్పుడూ ఎవ్వరికీ సలహా ఇవ్వకు.
*పాపాలు చేసి దేనినీ సంపాదించవద్దు.
*ఇతరుల అభిప్రాయాలకు భయపడినంత కాలం మనం ఏ పనిలోనూ విజయం సాధించలేము.
*పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి.
*అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. అది జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
*వేలకోట్ల ధనరాసుల కధిపతివైనా ఒక్క 'నిముషం' ఆయుషుని కొనలేవని తెలుసుకో!
*'విజయం' నిన్ను పదిమందికి పరిచయం చేస్తుంది. ఓటమి తో నీకు ప్రపంచం పరచయమవుతుంది.
*జరిగేదేదో జరుగక మానదు. అనవసర ఆందోళనతో జరిగే మార్పు ఏమీ ఉండదు.
*ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓర్పు, సహనంతో వెతికితే అది దొరుకుతుంది. ----


*20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
*అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
*అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
*అందం అన్నది సత్యం యొక్క శోభ.
*అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
*పరులపట్ల విధేయత కనపరచు. కాని నీ నమ్మకానికి భిన్నంగా ప్రవర్తించవద్దు.
*అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది
*అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
*అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.
*అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు

*అడిగిన వెంటనే ఇచ్చే దానం గొప్పది.
*అణుకువ లేకుంటే అందం కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
*అతిత్తమమైన ఆదర్శం ఎంచుకుని దానికి తగ్గట్టుగా జీవించాలి
*వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
*అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.
*అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
*అదృష్టం సాహసవంతులనే వరిస్తుంది.
*అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
*అధ్యయనం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసి రాదు.
*అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు.. ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి