8, జనవరి 2015, గురువారం

మనము, మన దైనిక జీవితములొ ప్రతిపనిని , నిద్ర ,భొజనము ,ఆట పాటలు మొదలగునవి, ప్రతిరొజూ ఒకే కాలములొ(TIME)చేయటము ఆరొగ్యానికి మంచిదని చెప్పుతారు , ముఖ్యముగా భొజనము ప్రతి రొజూ ఒకే టైముకు తినటము తినేటప్పుడు ఇతర ఆలొచనలు పెట్టుకొకుండా ,తినేపదార్ధములగురించే ఆలొచన చేయ్టము ,అనగా ,ఏఏ పదార్ధములలొ ఏఏ విటమినులు వుండును ,ఖనిజములుండును , అవి మన శరీరానికి చేసే వుపయొగాలగురించి మననము చేసుకుంటూ నిదానముగా భొజనము చేస్తూ దానిని ఆస్వాదించినప్పుడు ,మన ఆరొగ్యానికి చాలా మంచిదని ,ఆదర బీదరగా రెండు మెతుకులు నొట్లొ వేసుకొని భొజనము ఐనదనిపించుట మంచిది కాదని , 1967-68 ప్రాంతములొ విశాఖ పట్నములొ అప్పటి MP భానొజీ రావుగారిని కలసి మాట్లాడుటకు ( విశాఖలొ ఈ నాడు పేపరు పెట్టు విషయములొ), రామొజీరావు గారితొ పాటు నేనూ వెళ్ళినప్పుడు ,ఒక సంధ్ర్భములొ భానొజీ రావు గారు అన్నమాటలు ....అప్పటినుంచి నేను భొజనము విషయములొ వారి సూత్రాలను చాలావరకు పాటించు చున్నాను , చాలా మంచిగా వున్నది ,అందుకే మీకు తెలియ చేస్తున్నాను ,మీరూ పాటించండి ,బాగుంటుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి