27, ఏప్రిల్ 2015, సోమవారం

    నిజమైన జర్నలిస్టు - నార్ల వారు.. ఆయన ఎడిటర్, సంపాదకుడు కాదు.
    1956-1974 మధ్య కాలంలోనే సొమ్ముకు అమ్ముడుపోయే పాత్రికేయులను ఇలా చీల్చి చెండాడారు..
    నవయుగాల బాట- నార్ల మాట నుంచీ కొన్ని...
    *ఎడిట రైన వాడు బిడియము చూపుచో
    ధాటితగ్గు వృత్తి ధర్మమందు;
    కడుపుకూటి వ్రాత కక్కుర్తి వ్రాతరా
    నవయుగాల బాట- నార్ల మాట!
    *వర్తమాన జగతి పరివర్తనాలపై
    స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి
    ఎడిటరెందుకోయి ఏటిలో గలవనా?
    నవయుగాల.....
    *నీతి నియతిలేని నీచుని చేతిలో
    పత్రికుండెనేని ప్రజకు చేటు;
    హంత చేత కత్తి గొంతులు కోయురా
    నవయుగాల...
    *ప్రజల సరస నిలిచిప్రధనమ్ము నడుపుట
    ప్రధమధర్మమోయి పత్రికలకు
    ప్రభుత పాదసేవ పత్రికలేలరా?
    నవయుగాల...
    *నిజము కప్పి పుచ్చి, నీతిని విడనాడి
    స్వామి సేవ చేయు జర్నలిస్టు
    తార్చువానికంటే తక్కువ వాడురా;
    నవయుగాల...
    *ఎడిటరైనవాడు ఏమైన వ్రాయును
    ముల్లె యొకటె తనకు ముఖ్యమైన
    పడపు వృత్తిలోన పట్టింపులుండునా
    నవయుగాల...
    *పత్రికారచనను పడపు వృత్తిగ మార్చు
    వెధవకంటె పచ్చి వేశ్యమేలు;
    తనువునమ్ము వేశ్య, మనసునుకాదురా

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

“ఈ ప్రపంచంలో తెలివైనవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు
.
. వదిలెయ్యకపోతే మేధావో, టీచరూ అవుతాడు. 
.
బలమైనవాడు నీతిని వదిలేస్తే రాజకీయ నాయకుడు అవుతాడు. 
..
వదిలెయ్యకపోతే శ్రామికుడు అవుతాడు.”
.
...............................................................................
"మనుష్యులు రెండు రకాలు.
తెలివైన వాళ్ళు. 
తెలివితక్కువ వాళ్ళు.
____________________
మనుష్యులు రెండు రకాలు. బలమున్న వాళ్ళు. 
బలంలేని వాళ్ళు. 
________________________
తెలివిగానీ, బలముగానీ లేనివాళ్ళు 
సామాన్యులవుతారు. 
________________________
బలం వున్నవాడు 
నీతిని వదిలేస్తే 
పొలిటీషియన్ అవుతాడు.
_______________________
తెలివి వున్నవాడు నీతిని వదిలేస్తే
కాపిటలిస్ట్ అవుతాడు.
____________________ 
తెలివైనవాడు నీతిని వదిలెయ్యకపోతే 
టీచరో, మేధావో అయి సంతృప్తి చెందుతాడు.
____________________ 
బలమైనవాడు నీతిని వదిలెయ్యకపోతే
శ్రామికుడై శక్తి ధారపోస్తాడు.
_____________________

23, ఏప్రిల్ 2015, గురువారం

మగవాడు భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం 
తన చాక్లెట్స్ చెల్లికి ఇవ్వగలవాడు 
తన కలలను తల్లి తండ్రుల చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు 
తన పాకెట్ మనీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు 
తన యవ్వన కాల మంతా త్యాగం చేసి భార్యా పిల్లలకోసం గొడ్డులా పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు వారి భవిష్యత్తు కోసం బ్యాంకు ల లో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి కట్టేవాడు .
అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు , భార్య , బాసు లతో తిట్లు తింటూ వాళ్ళ ఆనందం కోసం జీవించేవాడు
బయటకు వెడితే ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు కాలు పెట్టడు అంటారు
పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు
భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు
భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు
అమ్మ మాట వింటే అమ్మ కూచి అంటారు భార్య మాట వింటే బానిస బతుకు అంటారు .
ఆడపిల్లలూ మగవాడిని గౌరవించండి .
వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం .
మగవాళ్ళూ ! ఇది అందరికీ పంపించండి . ! మన మీద మనమే సానుభూతి చూపక పోతే ఎ

14, ఏప్రిల్ 2015, మంగళవారం

వయసు మీరిన వారంతా అపార ధనవంతులు -- మీకు తెలుసా !
ఎందుకంటే వారి కురులలో వెండి వుంటుంది,పళ్ళలో బంగారు వుంటుంది, మూత్ర పిండాలలో రావ్వలుంటాయి, రక్తము లో చక్కర, కడుపునిండా గ్యాసు. మరి వారు ధనికులుగాక మరేమిటి.

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

సీమ లో---హోము లో---.grin emoticon
ఎడమ చేత విస్కి పెగ్గు
కుడి చేతను చికెను లెగ్గు
నుదుటను విభూతి పట్టె
కుదురుగ బొట్టు పెట్టె
సీమ లో కులుకు వేరు
హోము లో పలుకు వేరు
మజా మస్తీలు అక్కడ
వొంగి నమస్తేలు ఇక్కడ
ప్లేటు ఫిరాయించాలి
అవతారం మార్చెయ్యాలి.
బీ ఎ రోమన్ ఇన్ రోం
బీ ప్యూర్ ఇండియన్ ఎట్ హోం
ఇది నా బాట కాదు,
ఇది నా మాట కాదు
నే నిత్యం చూస్తున్న ఆట

7, ఏప్రిల్ 2015, మంగళవారం

దానవకులవైరి దర్పంబు వర్ణించు, చడువులేవ్వరు గాని చదువరాదు..
సురపక్షపాతి విస్తురణకై గావించు, యాగంబులేవియు సాగారాదు..
అమరులమేలుకై ఆచరించెడి, యజ్ఞగున్డములయన్దగ్నిమండరాదు..
హరనామమేగాని హరినామదేయంబు, జగముననేవ్వడు స్మరిన్చరాదు...
అమరలోకవిజేత...!!! లంకాధినేత...!!!
హ...!!హ...!!! హ...!!!! హ...!!!!
రావణశాసనంబు నిరాకరించు
విష్ణుదాసులబట్టి కేల్ విరచిగట్టి
చెరనుబెట్టుడు దానవ శ్రేష్టులారా...!!

2, ఏప్రిల్ 2015, గురువారం


సంతోషం అదే వస్తుంది
పెద్ద ఇల్లు కడితే
ఆనందం ఆటోమేటిగ్గా వస్తుంది
బాజార్లో దొరికే వస్తువులన్నీ ఆఇంట్లో నింపితే
ఆనందం మనింటికి రాకుండా వుంటుందా
పెద్ద పడవలాంటి కారెక్కి ఊళ్ళన్ని ఊరేగితే
అబ్బో...ఆనందమే ఆనందం
వీటన్నింటి కోసం చకోరం లా ఎదురుచూడ్డం
ఆనందం ఎప్పుడో వస్తుంది
దాని కోసం అనంతంగా ఎదురుచూడ్డం...
ఈ వేటలో...ఎదురుచూపులో పడి
ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఆనందాన్ని
ఆకుపచ్చని వనాలని
అల్లరి చేసే పిల్లలని
తుర్రున ఎగిరే పిట్టలని
ఒక్కటేమిటి
నిరంతరం ప్రకృతి అందించే ఆనందాన్ని
తోసి రాజని
ఎప్పుడో వస్తుందని ఎదురు చూసే ఆనందం కోసం
అంగలార్చడం అయ్యో!!!! ఎంత విషాదం