నిజమైన జర్నలిస్టు - నార్ల వారు.. ఆయన ఎడిటర్, సంపాదకుడు కాదు.
1956-1974 మధ్య కాలంలోనే సొమ్ముకు అమ్ముడుపోయే పాత్రికేయులను ఇలా చీల్చి చెండాడారు..
నవయుగాల బాట- నార్ల మాట నుంచీ కొన్ని...
నవయుగాల బాట- నార్ల మాట నుంచీ కొన్ని...
*ఎడిట రైన వాడు బిడియము చూపుచో
ధాటితగ్గు వృత్తి ధర్మమందు;
కడుపుకూటి వ్రాత కక్కుర్తి వ్రాతరా
నవయుగాల బాట- నార్ల మాట!
ధాటితగ్గు వృత్తి ధర్మమందు;
కడుపుకూటి వ్రాత కక్కుర్తి వ్రాతరా
నవయుగాల బాట- నార్ల మాట!
*వర్తమాన జగతి పరివర్తనాలపై
స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి
ఎడిటరెందుకోయి ఏటిలో గలవనా?
నవయుగాల.....
స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి
ఎడిటరెందుకోయి ఏటిలో గలవనా?
నవయుగాల.....
*నీతి నియతిలేని నీచుని చేతిలో
పత్రికుండెనేని ప్రజకు చేటు;
హంత చేత కత్తి గొంతులు కోయురా
నవయుగాల...
పత్రికుండెనేని ప్రజకు చేటు;
హంత చేత కత్తి గొంతులు కోయురా
నవయుగాల...
*ప్రజల సరస నిలిచిప్రధనమ్ము నడుపుట
ప్రధమధర్మమోయి పత్రికలకు
ప్రభుత పాదసేవ పత్రికలేలరా?
నవయుగాల...
ప్రధమధర్మమోయి పత్రికలకు
ప్రభుత పాదసేవ పత్రికలేలరా?
నవయుగాల...
*నిజము కప్పి పుచ్చి, నీతిని విడనాడి
స్వామి సేవ చేయు జర్నలిస్టు
తార్చువానికంటే తక్కువ వాడురా;
నవయుగాల...
స్వామి సేవ చేయు జర్నలిస్టు
తార్చువానికంటే తక్కువ వాడురా;
నవయుగాల...
*ఎడిటరైనవాడు ఏమైన వ్రాయును
ముల్లె యొకటె తనకు ముఖ్యమైన
పడపు వృత్తిలోన పట్టింపులుండునా
నవయుగాల...
ముల్లె యొకటె తనకు ముఖ్యమైన
పడపు వృత్తిలోన పట్టింపులుండునా
నవయుగాల...
*పత్రికారచనను పడపు వృత్తిగ మార్చు
వెధవకంటె పచ్చి వేశ్యమేలు;
తనువునమ్ము వేశ్య, మనసునుకాదురా
వెధవకంటె పచ్చి వేశ్యమేలు;
తనువునమ్ము వేశ్య, మనసునుకాదురా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి