2, ఏప్రిల్ 2015, గురువారం


సంతోషం అదే వస్తుంది
పెద్ద ఇల్లు కడితే
ఆనందం ఆటోమేటిగ్గా వస్తుంది
బాజార్లో దొరికే వస్తువులన్నీ ఆఇంట్లో నింపితే
ఆనందం మనింటికి రాకుండా వుంటుందా
పెద్ద పడవలాంటి కారెక్కి ఊళ్ళన్ని ఊరేగితే
అబ్బో...ఆనందమే ఆనందం
వీటన్నింటి కోసం చకోరం లా ఎదురుచూడ్డం
ఆనందం ఎప్పుడో వస్తుంది
దాని కోసం అనంతంగా ఎదురుచూడ్డం...
ఈ వేటలో...ఎదురుచూపులో పడి
ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఆనందాన్ని
ఆకుపచ్చని వనాలని
అల్లరి చేసే పిల్లలని
తుర్రున ఎగిరే పిట్టలని
ఒక్కటేమిటి
నిరంతరం ప్రకృతి అందించే ఆనందాన్ని
తోసి రాజని
ఎప్పుడో వస్తుందని ఎదురు చూసే ఆనందం కోసం
అంగలార్చడం అయ్యో!!!! ఎంత విషాదం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి