30, మార్చి 2015, సోమవారం

కిట్టూ పద్యాలు
కాలగర్భమందు కలవని ఘనుడేడి
గతముకన్న మిన్నఘనతదేధి
గతము తలచి వలచి కన్నీటి చెంతన
సేదతీరువాడు సాధకుండు
చదువులెల్ల చదివి చనుబాలనొదులుచు
దూరతీరమేగి సిరులకోరి
కన్నవారుపోగ కర్మసేయగరారు
బతుకనేమి వారు చితుకనేమి
పరువు కొరకు నొకడు ప్రాకులాడుచునుండు
పరుల కొరకు నొకడు పాటుబడును
తనదుబతుకునొదలి జనుల బతుకుకోరి
సేవ సేయువాడె జీవనుండు
గతుకు పథము నందు బతుకులు బలియైన
వెతలనన్నిగాచి హితులనొదలి
గులకరాళ్ళనెత్తి గుంతలు పూడ్చుచు
బతుకు చుండె నొకడు భరత సుతుడు
Like ·  · Comment

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి