"వివాహ బంధం"
అనుబంధాల అలల తీరం .అనురాగాల కలల వరం
అభిమానాల కళల తరం .మమకారాల వలల ప్రియం
వివాహ వ్యవస్థ ప్రతికే కోటి వసంతాల రాగం
ప్రణతి ప్రణయాలను చేదించే పరిణయ సంబంధం.
సప్త అడుగుల కదలికలతో,సప్త వర్ణాల కలయికలతో,
నవ గ్రహాల ఆశీర్వచనాలతో,కాంతులు చిందే "అరుంధతి" తార సమక్షం లో
వస్తుంది....వధూ వరులకి నూతన వివాహ తిది.
విధి రాతలో ఓడినా......నిధి గోతిలో పడినా....
మనల్ని గెలిపించే ఒకే ఒక బంధం .రెండు మనసుల వివాహ సంబంధం.
అర్ధం చేసుకునే మనసు .అనుభవాన్ని పెంచే వయసు
అనుబంధాన్ని పంచె సొగసు
ఇవే నూతన దంపతులకు విశ్వ వారాల జల్లుల ఆశీస్సు..
గగనానికి.....భువనానికి.....యుగ యుగాలకి.......జగ జగాలకి...
ఈ విశ్వ ప్రపంచానికే వివాహ బంధం గొప్ప శక్తి వంతమైన విశ్వ సంబంధం.ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం...
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది..
"వివాహ బంధం"
అనుబంధాల అలల తీరం .అనురాగాల కలల

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి