22, ఏప్రిల్ 2016, శుక్రవారం

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా ||సిగలోకి||
పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసి మమతలు రోసి మనుగడ మసిచేస్తావా
తనువు చిక్కి శల్యంబైనా తలుపులణగిపోయేనా
ఇరువైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా ||సిగలోకి||
తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
కోరినది చేతికి చిక్కి ఆరుతున్నదొక దీపం
కోరినది చేతికి రాక ఆరకున్నదొక తాపం
ఆరకున్నదొక తాపం ||సిగలోకి||
అంధుని ఎదుట అందాలేలా?
అడవికి పున్నమి వెన్నెలలేలా?
అసమర్ధునికవకాశాలేలా?
వృధా వృధా బ్రతుకు వృధా
--ఆత్రేయ,ఘంటసాల,కేవిమహదేవన్,సుమంగళి 1965

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి