29, డిసెంబర్ 2016, గురువారం

దాన వీర శూర కర్ణ

🍃________🌺__________🍃
కర్ణుడికి దాన కర్ణుడని గదా పేరు

 ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాడట.

అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు.

తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది.

కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాహున్నది నాకిస్తావా? అని అడిగాడు.

వెంటనే కర్ణుడు తేసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె
యిచ్చాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు? కుడిచేత్తో యీయరాదా? అన్నాడు.

 అందుకు కర్ణుడు
క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:

అర్థము:-- కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి
చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణం లో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుంచు ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు.

అందుకనే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే
చెయ్యాలనే హితోక్తి ననుసరించి యిలా చేశాను.అన్నాడు.

అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు.

అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా
దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ

అర్థము:- కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.అంతే కాదు నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు. అని కోరాడు.

దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.

దానం విషయం లో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి.

దానం చేసి నేను చేశానని
డప్పు కొట్టుకోకూడదు.

ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు.

మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి. .
🍃🌺🌺🌺🙏🏼🌺🌺🌺🍃

25, డిసెంబర్ 2016, ఆదివారం

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

చేతి వృత్తుల చేతులిరిగిపాయె, నా పల్లెలోన
అయ్యొ గ్రామ స్వరజ్యం గంగలోనబాయె, ఈ దేశంలోన

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈత కల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును తాగిన మంది కండ్లు నిండుసులయ్యినవి

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి, సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెల నుంచీ

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

పూసలోల్ల తాలాము కప్పలు,
కాశిలో కలసి ఖతమౌతున్నవి.

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువు కుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండిగిల్లెగిరి పడ్డదో నా పల్లెల్లోనా.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ…
పంటపొలాల మందుల గత్తర వాసన

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై…
…బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.
- గోరటి వెంకన్న

20, డిసెంబర్ 2016, మంగళవారం

ఆనందమంటే....
పసివాళ్ళ అమాయకత్వం నిలుపుకోవడం
పచ్చదనాన్ని ప్రేమించడం
చుట్టూ ఉన్నవాళ్ళ కష్టానికి స్పందించగలగడం
భవిష్యత్తు మీద బెంగలతో కుంగకపోవడం
గతాన్ని   బిందాస్ గా బతకగలగడం
నా దృష్టి లో ఆనందమంటే ఇదే.
నా ఆచరణ కూడా ఇదే...

15, డిసెంబర్ 2016, గురువారం

సంగీత దర్శకులు చక్రి గారికి నివాళి

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
కవినై..కవితనై..భార్యనై..భర్తనై
కవినై..కవితనై..భార్యనై..భర్తనై
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ..
వంటరినై అనవరతం .. ఉంటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై..
వెన్నెల పూతల మంటను నేనై..
రవినై..శశినై..దివమై..నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిముషం .. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల..హరిణాల్ని హరిణాల..చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని..ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
గాలిపల్లకీ లోన తరలినా పాట పాప ఊరేగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలీ..
నా హృదయమే నా పాటకి తల్లీ..
నా హృదయమే నాకు ఆలి..
నా హృదయములో ఇది సినీ వాలి..
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
Music : Chakri
Lyrics : Sirivennela Seetarama Shastry
Singer : Chakri

సంగీత దర్శకులు చక్రి గారికి నివాళి

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
కవినై..కవితనై..భార్యనై..భర్తనై
కవినై..కవితనై..భార్యనై..భర్తనై
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ..
వంటరినై అనవరతం .. ఉంటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై..
వెన్నెల పూతల మంటను నేనై..
రవినై..శశినై..దివమై..నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిముషం .. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల..హరిణాల్ని హరిణాల..చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని..ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
గాలిపల్లకీ లోన తరలినా పాట పాప ఊరేగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలీ..
నా హృదయమే నా పాటకి తల్లీ..
నా హృదయమే నాకు ఆలి..
నా హృదయములో ఇది సినీ వాలి..
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

12, డిసెంబర్ 2016, సోమవారం

తల్లి  గర్భము  నుండి ! ధనము  తేడెవ్వడు !  (2)
వెళ్ళి  పోయెడి  నాడు !  వెంట  రాదు !
లక్షాధికారైన- లవణ మన్నమే కానీ !
మెరుగు  బంగారంబు ! మింగ  బోడు !
విత్తమార్జన జేసి ! విర్రవీగుటె  కానీ !
కూడ బెట్టిన  సొమ్ము ! కుడవ  బోడు !
పొందుగా  మరుగైన- భూమి  లోపల బెట్టి !
దాన  ధర్మము  లేక !  దాచి  దాచి !
తుదకు  దొంగల కిత్తురో- దొరల  కవునో !
తేనె జుంటీగ లియ్యవా- తెర  వరులకు !
భూషణ  వికాస !  శ్రీ ధర్మపురి  నివాస !
దుష్ట  సంహార ! నరసింహ ! దురిత దూర !!

9, డిసెంబర్ 2016, శుక్రవారం

"మౌనం వహించు"
మౌనం వహించు కోపం వచ్చినపుడు..
మౌనం వహించు నీకు వాస్తవాలు తెలియనప్పుడు..
మౌనం వహించు నువ్వు వింటున్న సందర్భంలో..
మౌనం వహించు నీ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటే..
మౌనం వహించు నీ తప్పును జోక్ గా చెప్పవలసి వస్తే..
మౌనం వహించు నీ మాటలకు తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది అనుకుంటే..
మౌనం వహించు నీకు సంబంధం లేని విషయం లో మాట్లాడవలసివస్తే..
మౌనం వహించు అబద్ధం చెప్పవలసిన సందర్భంలో..
మౌనం వహించు ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడవలసివస్తే..
మౌనం వహించు స్నేహానికి భంగం కలుగుతోంది అనుకుంటే..
మౌనం వహించు క్లిష్టమైన సందర్భాలలో..
మౌనం వహించు నీవు అరచి చెప్పవలసిన సందర్భాలలో..
మౌనం వహించు భగవంతుని విషయంలో..
మౌనం వహించు ఒక చెడ్డవాడిని పొగడవలసిన సందర్భం లో..
మౌనం వహించు పని చేసుకోవలసిన సందర్భంలో..
ఎవరు అయితే తన నోటినీ నాలుకనూ అదుపులో ఉంచుకుంటారో వారే జీవితంలో సమస్యలను దూరంగా ఉంచుకోగల్గుతారు. చిరునవ్వు ప్రతికూల
పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు
అందుకే ఎల్లప్పుడూ నవ్వుతు ఉండండి..!!
ధర్మో రక్షతి రక్షితః - ఈ వాక్యం అర్ధం
"ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".

6, డిసెంబర్ 2016, మంగళవారం



చిన్నాఱి పొన్నాఱి చిఱుత వయస్సులో
              తరుణి పెంచబడును  తండ్రిచేత
నవనవ లాడిన నవయౌవనమ్మున
                పడతి నడచుటౌను పతినిగూడి
మధుర మంజులమైన మధ్య కాలమ్మంత
                 వనిత గడపుటౌను భర్తతోడ
అతి భయంకరమైన అవసాన కాలాన
                  సుదతి  పోషణపొందు సుతుని చేత

భర్త యనురాగమును గొన్న భార్యకింక
భాగ్యమున్నను లేకున్న పనియులేదు
కష్ట సుఖముల నిద్దరున్ కలిసియున్న
కాపురముగాదె బంగారు గోపురమ్ము  !

డా !! మీగడ రామలింగస్వామి