12, డిసెంబర్ 2016, సోమవారం

తల్లి  గర్భము  నుండి ! ధనము  తేడెవ్వడు !  (2)
వెళ్ళి  పోయెడి  నాడు !  వెంట  రాదు !
లక్షాధికారైన- లవణ మన్నమే కానీ !
మెరుగు  బంగారంబు ! మింగ  బోడు !
విత్తమార్జన జేసి ! విర్రవీగుటె  కానీ !
కూడ బెట్టిన  సొమ్ము ! కుడవ  బోడు !
పొందుగా  మరుగైన- భూమి  లోపల బెట్టి !
దాన  ధర్మము  లేక !  దాచి  దాచి !
తుదకు  దొంగల కిత్తురో- దొరల  కవునో !
తేనె జుంటీగ లియ్యవా- తెర  వరులకు !
భూషణ  వికాస !  శ్రీ ధర్మపురి  నివాస !
దుష్ట  సంహార ! నరసింహ ! దురిత దూర !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి