చిన్నాఱి పొన్నాఱి చిఱుత వయస్సులో
తరుణి పెంచబడును తండ్రిచేత
నవనవ లాడిన నవయౌవనమ్మున
పడతి నడచుటౌను పతినిగూడి
మధుర మంజులమైన మధ్య కాలమ్మంత
వనిత గడపుటౌను భర్తతోడ
అతి భయంకరమైన అవసాన కాలాన
సుదతి పోషణపొందు సుతుని చేత
భర్త యనురాగమును గొన్న భార్యకింక
భాగ్యమున్నను లేకున్న పనియులేదు
కష్ట సుఖముల నిద్దరున్ కలిసియున్న
కాపురముగాదె బంగారు గోపురమ్ము !
డా !! మీగడ రామలింగస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి