11, జనవరి 2017, బుధవారం

ఇవాళ లాల్ బహుద్దూర్ శాస్త్రి గారి వర్ధంతి ఆసందర్భంగా

,
అంశం:శ్రీ లాల్ బహుద్దూర్ శాస్త్రి

ఆ.వె:పాఠములను నేర్పు పంతులింటను బుట్టె
       పేదరికములోనె విద్య నేర్చె
        బాల్యమందె తండ్రి పరమపదింపగా
        తాతగారి యింట తాను పెరిగె.

ఆ.వె:మచ్చలేని నేత మహిలోన నీశాస్త్రి
       ప్రజల సొమ్ము తాక వలదటంచు
        హితవు తాను తెలిపె నింపుగా  జనులకు
        నాచరించి చూపె ననవరతము.

ఆ.వె:జాతి సతము తలచు జననేత శాస్త్రీజి
       మరువబోకు మెపుడు మహిని నీవు
        నీతి నియమములకు నేస్తమీతడటన్న
     నతిశయోక్తి కాద  నరయుడయ్య .

ఆ.వె:శాంతి ముఖ్యమనెడిసందేశ మొసగుచు
         దేశనేత యైన ధీరు డితడు
          పొట్టి వాడ యినను గట్టి వాడు యనెడి
          మెప్పు బడసినట్టి గొప్పనేత.                                              

ఆ.వె: జైకిసానటంచు జగతిలో రైతన్న
           గొప్పచాటె నెంతొ కూర్మి తోడ
            ఆత్మబంధువయ్యె నన్నదాతలకెల్ల
            కోటికొక్కరుంద్రు కువలయమున.                                        

ఆ.వె:భరత జాతి కొరకు ప్రాణముల్ వీడుచు
          నమరుడయ్యె నేత  యవని యందు
           వారు నడచి నట్టి బాట ననుసరించ
             వడిగ రండు మీరు  యడుగు లేయ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి