21, ఫిబ్రవరి 2017, మంగళవారం

ఎవడయ్య వాడు తెలుగువాడు..
---------------------
శాతవాహనుల వంశాన పుట్టిన వాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనే కాదు డిల్లీలో సైతమ్ము
పెద్దగద్దేలనేలి పెరుకేక్కినవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

పంచె కట్టుటలో మొనగాడు
కండువాలేనిధే గడపదాటని వాడు
పంచబక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసువాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

నేల నల్దేసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టే ఒదిగినవాడు
"ఎ దేసమేగిన ఎందుకాలిడినా"
ఆవకాయ వియోగామసలె సైపని వాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు
భాయీ భాయీ అన్న చేయి కలిపేవాడు
తిక్కరేగిందంటే డొక్కా చీల్చేవాడు
చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

-------- డాక్టర్ సి.నారాయణ రెడ్డి

18, ఫిబ్రవరి 2017, శనివారం

సప్తాశ్వ రధమారూఢం, ప్రచండం,కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం, దేవం, తం సూర్యం ప్రణమామ్యహమ్.
భర్తృహరి--శశికళ?  :D :D

అబ్బే,  భర్తృహరి ఆమెను దృష్ఠిలో పెట్టుకుని వ్రాయలేదు.

 ఒకచో నేలను బవ్వళించు, నొకచోనొప్పారు బూసెజ్జపై
నొకచోశాకములారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం
బొకచో బొంత ధరించు, నొక్కొకతఱిన్ యోగ్యాంబరశ్రేణి, లె
క్కకు రానీయరు కార్యసాధకులు కష్టంబున్ సుఖంబున్ మదిన్.

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

@ఘంటసాల @

జానపదమొకండు జనులు మెచ్చగ పాడు
      పద్యంబు నొక్కండు పాడగలడు
లలిత గీతమొకడు లయబద్దముగ బాడు
      శ్లోకంబు కొక్కడు శోభదెచ్చు
శాస్త్రీయమొక్కడు  శ్రావ్యంబుగా పాడు
      కీర్తనలనొకండు కీర్తిబొందు
భక్తి గీతమొకడు రక్తిగా పాడును
      పాశ్చాత్యమొక్కడు పలుకగలడు

ఎట్టిపాట గాని యే శ్లోకములు గాని
పద్యమైన మరియు గద్యమైన
నవరసంబు లొలుకు నాయాసమే లేక
ఘంటసాల వారి గళమునందు.

(సేకరించిన పద్యము)

8, ఫిబ్రవరి 2017, బుధవారం

పోస్ట్ పూర్తిగా చదివి అప్పుడు లైక్ చేయండి
'ఆ రోజులే బాగున్నాయ్' !
.....................................
టెన్షన్లు..
ఒత్తిళ్లు...
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన .
#ఆ రోజులు బాగున్నాయ్..!
ఆదివారం
ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన
#ఆ రోజులు బాగున్నాయ్..!
మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర,
బోరింగుల దగ్గర,
బావుల దగ్గర...
నీళ్లు తాగిన...
#ఆ రోజులు బాగున్నాయ్..!
ఎండాకాలం
చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం..
ఎర్రని ఎండను సైతం
లెక్కచేయని...
#ఆ రోజులు బాగున్నాయ్..!
వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో
శుక్రవారం చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన
#ఆ రోజులు బాగున్నాయ్..!
సెలవుల్లో
అమ్మమ్మ..
నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
#ఆ రోజులు బాగున్నాయ్..!
ఏసీ కార్లు లేకున్నా
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి
ప్రకృతిని ఆస్వాదించిన
#ఆ రోజులు బాగున్నాయ్...!
మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన
#ఆ రోజులు బాగున్నాయ...
ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
#ఆ రోజులే బాగున్నాయ్..!
సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..
#ఆ రోజులే బాగున్నాయ్...!
ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
#ఆ రోజులే బాగున్నాయ్..!
ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
#ఆ రోజులే బాగున్నాయ్...!
చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా
పెద్దలంతా కలసివుండే
#ఆ రోజులే బాగున్నాయ్..!
ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
#ఆ రోజులే బాగున్నాయ్..!
ఇప్పుడు రకరకాల
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో
పుల్ల ఐసు కొనితిన్న...
#ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!
పొద్దుపోయేదాకా
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని
చందమామను చూస్తూ నిదురించిన..
#ఆ రోజులు బాగున్నాయ్..!
#ఆ రోజులు బాగున్నాయ్..
#ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...
*ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది.
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....

Courtesy Akhila bharata sakhaharabhojana sangham group

6, ఫిబ్రవరి 2017, సోమవారం

దినముగడచుకొలది దిగజారునందము
వయసుపెరుగుకొలది పట్టుసడలు
కడకువడలుకమిలి కాంతివిహీనమౌ
సిరులనొసగుబాటశివునిమాట

★★★★★★★★★★★★★★★★★
వయసు మీదపడగ ◆వశముదప్పుతనువు
కనగవస్తుతతియు ◆కళలుతప్పు
తనువు తత్వమిదియె ◆తరుగునాయువెపుడు
విశ్వజనహితోక్తి!◆విష్ణుసూక్తి!!
★★★★★★★★★★★★★★★★★★★★