21, ఫిబ్రవరి 2017, మంగళవారం

ఎవడయ్య వాడు తెలుగువాడు..
---------------------
శాతవాహనుల వంశాన పుట్టిన వాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనే కాదు డిల్లీలో సైతమ్ము
పెద్దగద్దేలనేలి పెరుకేక్కినవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

పంచె కట్టుటలో మొనగాడు
కండువాలేనిధే గడపదాటని వాడు
పంచబక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసువాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

నేల నల్దేసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టే ఒదిగినవాడు
"ఎ దేసమేగిన ఎందుకాలిడినా"
ఆవకాయ వియోగామసలె సైపని వాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు
భాయీ భాయీ అన్న చేయి కలిపేవాడు
తిక్కరేగిందంటే డొక్కా చీల్చేవాడు
చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.!

-------- డాక్టర్ సి.నారాయణ రెడ్డి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి