చిన్నప్పటి మన ఇరుకిరుకు ఇళ్లు...
ఆనందాలు క్రిక్కిరిసిన అందాల జ్ఞాపకాల పొదరిళ్లు...
సరిపోవడం లేదిప్పుడు ఒక్కొక్కడికీ రెండు మూడిళ్ళు...
ఐనా సరే శరీరానికి కాక మనసుకు పడిపోతున్నాయ్ డిప్రెషన్, టెన్షన్ల పుళ్లు...
వదిలేసి వచ్చాక సంపాదిద్దామని నాలుగు రాళ్లు...
మరచిపోతున్నామిప్పుడు బతుకునిచ్చిన ఊళ్లు...
సవాలక్ష కారణాలతో వాళ్లు వెళ్ళారని వీళ్లు,వీళ్లు వెళ్లారని వాళ్లు...
అలా వలసలు పెరిగి కళ తప్పిపోతున్నాయ్ పల్లెటూళ్ళు...
మహ గడుసువారండీ కొత్తతరం కోడళ్లు...
సిటీకి మారతానన్నాకే వేయించుకుంటున్నారు మూడు ముళ్ళు...
మొదలయ్యాక గానీ నొప్పుల కీళ్ళు...
గుర్తుకు రావేమో జన్మనిచ్చిన ఊళ్లు...
నెత్తికెక్కి పూర్తిగా కళ్లు...
పండక్కెళ్లడాన్నికూడా వాయిదా వేసేస్తున్నాం ఏళ్లకేళ్లు...
పొట్ట రావడమే కాదు నిజంగానే బలిసిందేమో ఒళ్లు...
అందుకే బద్ధకంతో గడిపేస్తున్నాం వెళ్లకుండా ఏళ్లూ పూళ్ళు...
ఒక్కసారి గుర్తుకొచ్చాయా మనం చదివిన ఆ స్కూళ్లు...
భూమ్మీద ఆగవింక మన కాళ్లు...
ఇరవై ఎక్కాలు ఇరవైల దాకా చెప్పడంలో అప్పుడు మనం లేళ్లు...
తేడా వస్తే వెనక్కి తిప్పి కొట్టేవారు వేళ్ళు...
మందమయిపోయాయిప్పుడు మన మెదళ్ళు...
సెల్ఫోన్ కాలిక్యులేటర్లో చూస్తున్నామిప్పుడు ఎంతోనని రెండు మూళ్ళు...
కొరికినట్టు కనబడితే గోళ్ళు...
మాస్టారిచేతిలో అనేది చెంప ఛెళ్లు...
గుర్తున్నాయా పబ్లిక్ పరీక్షలు పదులూ, ఏళ్లు...
మరచిపోడం ధర్మమా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆయన చేసిన మేళ్ళు...
తన పిల్లల చదువును, భవిష్యత్తును పణంగా పెట్టి మాస్టారు మనసులో లేకుండా కుళ్లు...
డేగలా కాస్తూ చదివించేవారు దాటేదాకా అర్థరాత్రుళ్లు...
అప్పుడనిపించేవి అవి కాళరాత్రుళ్లు...
ఇప్పుడు పెడుతున్నాయి మనకూ,బిడ్డలకూ కూళ్ళు...
ఒక్కసారి ఆయనింటికెళ్ళు...
బ్లాక్ బోర్డు లాంటి మన బుర్రలో తెల్లని జ్ఞానాన్ని నింపిన బస్తాలకొద్దీ చాక్ పౌడర్ ఎఫెక్ట్ తో టీబీ వచ్చి దగ్గుతున్నారేమో అవసానదశలో ఖళ్ళూ ఖళ్లు...
గుర్తున్నాయా ఇంట్లోనే పెంచిన గేదెలూ, కోళ్లు...
వేసవిసెలవుల్లో ఆడిన అష్టాచెమ్మా, వైకుంఠపాళి గళ్ళు...
మామిడి కాయల దొంగతనాల కోత గాళ్లు...
కాపు కాసేవాడు చూస్తే చాలు వెనక్కు తిరక్కుండా పరుగెత్తేవాళ్ళు...
కులమతభేదాలెరగక నేస్తాలతోపాటు తిరిగాం చర్చిలు,మసీదులూ గుళ్ళు...
ఇప్పుడు అల్లుకున్నాం ఒకరికొకరం కలవలేని వనభోజనాలక్కూడా కులమతాల సాలె గూళ్ళు...
జంతికలూ, పప్పు బెల్లాలే కదా మనకు తెలిసిన చిరు తిళ్ళు...
మహదానందంతో చప్పరించేవాళ్లం చాక్లెట్లు కొనలేక జీళ్ళు...
ప్రతీరోజూ చెట్టెక్కి మరీ కోసేవాళ్లం జాంపళ్లు...
ఫ్రూట్సంటే తెలిసిందొకటే బయటకొనే అరటి పళ్ళు...
ఎర్రటి ఏప్రిల్ ఎండలో తార్రోడ్డు పై కాల్తున్నా కాళ్లు...
చెట్ల నీడల్లో ఆగుకుంటూ వెళ్ళేవాళ్ళం కొనే స్థోమత లేక జోళ్ళు...
అప్పుడు మా బ్యాచ్ అంతా ఏడిపించేవాళ్ళు...
ఇద్దరు ముగ్గురమున్నామని మరీ పొట్టి పిల్లోళ్ళు...
ఇప్పుడనిపించుకుంటున్నాం పొడుగాటోళ్లు...
హైటులోనే కాదు తవికలు కూడా రాసేస్తున్నాం మైళ్లకుమైళ్లు...
చిన్నప్పటి వరసల అల్లరి బావా మరదళ్ళు...
గుర్తొచ్చాయంటే అవి, మనసెంతో ఆనందంతో తుళ్లు...
ఆరుబయట మంచమేస్తే చందమామనూ,చుక్కలనూ చూస్తుంటే నిద్రపట్టేసేది లేకుండానే దుప్పట్లూ, దిళ్లు...
ఇప్పుడు ఏసీ ఇరవైలో ఉన్నా కలత నిద్రే నూటికి నూరు పాళ్లు...
ఎప్పుడయినా చూడాలంటే తిరునాళ్ళు...
దాటి వెళ్లాల్సొచ్చేది ఐదూళ్ళు...
తిరుగు ప్రయాణంలో పొలిమేర దాటగానే దెయ్యాల భయంతో గుంపులు గుంపులుగా యమజోరుగా తొక్కేవాళ్లం సైకిళ్లు...
భయం పోగొట్టుకోడానికి పాటలు పాడుకుంటూ చేరుకునే వాళ్లం అర్థరాత్రిళ్ళు...
ఒకోసారి నాటకాలు, రికార్డింగ్ డాన్సులు,ఆర్కెస్ట్రాలు వదల్లేక తెల్లారిపోయేది భళ్లు...
ఆనక నాన్న చేతిలో వలిపించుకునేవాళ్లం తోళ్లు...
చుండ్రనే పదం తెలీనీకుండా కాపాడిన, వారానికోసారి బ్రహ్మ ప్రళయం తెచ్చే కుంకుళ్లు...
మరచిపోయి అయ్యింది ఎన్నేళ్ళు...
మధ్యలో వాటిని వదిలేసినందుకు గిఫ్ట్ గా వచ్చిన బట్టతలపై ప్రతీరోజూ జార్చేస్తున్నాం షాంపూ నీళ్లు...
పిల్లలకూ అలవాటు చేయడం వలన టీనేజిలోనే తెల్లవెంట్రుకల బారిన పడిపోతున్నారు మన బుడ్డోళ్లు...
సీజనొచ్చిందా మొదలయ్యేయి పెళ్ళిళ్ళు...
పక్కూరికైనా కట్టేవాళ్ళు వరసగా ఎడ్ల బళ్ళు...
ఎక్కడ చూసినా ఉండేయి పచ్చిక బైళ్ళు...
చూసేకొద్దీ చూడాలనిపించేవి వరి నారు మళ్లు...
రియల్ వ్యాపారంతో అయిపోతున్నాయవిప్పుడు బీళ్లు...
పచ్చిగడ్డి,ఎండు గడ్లకోసం పాడి పశువులు జాలిగా తెరుస్తున్నాయి నోళ్లు...
గుర్తుకు తెచ్చుకోండి మొదటి సినిమా చూసిన టూరింగ్ సినిమా హాళ్లు...
నేల టికెట్ కెళ్లి అక్కడ పరచిన ఇసుకలో ఆడిన గుజ్జన గూళ్లు...
ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ వీకెండ్లో మాళ్ళు...
ఉసూరుమంటూ తలనొప్పితో మళ్లెప్పుడూ పోకూడడదంటూ శపథాలు పడుతూ తీస్తున్నాం పార్కింగ్ లోంచి బళ్లు...
నెలకోసారైనా వెనక్కెళ్లి తిప్పండి ఆ రీళ్ళు...
ఆ జ్ఞాపకాలే రక్షిస్తాయి కాకుండా మన జీవితాల్ని మోళ్లు...
సరదాగా మొదటిసారి ఎక్కిన రైళ్లు...
పట్టాలపై నాణేలు పెట్టి రైలెళ్లిపోయాక సంబరంతో అవి తీసి దాచుకున్నాం ఏళ్లు...
చదూతూ పోతోంటే తిరుగుతున్నాయా జ్ఞాపకాల సుళ్ళు...
చూస్తారే వేసుకోండిక కమెంట్ల వీరతాళ్లు...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి