27, మార్చి 2018, మంగళవారం

వీరమాచనేని డైట్

వీరమాచినేని గారి డైట్ సవివరంగా ప్రశ్నలు, సమాధానాల రూపంలో : వీరమాచినేని గారి వీడియోల ఆధారంగా : 1. వీరమాచినేని గారి డైట్ అంటే ఏమిటి ? 2. ఈ డైట్ వల్ల ఏ ఏ సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది ? 3. ఈ ఆహార పద్ధతి యొక్క ప్రత్యేకత ఏమిటి ? 4. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని ఎలా ప్రారంభించాలి ? 5. ఏ ఏ వయసువారు ఈ డైట్ ను పాఠించవచ్చు ? 6. ముందు నుండి మందులు వాడుతుంటే ఏం చేయాలి ? 7.షుగరు ఉన్నవారు ఈ డైటును ఎన్ని రోజులు పాఠించాలి ? దీనితో షుగరు పూర్తిగా తగ్గుతుందా ? 8. ఈ డైట్’ను ప్రారంభించేముందు తెలుసుకోవలసిన విషయాలేమీటి ? 9. ఇందులో తెలుపబడిన సమస్యలు అందరికీ తగ్గుతాయా లేదంటే ఎవరైనా మినహాయింపు ఉన్నారా ? 10. ఈ డైట్’లో షుగర్ సమస్య ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ? 11. ఈ డైట్ యొక్క మూల స్థంబాలు (పిల్లర్స్) ఏమిటి ? 12. ఈ డైట్’లో తీసుకోవలసిన ఆహారం ఏమిటి? మరియు దాని మోతాదు ఎంత ? 13. ఈ ఫ్యాట్’ను తీసుకునే విధానం ఏమిటి ? 14. ఈ డైట్’లో తెలుప బడిన పదార్ధాలు ఏ ఏ సమయాలలో ఎంత తీసుకోవాలి ? 15. టీ మరియు కాఫీలు తీసుకోవచ్చా ? 16. ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీను ఎలా చేయాలి ? 17. మార్బిడ్ ఒబేసిటీ అంటే ఏమిటి ? 18. లిక్విడ్ డైట్ చేసే విధానం ఏమిటి ? 19. లిక్విడ్ డైట్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ? 20. ఈ లిక్విడ్ డైట్ ఎన్ని రోజులు చేయాలి ? 21. షుగరు సమస్య ఉన్నవారు తమకు తెలియకుండానే షుగరు తింటుంటారు. అది ఎలాగా ? 22. వీరమాచినేని వారు చెప్పినట్టుగా విచ్చలివిడిగా తినడం అంటే ఏమిటి ? 23. ఈ డైట్ లో ఆకలి తీరు ఎలాఉంటుంది ? 24. విజయవంతంగా ఈ డైట్ ముగించిన తరువాత పోయిన సమస్యలు మళ్ళీ పునరావృతమవుతాయా ? 25. ఈ డైట్ శాస్త్రియంగా నిరూపితమై ఉందా ? దీనిపై ఏమైనా విమర్శలున్నాయా ? 26.కీటో డైట్ అంటే ఏమిటి ? వీరమాచినేని గారి డైట్ కూడా ఇలాంటిదేనా ? 27.అసలు ఈ డైట్ ప్రోగ్రామ్ ఎలా మొదలైంది ? మనదగ్గరే ఎందుకని ఎక్కువగా ప్రచారం మరియు చర్చలు జరుగుతున్నాయి ? 28. టైప్ వన్ షుగర్ సమస్యకు ఇది ఎందుకని పని చేయదు ? టైప్ టూ షుగర్ కు మాత్రమే ఎందుకు పని చేస్తుంది ? 29. వీరమాచినేని గారి - వారి స్నేహితుల ముఖ్య ఫోన్ నెంబర్లు ? 30.కొంతమంది మాకు ఈ డైట్ పని చేయకుండా ఆగిపోయింది అని చెబుతుంటారు కారణం ఏమిటి ? 31. పొడవుకు తగ్గ సరైన వెయిట్ ఉన్నవారు ఈ డైటును పాఠిస్తే మరింత తగ్గిపోతారా ? 32. డైట్’లో ఉన్నప్పుడు షుగర్ లెవెల్ తగ్గితే (డౌన్ అయితే) ఏం చేయాలి ? ఈ సమయంలో తీపి తీసుకునే అనుమతి ఉందా ? 33. బీపీ ఉన్నవారు బీపీ టాబ్లెట్ వేసుకోవచ్చా లేదా ? 34. పిండి పదార్ధాలు అంటే ఏమిటి ? 35. ఈ డైట్ లో పిండి పదార్ధాలు ఎలా తీసుకోవాలి ? 36. ఈ డైట్ లో తీసుకునే ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ పెరగదా ? 37. ఈ డైటులో అత్యంత జాగ్రత్త వహించాల్సిన, అత్యంత సున్నిత అంశాలు ఏమిటి ? లేదా ఈ డైట్ ను ఒక్కసారిగా నిర్వీర్యం చేసే, నిలిపివేసే అంశాలు ఏమిటి ? 38.ఈ డైట్ మొదలుపెట్టేటప్పుడు ఏ పరికరాలు దగ్గరుంతే మంచిది ? 39. అధిక భారం వల్ల అవయవాలపై ఎటువంటి ప్రభావం పడుతుంది ? 1. వీరమాచినేని గారి డైట్ అంటే ఏమిటి ? పిండి పదార్ధాలు(కార్బోహైడ్రేట్స్) చాలావరకు తక్కువ తీసుకుంటూ, ఫ్యాట్ (మీకు తెలుపబడిన), మాంసాహారము, శాఖాహారము (నిషేదించిన కూరగాయలు తప్ప) మరియు మీకు సూచించబడిన నట్స్, సీడ్స్ తీసుకుంటూ పండ్లు మరియు తీపి అనేది ఏ మాత్రం ముట్టకుండా ఒక ప్రత్యేక పద్ధతిలో చేసే డైట్’ను వీరమాచినేని డైట్ అంటారు. 2. ఈ డైట్ వల్ల ఏ ఏ సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది ? నిజానికి అధిక బరువును తగ్గించువడానికి ఈ ప్రత్యేక ఆహార పద్ధతిని ప్రయోగాత్మకంగా అబివృద్ధి చేయబడినది, కానీ ఆశ్చర్యకరంగా అధిక బరువే కాకుండా టైప్ టూ షుగరు, స్పాండలైటీస్, ధైరాయిడ్, ఋతుక్రమం సరిగా లేకపోవడం, బీపీ, మైగ్రేన్ తలనొప్పి, సోరియాసిస్, నిద్రలో గురక పెట్టడం వంటి సమస్యలు కూడా దూరమవుతున్నాయి, అంతే కాకుండా శరీరంలో శక్తి, సత్తువ కూడా పెరుగుతుంది. 3. ఈ ఆహార పద్ధతి యొక్క ప్రత్యేకత ఏమిటి ? ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేదు, ఇది కేవలం ప్రత్యేక ఆహార పద్ధతి మాత్రమే, ప్రాకృతికమైనది, తక్కువ సమయంలోనే సమస్య పరిష్కరించబడడం దీని ప్రత్యేకత. 4. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని ఎలా ప్రారంభించాలి ? తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుంటే డాక్టరు సలహా తీసుకోవాలి. చిన్న చిన్న సమస్యలున్నప్పుడు అవగాహనతో ముందుకు సాగవచ్చు. 5. ఏ ఏ వయసువారు ఈ డైట్ ను పాఠించవచ్చు ? పిల్లల్ల నుండి ముసలివారివరకు ఎవరైనా దీనిని అనుసరించవచ్చు. 6. ముందు నుండి మందులు వాడుతుంటే ఏం చేయాలి ? మీ సమస్య తగ్గేవరకూ ఎటువంటి ఎంగ్లీషు మందులైనా ఈ డైటుతో పాటు వాడవచ్చు, కానీ హోమియో లేదా ఆయుర్వేదం మందులకు ఈ డైట్ చేసేటప్పుడు దూరంగా ఉండాలి ఎందుకంటే వీటిలో తీపి కలిసి ఉంటుంది. తీపి తగిలితే ఈ డైట్ ప్లాన్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది మరియు ఫలితం రావడం కూడా ఆగిపోవచ్చు. 7.షుగరు ఉన్నవారు ఈ డైటును ఎన్ని రోజులు పాఠించాలి ? దీనితో షుగరు పూర్తిగా తగ్గుతుందా ? ఈ డైట్ లో మొదటి వారంలోనే షుగరు సాధారణ స్థితికి చేరుతుంది, అయినా ఈ డైటును మూడు నెలలు ఖచ్చితంగా పాఠించాలి, అప్పుడే షుగరు పూర్తిగా తగ్గుతుంది, కేవలం కొద్ది Aరోజులు మాత్రమే చేసి వదిలేస్తే ఫలితం ఉండదు. షుగరు సమస్య ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి, మూడు నెలలు ఏ విధంగా పాఠించాలో అలా పాఠిస్తే టైప్’టూ షుగరు పూర్తిగా తగ్గుతుంది. ఇప్పటికే ఈ డైట్ ఆద్వారా షుగరు తగ్గిన ఉదారహరణలు వేలల్లో ఉన్నాయి. 8. ఈ డైట్’ను ప్రారంభించేముందు తెలుసుకోవలసిన విషయాలేమీటి ? ఈ డైట్ గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే ప్రారంభించాలి, అరకొర సమాచారంతో, సరిగా తెలుసుకోకుండా ప్రారంభిస్తే చిన్నపాటి తప్పులు జరిగినా ఈ డైట్ ప్లాన్ అక్కడితో ఆగిపోతుంది. పూర్తి అవగాహనతో అడుగుపెడితే మాత్రం ఫలితాలు చాలా బాగుంటాయి, అది కూడా తక్కువ సమయంలో. గమనిక : ఈ డైట్’లో మీరు మీకు తోచినవిధంగా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, చెప్పింది చెప్పినట్లుగానే చేయాలి. ఈ ఆహార విధానంలో కొన్ని ఖచ్చితంగా తినాల్సినవి, ఐచ్ఛికమైనవి(optional) అనగా మీరు కోరుకున్నట్లుగా తినగలిగినవి మరికొన్ని ఎట్టిపరిస్థితులలోనూ తినడానికి అనుమతిలేనివి ఉన్నాయి. ఈ డైట్’లో ఏవైతే మీకు తినకూడదు అని చెబుతున్నారో అవి ఈ డైట్ అయిన వరకు అని అర్ధం, ఆ తరువాత తినవచ్చు. అయితే ఘుట్కా, సారా తదితరవి ఆప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ హానికరమైనవే. 9. ఇందులో తెలుపబడిన సమస్యలు అందరికీ తగ్గుతాయా లేదంటే ఎవరైనా మినహాయింపు ఉన్నారా ? ఈ డైట్ ను ఎలా పాఠించాలో అలా ఖచ్చితంగా పాఠిస్తే ఒకేసారి లక్ష మంది ఈ డైటును మొదలుపెట్టినా లక్షమందికీ ఈ ఆరోగ్యసమస్యలు తగ్గుతాయి, డైట్ చేస్తున్నవారు తప్పులు చేస్తే ఫలితానికి అంతరాయం కలగవచ్చుగానీ ఈ డైట్ ప్లాన్ లో లోపం ఉండదు. (టైప్ వన్ షుగర్ ఉన్నవారికి ఈ డైట్’తో తగ్గదు, టైప్ టూ షుగర్ నూరు శాతం తగ్గుతుంది) 10. ఈ డైట్’లో షుగర్ సమస్య ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ? షుగర్ సమస్య ఉన్నవారు ఒక విషయంలో జాగ్రత్తగాఉండాలి, అదేమంటే ఈ డైట్ మొదలిపెట్టిన మొదటి లేదా రెండవరోజు షుగర్ లెవెల్ సాధారణ స్థితికి వస్తాయి, మరి కొందరికి మరో రెండు మూడు రోజులు పట్టవచ్చు, షుగర్ సాధారణ స్థితికి చేరిన వెంటనే అనగా నార్మల్ అవ్వగానే షుగర్ మందును వేసుకోవడం ఆపివేయాలి, లేకుంటే షుగర్ డౌన్ అయిపోయి స్పృహ తప్పడం, ఇంకా షుగర్ మందు వాడుకుంటూ వెళ్లిపోతే కోమాలోకి జారుకోవడం జరగవచ్చు. ఇది ప్రమాదం. కాబట్టి మొదటి రోజునుండే ఖచ్చితంగా షుగరు చెక్ చేసుకుంటూ ఉండాలి, తప్పకుండా దాని పరికరం మీవద్ద ఉండి తీరాలి. ఏ రోజు షుగర్ నార్మల్ అయిందో వెంటనే షుగరు మందు మాని తీరాలి. ఒక వేళ షుగరు చాలా తక్కువగా ఉంటే మీరు తీసుకునే మందు కూడా దానికి తగ్గట్టుగానే తక్కువగా తీసుకోవాలి. ఆ తరువాత నార్మల్ అయిపోతే ఆపేయాలి. 11. ఈ డైట్ యొక్క మూల స్థంబాలు (పిల్లర్స్) ఏమిటి ? (1)ఫ్యాట్ (2)నిమ్మకాయలు (3)మంచినీళ్లు (4)మల్టీ విటమిన్ టాబ్లెట్ 1. రోజుకు 70 నుండి 100 గ్రాముల ఫ్యాట్(తెలుపబడిన) తప్పనిసరిగా తీసుకోవాలి. 2. రోజూ 3 నిమ్మకాయలు వినియోగించాలి 3. రోజూ కనీసం 4 లీటర్ల నీరు త్రాగాలి, (నేరుగాకానీ మరో రూపంలో కానీ) 4. రోజుకు ఒక (1) మల్టీ విటమిన్ టాబ్లెట్ వేసుకోవాలి,(లిక్విడ్’డైట్ చేసేవారు 2 తీసుకోవాలి). 12. ఈ డైట్’లో తీసుకోవలసిన ఆహారం ఏమిటి? మరియు దాని మోతాదు ఎంత ? (ఫ్యాట్, నాన్’వెజ్, వెజ్, సూప్స్, నట్స్, సీడ్స్) నాన్’వెజ్ (ప్రోటీన్) : ఎటువంటి నాన్ వెజ్ అయినా ఆడవారైతే రోజుకు 250 గ్రాములు మగవారైతే రోజుకు 300 గ్రాములు మించకుండా తీసుకోవచ్చు. కోడి గుడ్డు, చికెన్, మటన్, బీఫ్, చేపలు, రొయ్యలు, పీతలు, కంజు పిట్టలు వగైరా వగైరా ఏ మాంసాహారమైనా మీకిష్టమైంది తీసుకోవచ్చు. కోడిగుడ్లు : రోజుకు 6 గ్రుడ్ల వరకూ తీసుకోవచ్చు. తీసుకోకపోయినా పరువాలేదు, మీ ఇష్టం. గ్రుడ్డుతీసుకునేటప్పుడు అందులోని పచ్చసొన కూడా తప్పకుండా తీసుకోవాలి. * దిగువ తెలుపబడిన వాటిని కూర లేదా ఫ్రై చేసుకొని కూడా చేసుకొని తినవచ్చు. గమనిక : పనీర్ నూరు శాతం ప్రోటీన్ కోవకు చెందుతుంది, ఇది ఫ్యాట్ కోవకు చెందదు. మాషాలాలు : కూరలు లేదా ఫ్రైలు చేసేటప్పుడుడు ఐదు 5 రకాల మసాలా దినుసులు వాడుకోవచ్చు, అయితే ఖచ్చితంగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవాలి, మాషాలాలు బయట మార్కెట్లో కొనకూడదు. 1. కళ్లుప్పు (సముద్రపు ఉప్పు) 2. కారం (ఎర్ర కారం లేదా మిరియాల పొడి), 3.పసుపు, 4. అల్లం 5. వెల్లులి (అల్లం వెల్లుల్లి పేస్టు) వీటితో పాటు దనియాలు, లవంగాలు, దాసించక్కలు కూడా తీసుకోవచ్చు. మాషాలాలన్నీ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నాన్’వెజ్ వండే పద్ధతి : ఈ మసాలాలన్నింటిని నాన్’వెజ్ లో కలిపి రెండుగంటలపాటు డీప్ ఫ్రిజ్ లో పెడితే మంచిది, దానివల్ల మాంసపు ముక్కలు ఈ మాషాలాల సారం పీల్చుకుంటాయి. తద్వారా రుచి బాగా ఉంటుంది. గమనిక : కూరల్లో గానీ, ఫ్రైలలో గానీ మరెవిధంగా కానీ రంగులు అస్సలు కలపకూడదు, అలాగే కార్న్’ఫ్లోర్(మొక్కజొన్న పిండి) కూడా కలపకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ మీకు బయట తినవలసివస్తే ఈ నాలుగు రకాల నాన్ వెజ్ మాత్రమే తినే అనుమతి ఉంది. (1) చికెన్ తందూరి, (2) చికెన్ టిక్క, (3) చికెన్ కబాబ్, (4) గ్రిల్ చికెన్. గమనిక : దిగువ తెలిపిన ఈ 4 రకాలలో రంగు గానీ అజినమోటో గానీ ఏ మాత్రం కలిపి ఉండకూడదు. నోట్ : అజినమోటో (టేస్టింగ్’సాల్ట్)ను అస్సలు ముట్ట కూడదు. ఈ డైట్ లోనే కాదు ఎప్పుడూ వినియోగించకూడదు, ఇది ప్రమాదకరమైనది, క్యాన్సర్ కారకమైనది. దురదృష్టం ఏమిటంటే ఏ రోజూ తోపుడు బండ్ల నుంచి దాదాపు అన్నీ హోటళ్ళలో ఈ అజినమోటోను టేస్ట్ కోసం వినియోగిస్తున్నారు. టాటా హోతాళ్లలో దీనిని వినియోగించకపోవడం మా దృష్టికి వచ్చింది, అవసరం వచ్చినప్పుడు ఇలాంటి నమ్మకమైన హోటళ్లను మాత్రమే ఎన్నుకోవాలి. అయినంతమేరా స్వయంగా తయారుచేసుకోవాలి, ప్రయాణాలలో కూడా మనం తయారు చేసుకున్నదే తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి. ఫ్యాట్ ఈ డైట్’లో ఫ్యాట్ చాలా కీలకమైనది, దీనిని ఖచ్చితంగా తీసుకొని తీరాలి. ఫ్యాట్ అనగానే మన మనస్సు ఆనిమల్ ఫ్యాట్ వగైరా వైపు వెళుతుంది. కానీ ఈ డైట్’లో ఫ్యాట్’ను ఉద్దేశించినవి ఇవి మాత్రమే. (1) కొబ్బరి నూనె (2) ఆలివ్ నూనె (3) వెన్నపూస (4) నెయ్యి (5) పెరుగు మీద మీగడ. (6) బటర్ : అమూల్ లేదా విజయ్ కంపెనీల బటర్. వీటిని నేరుగా గానీ, వంటలో గానీ, వెజ్ లేదా నాన్ వెజ్ సూప్’లో గానీ కలుపుకొని తీసుకోవచ్చు, ఫ్యాట్ కరగాడిని ఫ్యాట్ తప్పనిసరిగా తీసుకోవాలి. గమనిక : ఆలివ్ ఆయిల్’తో వంట చేయకూడదు, దీనిని పచ్చిగానే తీసుకోవాలి. అనగా తినేటప్పుడు అన్నంలోగానీ, సలాడ్స్’లో గానీ లేదా నేరుగా గానీ తీసుకోవాలి, దీనిని వేడి చేయకూడదు, అలా చేస్తే దీనిలోని పోషక విలువలు చాలా వరకు నశించిపోతాయి. దిగువ తెలుపబడిన ఈ ఫ్యాట్ రకాలను ఒకదానితో ఒకటి అస్సలు కలపకూడదు, దేనికి దానికే విడిగా తూచుకోవాలి. గమనిక : పాల మీద మీగడ వినియోగించకూడదు, ఇది మన ఫ్యాట్ కోవకు చెందదు. గమనిక : ఈ ఫ్యాట్’లను “భారం” తూచి అనగా గ్రాములలో తీసుకోవాలి, మిల్లీగ్రాముల రూపంలో కొలిచి తీసుకోకూడదు. మొదటి 10 రోజులు 70 నుండి 100 గ్రాముల ఫ్యాట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తరువాత 30 గ్రాములకు తగ్గించవచ్చు. ఎంత తగ్గించాలనేది మీ శరీర తత్వం పై ఆధారపడి ఉంటుంది, ఉదాహరణకు : పది రోజుల తరువాత మీరు 30 గ్రాముల ఫ్యాట్ తీసుకున్నప్పుడు నీరసం అనిపిస్తే మరో పది 10 గ్రాములు పెంచుకోండి, ఇంకా నీరసంగానే అనిపిస్తుంటే మరో పది 10 గ్రాములు పెంచుకోండి, అప్పుడు నార్మల్ అయిపోతే దానినే కొనసాగించండి. అంటే ఈ పరిమాణం మీ శరీరతత్వానికి సరిపోతుంది అని అర్ధం, అనగా నీరసం రాకపోవడమే దీనికి “ప్రమాణం” (parameter). ఈ డైట్’లో నీరసం రానివ్వకండి. 13. ఈ ఫ్యాట్’ను తీసుకునే విధానం ఏమిటి ? రోజుకు డెబ్బై (70) నుండి వంద (100) గ్రాముల వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. తూకంలో కొలిచి మరీ తీసుకోవాలి. దీని కోసం చిన్న ఎలక్ట్రానిక్ తూకం కొనుక్కుంటే మంచిది. బరువు చూసేటప్పుడు తూకం పై పెట్టే గిన్ని భారం ముందే తెలుసుకొని దాని ప్రకారంగా తూచుకోవాలి. 70 నుండి 100 గ్రాములు వినియోగించాలి అంటే మీ నోటిలోకి వెళ్ళేది అని అర్ధం, వంట పాత్రలో వేసింది కాదు, ఎందుకంటే వండిన తరువాత కొన్ని గ్రాముల నూనె పాత్రకే అంటుకుని ఉంటుంది, మరియు కొంత వండేటప్పుడు కాలి ఆవిరైపోతుంది అలాగే వండిన పదార్దాన్ని ప్లేటులో వేస్తే దానికి కొంత అంటుకుంటుంది, ఈ విధంగా అనుకున్నంత మన కడుపులో వెళ్ళదు. ఉదా : పాత్రలో 20 గ్రాముల నూనె వేసి ఆమ్లెట్ వగైరా చేస్తే ఆ వంట అయిన తరువాత ఆ పాత్రకు 10 గ్రాముల వరకూ అంటుకుని ఉంటుంది. మనం ఆ పాత్ర నుండి తీసి దానిని ఒక ప్లేటులో వేసుకుంటాము, ఇలా ప్లేటుకు మరో మూడు, నాలుగు గ్రాములు అంటుకుని ఉంటుంది. చివరికి నోట్లోకి వెళ్ళేది 6 నుండి 7 గ్రాములు మాత్రమే. దీనివల్ల నష్టం జరుగుతుంది, తగిన ప్రతిఫలం రాదు. ఈ ఫ్యాట్ వినియోగంలో తప్పులు చేసి చాలామంది నష్టపోతున్నారు. దీనికి పరిష్కారం : 60 గ్రాములు నేరుగా తీసుకుని మిగితాది వంటలో వినియోగించాలి. గమనిక : ఈ డైట్’లో తెలుపబడిన పరిమాణం విషయంలో జాగ్రత్త వహించాలి. తగ్గకూడదు మరియు పెరుగకూడదు. గమనిక : ఫ్యాట్ అంటే దిగువ చూపబడినవి మాత్రమే, వీటినే వినియోగించాలి, ఇతరవేమీ వినియోగించకూడదు. ఈ డైట్’లో దిగువ తెలుపబడిన ఫ్యాట్ రకాలలో కొబ్బరి నూనె అత్యంత ఉత్తమమైనది, అయినంతవరకూ కొబ్బరి నూనెనే వాడడానికి ప్రయత్నించండి. ఇందులో ఉన్న లారిక్ యాసిడ్ మీకు చాలా ఉపయుక్తమైనది. ఈ డైట్’లో కొబ్బరినూనెకు నూటికి నూరు మార్కులు పడితే మిగితా వాటికి నూటికి నలభై మార్కు పడతాయి. నోట్ : నెయ్యిని పెరుగుద్వారా తీస్తారనే విషయం మనందరికీ తెలుసు, కానీ ఫ్యాక్టరీలలో పాలద్వారా నేరుగా నెయ్యిని తీసున్నారు. ఈ డైట్ కోసం ఈ రెండూ వాడవచ్చు, కానీ పెరుగుద్వారా తీసిన నెయ్యి వినియోగించడం ఉత్తమం. కూరగాయలు : కేవలం నాన్వెజ్ మీద మాత్రమే ఆధారపడకూడదు, కూరగాయలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి, లేకుంటే పీచుపదార్ధాలు అందకపోవడం వల్ల మలబద్దక సమస్య ఉత్పన్నమవుతుంది. కూరగాయలలో తినకూడనివి అనగా నిషిద్దమైనవి తప్ప అన్నీ తినవచ్చు. నిషిద్దమైనవి, తినకూడనివి : 8 రకాలు ఇందులో 5 దుంపలు మరియు 3 కూరగాయలు పూర్తిగా నిషిద్దం. దుంపలు : (1) బంగాళదుంప (2) చిలగడదుంప (3) చామదుంప (4) కంద (5) పెండలం కూరగాయలు : (1)బీట్ రూట్ (2) పచ్చి అరటి (కూర అరటి) (3) అన్ని రకాల బీన్స్ అనగా బటానీ, నాటు చిక్కుడు, అలసంద వగైరా. పాక్షికంగా తీసుకోవడానికి అనుమతి ఉన్నవి పాక్షికంగా (కొంత మాత్రమే) తీసుకునే అనుమతి ఉన్న కూరగాయలు 3 రకాలు. (1) క్యారెట్ (రోజుకు ఒకటి) (2) టమాటా(పెద్దదుంటే ఒకటి, చిన్నవుంటే రెండు) (3) ఉల్లిపాయ (సగం లేదా ఒకటి ) గమనిక : ముల్లంగి ఎంతైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఇది మంచిది కూడా. ఆకుకూరలు : అన్ని రకాల ఆకుకూరాలూ తీసుకోవచ్చు. సలాడ్స్ : నిషేదిత జాబితాలో లేని వాటిలో సలాడ్స్ చేసుకుని ఆకలిని బట్టి ఎంతైనా తినవచ్చు. గమనిక : ఆకు కూరాలలో అత్యున్నతమైనది, అద్భుత మైనది ఈ డైట్’లో మరియు ఎల్లప్పుడూ అధికంగా ఉపయోగించవలసినది “మునగాకు”. ములక్కాయ కన్నా మునగాకులో అద్భుతమైన లాభాలున్నాయి. కాబట్టీ మీ కూరగాయలలో మునగ ఆకుకు శాస్వతస్థానం ఇవ్వండి. గమనిక : ఈ కూరగాయలతో చేసిన పచ్చళ్లను కూడా తీసుకోవచ్చు. సాధారణ పచ్చళ్లు కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్ సూప్ చేసుకొని ఆకలిమేరా ఎంతైనా తీసుకోవచ్చు. * సాధారణ లేదా లిక్విడ్ డైట్ లో సొరకాయ జూసు కూడా త్రాగవచ్చు. వెజ్ సూప్ చేసుకొనే విధానం : నాలుగైదు రకాల కూరగాయలు (కిలో, కిలోన్నర వరకు) తీసుకుని కోసుకున్న తరువాత కుక్కర్’లో అరలీటరు నీళ్ళు వేసి 7 నుండి 8 విజిల్స్ వచ్చేవరకు ఉంచి దించేయాలి,తర్వాత ఆ కూరగాయలను కొద్దిగా మాత్రమే పిండి మిగిలిన గుజ్జును పారేయాలి. గమనిక : మిగిలిన గుజ్జు(pulp)ను అస్సలు తీసుకోకూడదు, ఖచ్చితంగా దానిని పారవేయాలి. గమనిక : ఈ సూప్స్ కేవలం ఇంట్లోనే తయారు చేసుకోవాలి, బయట కోరికే సూప్స్ తాగకూడదు, అలాగే రెడీమేడ్ సూప్ పౌడర్లు కూడా ఉపయోగించకూడదు. గమనిక : కేవలం టమాటా సూప్ లేదా కేవలం క్యారెట్ సూప్ చేసుకోకూడదు, నిషిద్దం. ఈ రెండూ రోజుకు ఒక్కొక్కటి మాత్రమే తీసుకోవాలనే విషయం మీకు చెప్పిఉన్నాము. గమనిక : కొబ్బరి నీళ్ళు అస్సలు ముట్టకూడదు, అలాగే లేత కొబ్బరి కూడా తినకూడదు, అయితే ముదురు కొబ్బరి లేదా ఎండు కొబ్బరి రోజుకు అరచిప్పవరకు తినవచ్చు. నట్స్ తీసుకోవడం : మూడు (3) రకాల నట్స్ తీసుకోవచ్చు. 1. బాదం పప్పు : రోజుకు పది 10 దాకా తీసుకోవచ్చు, మీ ఇష్టం. తప్పనిసరి కాదు కానీ తీసుకోవడం ఉత్తమం అయితే రాత్రి నానబెట్టి ఒలిచి తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. 2. పిస్తా : సాధారణమైన పిస్తా లేదా సాల్టెడ్ పిస్తా ఏదైనా తీసుకోవచ్చు. (1-10) 3. వాల్ నట్(ఆక్రోట్): ఇది నట్స్ అన్నిటిలో ఉత్తమమైనది, దీనిని మదర్ ఆఫ్ ఆల్ నట్స్ అని కూడా అంటారు. కీళ్ల నొప్పులు, మెడనొప్పులు, స్పాందలైటీస్ వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవడం ఉత్తమం. ఈ సమస్య ఉన్నవారు రోజుకు 15 దాకా తీసుకోవచ్చు. (0-15). ఇందులో ఒమేగా ఫ్యాట్ ఆయిల్ ఉంటుంది, వీటిని నానపెట్టుకొని లేదా నేరుగా తినవచ్చు వలచాల్సిన అవసరం లేదు. గమనిక : ఈ మూడు నట్స్ తప్ప ఇతర ఏ నట్స్ తీసుకోకూడదు. ఈ నట్స్’ను వేటికి అవే విడిగా తినండి, కలిపి తినవద్దు. ఉదాహరణకు : బాదం కొన్ని, పిస్తా కొన్ని కలిపి తినడం చేయకూడదు. గింజలు 1.గుమ్మడి గింజలు ( రోజుకు 5 నుండి 6 స్పూన్లు) 2. ప్రొద్దు తిరుగుడు గింజలు 3.పుచ్చ గింజలు లేదా అవిసె గింజలు(flex seeds) మరియు తెల్ల నువ్వులు సమ పాళ్లలో కలిపి నేతిలో వేయించి మిక్సీలో మీడియంగా వేసి రోజుకు 5 నుండి 6 స్పూన్లు తీసుకోవచ్చు(0-6). నోట్ : దిగువ తెలిపిన గింజలన్నీ 5 నుండి 6 స్పూన్లు తీసుకోవచ్చు. ఈ నట్స్ మరియు గింజలు తీసుకోవడం మంచిది, దీనివల్ల మీకు మంచి శక్తి లభిస్తుంటుంది, నీరసం దరిచేరదు. చురుకుగా ఉంటారు. ఈ డైట్ ప్రోగ్రాములో ఎక్కడా మీరు నీరసంగా ఉండరు. సాధారణంగా, శక్తివంతంగా ఉంటారు. ఏ మాత్రం నీరసం అనిపించినా మీకు అనుమతి ఉన్నవాటిలో వెంటనే కొంత తినడం లేదా త్రాగడం చేయాలి, నీరసం రానివ్వకూడదు. అన్నీ సరిగా పాఠిస్తే మీలో ఇదివరకటికన్నా అధిక శక్తి అనుభూతిని పొందుతారు, స్టామినా లెవెల్స్ పెరుగుతాయి, హుషారుగా ఉంటారు. ద్రవ పదార్ధాలు : సూప్స్ : నిషిద్ధం లేని కూరగాయలు మరియు ఆకు కూరాలతో చేసిన సూప్ మీ ఆకలి మేరా తీసుకోవచ్చు. కూరగాయల సూప్ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాము. నాన్’వెజ్ సూప్ : గమనిక : మేము తెలిపిన విధంగానే మటన్’సూప్ తయారు చేయాలి, ఎవరికి తోచిన విధంగా వారు చేయకూడదు. నాన్’వెజ్ సూప్ చేసే విధానం : ఒక కిలో బొన్స్ తీసుకుని కుక్కర్ లో రెండు లీటర్ల నీరు పోసి 12 విసిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఆ తరువాత ఆ ముక్కలను దాని నీళ్ళతో సహా వేరే పెద్ద పాత్రలోకి మార్చి అందులో మరో 4 లీటర్ల నీరు కలిపి పొయ్యిని సిమ్’లో ఉంచి 7 గంటల పాటు మెల్లిగా మరగనివ్వాలి, అప్పుడే దానిలోని ఎసెన్స్ పూర్తిగా బయటకు వస్తుంది, పాత్ర యొక్క మూతను కొద్దిగా తెరచి ఉంచాలి. ఇలా ఆరున్నర (6 1⁄2) గంటలు అయిన తరువాత ఇందులో కొన్ని కూరగాయలు కలుపుకోవాలి, తర్వాత మరో అర గంట నుండి నిలభై ఐదు నిమిషాల వరకు పొయ్యి మీద ఉంచి దించేయాలి. అలా వచ్చిన సూప్’ను ఫ్రీజ్’లో ఉంచుకుని వినియోగించుకోవాలి, ఇది చిక్కగా ఒక జెల్ లాగా తయారవుతుంది, దీనిని కొద్ది కొద్దిగా నేరుగా లేదా ఫ్యాట్ వగైరాతో కలిపి తీసుకోవచ్చు. గమనిక : ఇలా ఉండికించిన తరువాత మిగిలిన గుజ్జు (పల్ప్) ను అస్సలు వినియోగించకూడదు, పారవేయాలి. 14. ఈ డైట్’లో తెలుప బడిన పదార్ధాలు ఏ ఏ సమయాలలో ఎంత తీసుకోవాలి ? రోజువారీ పరిమితి కల ఆహారంలో మీకు ఎప్పుడు ఆకలివేస్తే అప్పుడు ఆకలి తీరే వరకు తినవచ్చు, కానీ కడుపునిండా తినకూడదు. ఈ డైట్’కు ప్రత్యేక సమయం ఉండదు, ఎప్పుడు మీకు ఆకలి వేస్తే అదే మీ సమయం, అది అర్ధరాత్రి అయినా పరువాలేదు, రాత్రి నిద్రమధ్యలో లేచి తిన్నా పరువాలేదు. గమనిక : సాధారణ జీవితంలో కూడా “భోజనసమయం” అయిందికదా అని తినకూడదు, ఆకలి వేసినప్పుడే తినాలి, అది ఏ సమయం అయినా పరువాలేదు. గమనిక : పాలు అస్సలు త్రాగకూడదు అలాగే పాలమీద మీగడ కూడా తీసుకో కూడదు. గమనిక : సొర, బీర, పాలకూర వండేటప్పుడు మాత్రం కుంచెం పాలు వేసుకోవచ్చు, అయితే మరీ ఎక్కువ కాదు. గమనిక : కూర వండేటప్పుడు అందులో పాల మీద మీగడ కొంత వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేయకూడదు. నోట్ : పాల మీద మీగడ మన 70 గ్రాముల ఫ్యాట్ కోవకు చెందినది కాదు, ఫ్యాట్’గా దీనిని వినియోగించకూడదు. మినరల్ వాటర్ మరియు సోడా త్రాగవచ్చు, సోడాలో నిమ్మకాయ వేసి త్రాగవచ్చు, (ఉప్పు అస్సలు వేయకూడదు) నిషిద్ధం : అన్నిరకాల సాఫ్ట్ డ్రింక్స్ నిషిద్ధం, డైట్’కోక్ వంటివి కూడా ముట్టకూడదు. నిషిద్దం : పాన్, కిల్లీ, ఘుట్కా, వక్కపొడి, సిగరెట్టు, సారా పూర్తిగా నిషిద్దం. వీటితో ప్రోగ్రామ్ నడవదు, ప్రతిఫలం రాదు. ఇవి ఈ ప్రోగ్రామ్’కు చాలా నష్టం కలిగిస్తాయి, ప్రతిఫలం రాదు. నిషిద్దం : చూయింగ్ గమ్ కూడా నమలకూడదు. నిషిద్దం : పెరుగు పూర్తిగా నిషిద్ధం. గమనిక : ఒక “లీటరు” నీళ్ళలో కేవలం “రెండు చెంచాలు” మాత్రమే పెరుగు వేసి, అందులో నిమ్మకాయ పిండి పిండుకోవచ్చు, ఇది పేరుకుమాత్రమే మజ్జిగ, లీటరు నీళ్ళకు కేవలం రెండు చెంచాల పెరుగు మాత్రమే వేసుకోవాలి అంటే దీని పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నిమ్మకాయను తేలికగా తీసుకోవడానికి ఇలా చేస్తారు తప్పిస్తే మజ్జిగ చేయడం ఉద్దేశం కాదు. ఇలా చేసిన మజ్జిగలో రుచికోసం అల్లం, కొత్తిమీర, పచ్చి మిర్చి, కరివేపాకు, పోదీనా కూడా వేసుకోని త్రాగవచ్చు. నిషిద్దం : ఇలా చేసిన మజ్జిగలో అస్సలు ఉప్పు కలపరాదు, అది ఏ ఉప్పైనా సరే పూర్తిగా నిషేదం. కళ్ళుప్పు కూడా వేయకూడదు. నోట్ : సాధారణంగా కూడా మనం మజ్జిగలో ఉప్పు కలపకూడదు, ఇది బొజ్జ పెరగడానికి బాగా దోహదం చేస్తుంది. ఉప్పు నీటిని పట్టి ఉంచుతుంది. 15. టీ మరియు కాఫీలు తీసుకోవచ్చా ? పంచదార, ఎటువంటి తీపి కలపకుండా కాఫీ, టీలు తీసుకోవచ్చు, అలాగే గ్రీన్ టీ, లెమన్ టీ కూడా ఇదే విధంగా తీసుకోవచ్చు. బుల్లెట్’ప్రూఫ్ కాఫీ చేసుకోవచ్చు, ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. 16. ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీను ఎలా చేయాలి ? ఇది చాలా తేలిక, కాఫీని మరిగించిన తరువాత అందులో ఫ్యాట్ కలుపుకొని బాగా గిలక్కొట్టి త్రాగాలి, యూరోప్, అమెరికాలలో దీనిని విరివిగా వినియోగిస్తారు, వేడి కాఫీలో బటర్ వేసి మిషీన్ ద్వారా బాగా కలుపుతారు. 17. మార్బిడ్ ఒబేసిటీ అంటే ఏమిటి ? విపరీతంగా లావు ఉంటే దానిని మార్బిడ్ ఒబేసిటీ అంటారు, ఇటువంటి వారు తప్పనిసరిగా లిక్విడ్ డైట్ చేయాలి. బాగా లావున్నవారు లిక్విడ్ డైట్ తోనే మొదలు పెట్టాలి. ఇలాంటివారిలో శరీర లావును బట్టి ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి,సాధారణ వ్యక్తులు కూడా ఈ లిక్విడ్ డైటును చేయవచ్చు, నష్టం లేదు. 18. లిక్విడ్ డైట్ చేసే విధానం ఏమిటి ? ఈ డైటులో ఎటువంటి ఘనపదార్ధాలను తీసుకోకూడదు, ఈ డైట్ యొక్క నాలుగు పిల్లర్స్’ను ఖచ్చితంగా పాఠించాలి. గమనిక : ఈ డైట్ చేసేవాటు రెండు 2 మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి, ఒకటి సరిపోదు. ప్రొద్దున్నే ప్రత్యేకంగా చేసిన మటన్ సూప్’లో కొంత ఫ్యాట్ కలుపుకొని త్రాగాలి, ఆ తరువాత ఒక గంటా గంటన్నరకు ఆకలేస్తుంది. అప్పుడు మళ్ళీ అల్లాగే మటన్ లేదా వెజ్ సూప్ లో ఫ్యాట్ కలుపుకుని త్రాగాలి, ఇలా రోజుకు ఏడు ఎనిమిది సార్లు చేస్తే సరిపోతుంది. తీపి లేకుండా కాఫీ, టీ, గ్రీన్ టీ , లెమన్ టీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవచ్చు, గమనిక : నీరసం, డల్ నెస్ రాకుండా చూసుకోవాలి, ఆకలిని బట్టి ఎప్పటికప్పుడు ఈ లిక్విడ్స్ త్రాగుతూ ఉండాలి. ఫ్యాట్ తీసుకునేటప్పుడు కొబ్బరి నూనెను ఒకేసారి నేరుగా తీసుకోకొండా ఉంటే ఉత్తమం, ఎందుకంటే దీనివల్ల కడుపులో గడబిడగా ఉంటుంది, అందుకని కుంచెం కుంచెం తీసుకుంటూ వెళ్ళండి, వేడి నీళ్ళలోగానీ, సూపులో గానీ కుంచెం, కుంచెం కలిపి తీసుకుంటే తేలికగా ఉంటుంది. 19. లిక్విడ్ డైట్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ? దీనిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, దీనిని ఎన్ని రోజులైనా చేయవచ్చు, అయితే మొదటి రెండు మూడు రోజులు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, ఆ తరువాత సాధారణంగానే ఉంటుంది. కొద్ది రోజుల తరువాత అంతగా ఆకలి వేస్తుండదు మరియు మీరు శక్తివంతంగా కూడా ఉంటారు. సాధారణంగా మన శరీరం ప్రస్తుతం ఉన్న స్థితి యొక్క మార్పుకు అంతగా ఇష్టపడదు, అది మంచైనా సరే, చెడైనా సరే. ప్రస్తుతం ఉన్న స్థితిలోనే ఉండాలనుకుంటుంది, మార్పును కోరుకోదు. 20. ఈ లిక్విడ్ డైట్ ఎన్ని రోజులు చేయాలి ? ఈ లిక్విడ్ డైట్’ను మీ సమస్య పరిష్కారమయ్యే వరకూ ఎన్ని రోజులైనా చేయవచ్చు లిక్విడ్ డైట్’ను రెండు విధాలుగా చేయవచ్చు 1. కేవలం ద్రవ పదార్ధాలతోనే నెల రోజుల వరకూ కొనసాగిస్తూ వెళ్లవచ్చు, ఈ సమయంలో వెయిట్ తొందరగా తగ్గుతూ వెళుతుంది, మీలో తేలికదనం కూడా ఫీల్ అవుతారు. 2. లేదంటే ఒక ఐదు రోజులు ఈ లిక్విడ్ డైట్ చేసి ఆ తరువాత మరో నాలుగు ఐదు రోజులు సాధారణ అనగా ఘన, ద్రవ పదార్ధాలు తీసుకుంటూ చేసే సాధారణ డైట్ ను అనుసరించాలి, అనగా మీ ఇష్టాన్ని బట్టి వన్ మీల్ లేదా టూ మీల్’కు మారవచ్చు. ఇలా నాలుగైదు రోజులు చేసిన తరువాత మళ్ళీ లిక్విడ్ డైట్’కు మారి ఐదు రోజులు చేయాలి, తర్వాత మళ్ళీ సాధారణ డైట్ కు మారాలి. ఈ విధంగా మీ సమస్య పరిష్కారమయ్యేవరకూ చేసుకుంటూ వెళ్ళాలి. * లిక్విడ్ డైట్ చేసేటప్పుడు కూడా ఏదైనా పండు యొక్క చిన్న ముక్క కూడా కొరకకూడదు, నిషేదం ఉన్నవి అస్సలు ముట్టకూడదు. గమనిక : వెయిట్ తగ్గేటప్పుడు ఇతరులతో పోల్చుకోకూడదు, ఎక్కువ వెయిట్ ఉన్నవారు ఎక్కువ తగ్గుతారు, తక్కువ వెయిట్ ఉన్నవారు తక్కువగా తగ్గుతారు. అలాగే వారి వారి శరీర తత్వాలను బట్టి కూడా ఉంటుంది. ముఖ్య గమనిక : ఈ లిక్విడ్ డైట్ నుండి పూర్తిగా బయటకు వచ్చేటప్పుడు అనగా పూర్తిగా ఆపేయడానికి వెళుతున్నప్పుడు ఆకస్మికంగా, ఒక్కసారిగా బయటకు రాకూడదు. ఈ రోజు మీరు బయటకు రావాలనుకుంటుంటే ముందు కొన్ని నట్స్ తీసుకోండి, ఆ తరువాత ఒక గంట గంటన్నర తరువాత మీకు నచ్చిన ఒక వెజిటేబుల్ కర్రీ తినండి, ఆ తరువాత గంటన్నర రెండు గంటల తరువాత ఏమైనా నాన్ వెజ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. * అంతేగానీ మాంసాహారం లేదా కోడిగుడ్డు ద్వారా ఈ డైట్ నుండి బయటకు రాకూడదు. గమనిక : మీ సమస్య పరిష్కారం అయిన తరువాత అనగా ఈ డైట్ ముగిసిన తరువాత ఇది వరకటి లాగే ఇష్టమొచ్చినట్టు తినకూడదు, ఆకలి వేసినప్పుడే తినాలి, ఆకలితీరిన తరువాత ఆపేయాలి ఆకలి తీరినా కూడా కడుపునిండా లాగించడానికి ప్రయత్నించకూడదు. ఈ అలవాటు జీవితాంతం ఉంటే మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. 21. షుగరు సమస్య ఉన్నవారు తమకు తెలియకుండానే షుగరు తింటుంటారు. అది ఎలాగా ? షుగరుతో బాధపడే వారు పంచదార మరియు ఇతర తీపి పదార్ధాల నుండి దూరంగా ఉంటారు, కానీ వారికి తెలీకుండానే ప్రతిరోజూ షుగర్ తింటూ ఉంటారు, అనగా తెల్లన్నం తినడం, ఈ తెల్లన్నం నేరుగా షుగరు రూపంలో మార్పు చెందుతుంది. గమనిక : తెల్లన్నం మరియు రీఫైన్ద్ ఆయిల్ మీ జీవితంలోనుండి పూర్తిగా తీసేయండి, బియ్యాన్ని వాడాలనుకుంటే పాలిష్ చేయని అనగా ముడి బియ్యం వాడండి. అలాగే అన్నం కన్నా కూరలు ఎక్కువగా తినండి, వరిఅన్నానికి సింహభాగం ఇవ్వకండి. 22. వీరమాచినేని వారు చెప్పినట్టుగా విచ్చలివిడిగా తినడం అంటే ఏమిటి ? బయట కడుపునిండా భోజనం చేశాము, ఆతరువాత స్వీట్ కూడా తిన్నాము, అంతలోనే ఐస్ క్రీమ్ వచ్చింది అదీ తిన్నాము, అంతలోనే బయటకు వెళితే టీ తాగుదామని ఒకరు బలవంతం చేశారు, అదీ తాగాము. ఇంటికెళ్తే భార్య పకోడీలు చేసి ఉంది తినాల్సిందే అని పట్టు పట్టింది, అదీ తిన్నాము మరో టీ కూడా వచ్చింది, అదీ తాగాము. కొద్దిసేపటికి రాత్రి అయిపోయింది, భార్య భోజనం సిద్ధం చేసింది, వద్దంటే అది మిగిలిపోతే ఎవరు తింటారని కసురుకుంది తప్పదని అదీ తిన్నాము, ఆ తరువాత ఉదయం లేచిన తరువాత రాత్రి వరకూ తిన్నది అరగలేదు, అంతలోనే మళ్ళీ టిఫిన్ రెడీ. ఇలా ఒకదాని తరువాత ఒకటి అరగక ముందే మరొకటి తినేస్తూ వెళ్లిపోతూ, మొహమాతా లతోనో, రుచిని ఆస్వాదించడమే పరమార్ధంగానో ఇష్టమొచ్చినట్టుగా తింటే మీరు తిన్న మీ ఆహారమే మీకు నష్టం కలిగిస్తుంది. ఇలా తినడాన్నే విచ్చలవిడితనం అంటారు. తీరూతెన్నూ లేని ఇలాంటి తిండితోనే షుగరు, బీపీ మరియు ఇతర ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి, ఇది చాలా ప్రమాదము. ఆకలి వేసినప్పుడే తినాలి గానీ భోజన సమయం అయిందని తినకూడదు. ఆకలి వేసిన సమయమే మీ మీ భోజన సమయం. 23. ఈ డైట్ లో ఆకలి తీరు ఎలాఉంటుంది ? ఈ డైట్ లో ఘన, ద్రవ పదార్దాలను కలిపి తీసుకోవడం ఒక విధానం మరియు కేవలం లిక్విడ్ డైట్ తీసుకోవడం రెండవవిధానం. మొదటి పది రోజుల తరువాత ఫ్యాట్ 30 గ్రాములకు తగ్గిస్తాం మరియు అదేసమయంలో లేదా దానికి ముందే రెండుపూటల తినడం మానేసి ఒకపూటే తింటూ ఉంటాము. లిక్విడ్ డైట్ లో ఘనపదార్ధాలు అసలేమాత్రం తీసుకోమనే విషయం తెలుసు. అయితే ఈ రెండు విధానాలలోనూ మీకు ఆకలి బాగా తగ్గిపోతుంది మరియు నీరసం కూడా ఉండదు. 24. విజయవంతంగా ఈ డైట్ ముగించిన తరువాత పోయిన సమస్యలు మళ్ళీ పునరావృతమవుతాయా ? ఇదివరకటిలాగే విచ్చలివిడిగా తినడం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆరోగ్యానికి హాని కలిగిచేవి తినడం, త్రాగడం చేస్తే గత సమస్యలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలున్నాయి. 25. ఈ డైట్ శాస్త్రియంగా నిరూపితమై ఉందా ? దీనిపై ఏమైనా విమర్శలున్నాయా ? శాస్త్రీయత ఉంది అని ఇప్పటికే కొంత మండి డాక్టర్లు చెప్పారు, ఈ మంచి ఫలితం ఏ విధంగా వస్తున్నది అనేదానిపై పరిశోధన నడుస్తున్నది, ఒక శాస్త్రీయ ప్రక్రియ లేనిదే ఇటువంటి ఫలితాలు రావు, వేలకువేల మంది పొందుతున్న సద్ఫలితాలే ఇందుకు నిదర్శనం. సద్ఫలితాలు పక్కనపెట్టి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసేవారు చాలా విషయాలపై విమర్శలు చేస్తుంటారు. హోమియోపతి గురించి మనందరికీ తెలుసు, ఎంతో కాలంగా చాలా మంది ఇందులో సద్ఫలితాల్ని పొందుతున్నారు, కానీ దీనికి శాస్త్రీయత లేదని చెప్పేవారు చాలా మంది ఉన్నారు, అమెరికా, యూరోప్’లో కూడా ఇది ఆశాస్త్రియమని చెప్పేవారు వేలల్లో ఉన్నారు. కానీ వచ్చేవారికి సద్ఫలితాలు వస్తూనే ఉన్నాయి, రానివారికి రావడంలేదు. ప్రస్తుతం షుగరు వ్యాది కోసం డాక్టర్లందరూ చేసే వైద్యానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి, మరి అవి ఇలాంటి ఫలితానిస్తున్నాయా ? 26.కీటో డైట్ అంటే ఏమిటి ? వీరమాచినేని గారి డైట్ కూడా ఇలాంటిదేనా ? కొంత మంది కీటో డైట్ ఇదీ రెండూ ఒకటే అని అనుకుంటుంటారు, ఈ రెండింటిలో సారూప్యత చాలా తక్కువ, పైగా కీటో డైట్ లో దీర్ఘకాలంలో కొంత వెయిట్ తగ్గిన తరువాత మళ్ళీ పెరగడం ఉంటుంది, కొన్ని సందర్భాలలో ఇదివరకి ఉన్నవాటికన్నా ఎక్కువ వెయిట్ పెరిగిన కేసులూ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ కీటో డైట్’కు చాలా భిన్నమైనది, దీని మూలాలు కీటో డైట్ నుండి రాలేదు. 27.అసలు ఈ డైట్ ప్రోగ్రామ్ ఎలా మొదలైంది ? మనదగ్గరే ఎందుకని ఎక్కువగా ప్రచారం మరియు చర్చలు జరుగుతున్నాయి ? కెనడాకు చెందినా నెఫ్రాలజిస్ట్ డా.జేసిన్ గారు చేసినా ప్రయోగాల ద్వారా మౌలికంగా దీనికి పునాది దొరికింది, ఈ కాన్సెప్ట్ ఆధారంగా వీరమాచినేని గారు స్వయంగా చాలాకాలం పలు ప్రయోగాలతో ఈ విధానాన్ని అభివృద్ది చేశారు, స్వయంగా వీరు మరియు వీరి స్నేహితులు అధికభారం, షుగరు వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్న సమయంలో పలు ప్రయోగాలు చేసి సత్ఫలితాలు పొందారు, తరువాత ఇప్పుడు దీనిని ఇతరులతో పంచుకుంటున్నారు, అదృష్టవశాత్తు వీరమాచినేని గారు తెలుగు రాష్ట్రానికి చెందినవారు కాబట్టీ తెలుగు వారికి దీని ప్రయోజనం ముందుగా దొరుకుతున్నది సహజంగానే ఇక్కడ ప్రచారం మరియు చర్చలు జరుగుతున్నాయి. 28. టైప్ వన్ షుగర్ సమస్యకు ఇది ఎందుకని పని చేయదు ? టైప్ టూ షుగర్ కు మాత్రమే ఎందుకు పని చేస్తుంది ? టైప్ వన్ షుగర్ అంటే పాంక్రియాస్ అసలేమాత్రం పనిచేయకపోవడం, లేదా పాంక్రియాస్ అసలు లేకపోయడం వలన ఇన్సులిన్’ను పూర్తిగా బయటినుండే తీసుకునే పరిస్థితి ఉంటుంది, అనగా శరీరంలో ఇన్సూలీన్ ఉత్పత్తి సున్నా ఉంటుంది. ఈ సమస్యకు ఈ డైట్ వల్ల ప్రయోజనం దొరకదు. అయితే ఇతర సమస్యలు అనగా అధిక భారం వగైరా తగ్గించుకోవచ్చు. 29. వీరమాచినేని గారి - వారి స్నేహితుల ముఖ్య ఫోన్ నెంబర్లు ? Veeramachineni Ramakrishna : 92464 72677 Brother Imraan : 95025 77327 30.కొంతమంది మాకు ఈ డైట్ పని చేయకుండా ఆగిపోయింది అని చెబుతుంటారు కారణం ఏమిటి ? ఈ ప్రశ్నకు సంబందించి జవాబుగా వీరమాచినేని స్వయంగా ఉదహరించిన వాటిలో ఈ మూడు ఉదాహరణలు చూడండి. 1. వీరి స్నేహితులోకరు చాలా పర్ఫెక్ట్ గా ఈ డైట్ ను మొదలు పెట్టారు, మంచి రిజల్ట్స్ తొందరగానే రావడం మొదలయ్యాయి. వారి అధిక భారం తగ్గుడుండడం మరియు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న స్పాందలైటీస్ సమస్య పోవడం కూడా జరిగింది, అయితే ఇంకా భారం తగ్గల్సి ఉంది, ఆ సమయంలో ఒక పండుగ నాడు వీరమాచినేని గారు ఆయనను వద్దని వారించినా కూడా కేవలం ఒక స్పూన్ పులిహోర తిన్నారు, అంతే ఆ తరువాత మరో పదిహేను 15 రోజులవరకూ ఆయన అరకిలో కూడా తగ్గలేకపోయారు. ఏవైతే నిషిద్దమైనవి ఉన్నాయో అవి రవ్వంత కూడా తగలదానికి వీల్లేదు. 2. వీరమాచినేని వారి ప్రోగ్రాములో ఒకరు ఇలా ప్రశ్నించారు : మేము మీ డైటును మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా, జాగ్రత్తగా అనుసరిస్తున్నాము, కానీ అనుకున్నంత వెయిట్ తగ్గడం లేదు, కొంత తగ్గి ఆగిపోయాము అని. వీరమాచినేని గారు వారి నుండి పూర్తి సమాచారం సేకరించిన తరువాత తెలిసింది ఏమిటంటే అనుకోకుండా వారు ఫ్యాట్ పూర్తిగా తీసుకోవడం లేదు, అనగా వారు వండిన తరువాత మరియు ఇతర ప్లేటులో మార్చడం ద్వారా చాలావరకు ఫ్యాట్ ఆ పాత్రల్లోనే ఉండిపోతుంది, దానిని వారు గమనించలేదు. 70 నుండి 100 గ్రాములు అంటే నోట్లో వెళ్ళేది అనేది మనం గుర్తుంచుకోవాలి, కాబట్టి ఎప్పుడూ 60 గ్రాములు నేరుగా తీసుకుని మిగితాడి వంటలో వాడుకోవాలి. (3). ఒకరు వీరమాచినేని గారు చెప్పినట్లుగానే జాగర్తగా ఈ డైట్ చేయడం మొదలుపెట్టాలు, మొదట్లో కొంత బాగానే ఉన్నా తరువాత బరువుతగ్గడం లేదు. దీనిగురించి కూడా వారిని ప్రశ్నించినప్పుడు తెలిసిందేంటంటే ఈ డైట్ ప్లాన్ వినేటప్పుడు ఒక చోట వీరు పొరబడ్డారు. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మజ్జిగ చేసేటప్పుడు ఒక లీటరుకు కేవలం రెండు స్పూన్లు మాత్రమే పెరుగు వాడాలి, కానీ వారు దీనిని రెండు గ్లాసుల పెరుగులా అర్ధం చేసుకున్నారు, ఆ విధంగా వారు నేరుగా చాలా పెరుగు తీసుకున్నారు. ఈ విధంగా వారి ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఈ ప్రోగ్రాములు ఎలా ఫాలో అవ్వాలో అలా ఫాలో అయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, ఒక వేళ ఇలా లేకుంటే తప్పు ఎక్కడ జరుగుతుంతో జాగ్రత్తగా పరిశీలించి సరిచేసుకోవాలి, సమస్య తప్పుచేయడంలో ఉంటుంది కానీ ఈ ప్రోగ్రాములో కాదు. ఇది అనుభపూర్వకంగా నిరూపితమైయన విషయం. 31. పొడవుకు తగ్గ సరైన వెయిట్ ఉన్నవారు ఈ డైటును పాఠిస్తే మరింత తగ్గిపోతారా ? ఈ డైట్ ద్వారా పొదవుకు తగ్గ వెయిట్’కు చేరినవారు లేదా మొదటి నుండే పొదవుకు తగ్గ వెయిట్ ఉన్నవారు దానికి మించి తగ్గరు, అక్కడికి ఆగిపోతారు. ఇది సహజంగా జరుగుతుంది. 32. డైట్’లో ఉన్నప్పుడు షుగర్ లెవెల్ తగ్గితే (డౌన్ అయితే) ఏం చేయాలి ? ఈ సమయంలో తీపి తీసుకునే అనుమతి ఉందా ? ఈ డైట్ లో సాధారణంగా షుగర్ తగ్గదు, ఒక వేళ తగ్గినా చక్కెర, బెల్లం, తేనె వంటి తీపి పదార్ధాలేమీ తీసుకోకూడదు, దాని స్థానంలో ఎండుకొబ్బరి, లేదా ముదురు కొబ్బరి తీసుకోవచ్చు, ఇది వేగంగా పని చేస్తుంది, అలాగే దీనితోపాటు బోన్ సూప్ కూడా తీసుకోవచ్చు. వీటిద్వారా సుగర్ సాధారణ స్థితికి చేరుతుంది. 33. బీపీ ఉన్నవారు బీపీ టాబ్లెట్ వేసుకోవచ్చా లేదా ? బీపీ ఉన్నవారు ఈ డైట్ మొదలుపెట్టిన రెండు వారాల వరకు బీపీ టాబ్లెట్ వేసుకోవచ్చు, ఆతరువాత వదిలేయవచ్చు. ఈ డైట్ లో బీపీ కూడా సాధారణ స్థితికి చేరుకుంటుంది. 34. పిండి పదార్ధాలు అంటే ఏమిటి ? వరి, గోదుమలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగి, బొంబాయి రవ్వ, ఇదిలీ రవ్వ, వగైరావి పిండి పదార్ధాలు లేదా కార్బో హైడ్రేట్స్ అనబడతాయి. అలాగే వాటితో మనం సాధారణంగా చేసే వరిఅన్నం, చపాతి, పరాటా, బన్’రొట్టె, ఉప్మా, ఇడ్లీ, అట్టులు, దోసెలు వగైరా ఏమీ ఈ డైట్’లో తీసుకో కూడదు. 35. ఈ డైట్ లో పిండి పదార్ధాలు ఎలా తీసుకోవాలి ? ఈ డైట్ లో ఏమి తీసుకోవాలో చాలా స్పష్టంగా తెలుపబడి ఉన్నాయి, వాటిలో పిండి పదార్ధం కూడా ఉంటుంది అనగా కూరగాయలు, నట్స్ వగైరాలో ఇవి ఉంటాయి. అంతేగానీ మీకు తెలిసిన పిండిపదార్ధాలను మీరు కోరుకున్నట్లుగా తీసుకోకూడదు. ముఖ్య విషయం : ఈ డైట్లోనే కాకుండా సాధారణ జీవితంలో కూడా రీఫైన్ద్ నూనెలను పూర్తిగా వదిలేయండి, ఇవి ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించవు. 36. ఈ డైట్ లో తీసుకునే ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ పెరగదా ? డైటరీ ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ పెరగదు, డైటరీ ఫ్యాట్ కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమవుతుందేమోననే అపోహతో ప్రపంచమంతా డైటరీ ఫ్యాట్ కు దూరంగా ఉంటూ వచ్చింది, దీనివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని శాస్త్రియంగా నిరూపితమవ్వలేదని తేలింది, ఈ విషయాన్ని ప్రపంచమంతా అంగీకరించింది. మన పూర్వీకులు నెయ్యి, వెన్న వంటివి విపరీతంగా తినేవారు కానీ వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండేవి కావు, ఎల్లప్పుడూ శక్తివంతంగా మరియు సత్తువతో ఉండేవారు. 37. ఈ డైటులో అత్యంత జాగ్రత్త వహించాల్సిన, అత్యంత సున్నిత అంశాలు ఏమిటి ? లేదా ఈ డైట్ ను ఒక్కసారిగా నిర్వీర్యం చేసే, నిలిపివేసే అంశాలు ఏమిటి ? ఏవైతే మీకు పూర్తిగా నిషేడించబడినవో అవి రవ్వంతైనా మీ నాలుకకు తగలకూడదు, ఒక్క స్పూను అన్నం, ఒక చిన్న పండు ముక్క మీ డైట్ ను ఆప్పటికప్పుడే ఆపేస్తుంది. మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే రెండు వారాల వరకూ పట్టవచ్చు. నిషేడించబడిన విషయంలో జాగ్రత్త వహించకుండా ఉంటే ఒక నెలలో రావలసిన ప్రతిఫలం నాలుగైదు నెలలు కొనసాగవచ్చు, పూర్తి స్థాయిలో ఫలితం రాకపోవచ్చు. 38.ఈ డైట్ మొదలుపెట్టేటప్పుడు ఏ పరికరాలు దగ్గరుంతే మంచిది ? వెయిట్ చూసుకోవడానికి వేయింగ్ మిషీన్, ఫ్యాట్ ను తూయడానికి చిన్న ఎలక్ట్రానిక్ తూకం, (షుగర్ ఉంటే) రోజూ షుగర్ చెక్ చేసుకోవడానికి దాని సంబందించిన పరికరం. గమనిక :ఈ డైట్ లో కాకుండా సాధారణంగా ఉపయోగించడానికి వేరుశనగనూనే నేరుగా గానుగాలో ఆడించి ఆ నూనెను వినియోగించండి కానీ రీఫైన్ద్ ఆయిల్ జోలికి వెళ్లవద్దు. రీఫైన్ద్ ఆయిల్ ఒక్క సారి వాడితే నల్లగా మడ్డీ ఆయిల్ లాగా మారి విషపూరితంగా మారుతుంది, రెండవసారి వంటకు పనికిరాదు, నెయ్యిగానీ లేదా రీఫైన్ చేయని నూనెగానీ ఎన్నిసార్లు వేడి చేసినా పాడవదు మరలా వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. కొబ్బరి నూనె అత్యుత్తమమైనది. ఈ రీవైండ్ నూనెల వల్లే మన ఆరోగ్యాలు డెబ్భైశాతం 70% పాడవుతున్నాయి, రీఫైన్ద్ ఆయిల్ కు దొరికే మార్కులు నూటికి ఐదు 5 మాత్రమే. రీఫైన్ద్ ఆయిల్ లో దాని సహజ తత్వాన్ని నిర్వీర్యం చేయబడుతుంది. అలాగే సహజమైన ఆయిల్ గడ్డ కడుతుంది కానీ రీఫైన్ ఆయిల్ గద్దకట్టదు. 39. అధిక భారం వల్ల అవయవాలపై ఎటువంటి ప్రభావం పడుతుంది ? ప్రతి మనిషికి సహజంగా అతని శరీరానికి తగ్గట్టు అతని అవయవాలు ఉంటాయి, దానికి సరిపడా ప్రక్రియలు, ఫంక్షన్స్ అవి నడుపుతుంటాయి, కానీ బరువు పెరిగిపోతే ఆ అవయవాలు ఉదా హరణకు: ఊపిరి తిత్తులు, గుండె, కిడ్నీలు వగైరా శరీరానికి మరింత శక్తిని అందించడానికి తమ కెపాసిటీ కన్నా ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితి దావూరిస్తుంది, కాబట్టి పొడవుకు తగ్గ వెయిట్ ఉంటే వాటిపై అధిక భారం పడదు మరియు వాటి జీవనకాలం కూడా పెరుగుతుంది. Courtesy : Asad

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి