14, జూన్ 2018, గురువారం
కవిత..మానస విహంగం. మానస విహంగం అందని జాబిల్లి కోసం అర్రులు చాస్తూ పరుగులు తీస్తోంది. భావోద్వేగాలను, భావపరంపరలనూ అదుపులో పెట్టమని అంతరాత్మ ఘోషిస్తూంది ఫలితకేశాలు, సడలిన దేహం తన ఉనికికి అద్దం పడుతున్నా, రంగుల పొహళింపుతో తిరిగిరాని అందమైన రూపుకోసం విశ్వప్రయత్నం చేస్తూంది. వయస్సు దేహనికే కాని మనసుకు లేదని వింతగా సమర్ధించుకుంటూంది. ఎంత మెరుగులు దిద్దినా అరవైలో ఇరవైని పొందలేమని సమ్మతించలేకపోతూంది. మళ్ళుతున్న వయసుని, చేజారిపోతున్న కాలాన్ని తలచి తలచి కృంగిపోతూంది. పిచ్చి మనసా! అసంభవాన్ని సంభవం చెయ్యాలన్న ఆలోచనెందుకు? మారుతున్న కాలాన్ని సంతోషంగా స్వీకరించి, జీవిత చరమాంకలోని అనుభూతుల్ని ఆస్వాదిస్తూ జీవించు ప్రశాంతిగా! -ల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి