24, అక్టోబర్ 2018, బుధవారం

ఎన్నికలు-ఎన్ని కలలు ********** తాగండయ్యా మందు తాగండయ్యా ముందు ఎన్నికల సందడి వచ్చిందయా ఎన్నికలలో ఎన్ని కలలో నయా తప్పతాగీ మీరు తనువప్పజెప్పండి లాఠీలు తూటాలు వారేసుకుంటారు తూగుతూ మీరెల్లి ఓటేసుకుంటారూ . మందు పోయించినోడు మహరాజు అవుతాడు ఐదేండ్లు మిమ్ము ఆడిస్తూవుంటాడు తాగడయ్యా మందు తాగడయ్యా ముందు ఎన్నికల సందడివచ్చిందయా ఎన్నికలలో ఎన్ని కలలోనయా . కల్లబొల్లి కబుర్లు కలబోసి చెపుతారు కైపెక్కి మీరేమొ కొడతారు చప్పట్లు ఆపైన మీనోట్లో కొడతారు మట్టి తాగండయ్యా మందు తాగండయ్యాముందు ఎన్నికల సందడి వచ్చిందయా ఎన్నికలలో ఎన్ని కలలోనయా ఆవేశ పడతారు ఆహుతై పోతారు బలిపీఠ మెక్కేది మీరు బంగారు గద్దె పై వారు మండుటెండల్లోన మీరు మంత్రి పదవుల్లోన వారు తాగండయ్యా మందు తాగండయ్యా ముందు ఎన్నికల సందడి వచ్చిందయా ఎన్నికలలో ఎన్ని కలలోనయా సందడిలో జోరు ఆపైన బేజారు బీమారిలా పట్టి ఐదేళ్ళు ఉంటుంది తెరవండయ్యా కళ్ళు వేయండయ్యా ఓటు కులపిచ్చితో కాదు మతపిచ్చితోకాదు మంచోడ్ని చూచి వేయండయ్యా తాగండయ్యా మందు తాగండయ్యా ముందు ఎన్నికల సందడి వచ్చిందయా ఎన్నికలలో ఎన్ని కలలోనయా ........డాక్టర్. బెజ్జంకి. జగన్నాథాచార్యులు. మాచర్ల, 13.10.2018.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి