30, నవంబర్ 2018, శుక్రవారం
నార్ల వారి పద్యాలు ఇప్పుడు చాలా సందర్భోచితం: ------------------------------------------------------ పత్రికొక్కటున్న పదివేల సైన్యమ్ము పత్రికొక్కటున్న మిత్ర కోటి ప్రజకు రక్ష లేదు పత్రిక లేనిచో నవయుగాల బాట నార్ల మాట! నిజము కప్పిపుచ్చి, నీతిని విడనాడి స్వామిసేవ చేయు జర్నలిస్టు తార్చువాని కంటె తక్కువ వాడురా! నీతి నియతి లేని నీచుని చేతిలో పత్రి కుండెనేని ప్రజలకు చేటు హంత చేతి కత్తి గొంతులు కోయదా! పత్రికే నియంత పక్కలో బల్లెమ్ము పత్రికే ప్రజాళి పట్టుగొమ్మ ప్రభుత వక్రమౌను పత్రిక లేనిచో! ప్రజల సరస నిలిచి ప్రధనమ్ము నడపుట ప్రథమ ధర్మమోయి పత్రికలకు ప్రభుత పాదసేవ పత్రికలేలరా! వార్తలోన తొణకు వర్తమాన చరిత వార్త నణప నీలివార్త పుట్టు వార్తనణచువాడు స్వాతంత్ర్య హంతరా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి