21, మే 2019, మంగళవారం

ఆకు పచ్చ చందా మామా నువ్వులే నువ్వులే నీకూ మచ్చా లేడా లేనే లెవ్వ్వులె లెవ్వులె మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నదీ ? మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నదీ ? మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ మింట సుక్కలల్ల వాడూ మింట సుక్కలల్ల వాడూ - సెమట సుక్కలల్ల నువ్వూ ...... ॥ ఆకు పచ్చ ॥ వానాకాల మోస్తే మబ్బు కప్పి పోయి మరుగయ్యే జాబిల్లి నవ్వు వానాకాల మోస్తే మబ్బు కప్పి పోయి మరుగయ్యే జాబిల్లి నవ్వు వానల్ల వరదల్ల బురద జిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు వానల్ల వరదల్ల బురద జిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు మేఘాల సొగసు వాడూ మేఘాల సొగసు వాడూ - మాగాణి తేజస్సు నువ్వూ ........... ॥ ఆకు పచ్చ ॥ కలువ రేడు పేరు కాని కలువను వాడు చేరలేడు ఎంత పాపం ? కలువ రేడు పేరు కాని కలువను వాడు చేరలేడు ఎంత పాపం ? కట్టుకున్నదాని ముద్దుముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం ? కట్టుకున్నదాని ముద్దుముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం ? రాత్రి పూటకు వాడు కాపూ రాత్రి పూటకు వాడు కాపూ - రాత్రి తోటకు నువ్వు కాపూ ..... ॥ ఆకు పచ్చ ॥ కాకమ్మ కధలోన రాహు కేతులకు ఏడాది కోసారి గ్రహణం కాకమ్మ కధలోన రాహు కేతులకు ఏడాది కోసారి గ్రహణం పంట సేతికి వస్తే చుట్టూరా రాహూలె ఏడాది కేడాది గ్రహణం పంట సేతికి వస్తే చుట్టూరా రాహూలె ఏడాది కేడాది గ్రహణం విడుదలున్నది వాడికైతే విడుదలున్నది వాడికైతే - నువ్వేమో జీవిత ఖైదే ............ ॥ ఆకు పచ్చ ॥ పాల సముద్రాన వాడు పుట్టిందని పంతులయ్య తల్లి సెప్పింది పాల సముద్రాన వాడు పుట్టిందని పంతులయ్య తల్లి సెప్పింది కన్నీటి సంసార సాగరంల నిన్ను కన్నానని మీ అమ్మ సెప్పింది కన్నీటి సంసార సాగరంల నిన్ను కన్నానని మీ అమ్మ సెప్పింది ఎన్నెల్ల నిస్తారు మాకూ ఎన్నెల్ల నిస్తారు మాకూ - ఎలుగన్నదె లేదు మీకూ ............. ॥ ఆకు పచ్చ ॥ కష్ట జీవులయ్య భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు కష్ట జీవులయ్య భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు ఫలము చేతికి రాక పోయినా అలుపు లేని కర్మ యోగులయ్య మీరూ ఫలము చేతికి రాక పోయినా అలుపు లేని కర్మ యోగులయ్య మీరూ నింగి ఎన్న పూసా వాడూ నింగి ఎన్న పూసా వాడూ - నేల ఎన్ను పూస నువ్వూ ......... ॥ ఆకు పచ్చ ॥ ఆకు పచ్చ చందా మామా నువ్వులే నువ్వులే నీకూ మచ్చా లేడా లేనే లెవ్వ్వులె లెవ్వులె మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నదీ ? మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నదీ ? మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నదీ మింట సుక్కలల్ల వాడూ మింట సుక్కలల్ల వాడూ - సెమట సుక్కలల్ల నువ్వూ . ఈ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి