16, ఏప్రిల్ 2020, గురువారం

*** బట్టతలపై పద్యము ***సీ. తలనూనె రాసెడు తగులాటముండదు,క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదుపేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును,చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గుపెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ,జుట్టింత దొరకదు పట్టుకొనగఅద్దంబు దువ్వెన లవసరమే లేదు,పర వనితలు వెంట పడుట కల్లతే.కడకు కుంకుడు శ్రీకాయ ఖర్చు మిగులుతలకు స్నానంబు చేయుట సులభమౌనుఇన్ని గణనీయ లాభంబు లెంచిచూడబట్టతల గల్గు వాడెపో భాగ్యశాలి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి