20, మే 2018, ఆదివారం

*తమ కార్యంబుఁ బరిత్యజించియుఁ బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటించుచున్ బర హితార్థ వ్యాపృతుల్ మధ్యముల్, తమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భం గము గావించెడివార లెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్? *

రాజకీయ పదం ఎలాపుట్టింది? రావణస్య జరాసంధో కీచకస్య యమ స్థథా | ఆధ్యాక్షరాణి సంగ్రహ్య|| రాజకీయేతి కథ్యతే॥ రావణ, జరాసంధ, కీచక మరియు యమ. ఈ పేర్లలోని మొదటి అక్షరాలతో "రాజకీయ" అనే పేరు పుట్టింది😈😈✌🏼ట!! (వాట్స్ ఆప్ సందేశం..)

గతంలో సంసారం 'చీకట్లోనే' జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి, నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి.... కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు...🤦‍♂ నాడు కొందరికే మందు, విందు అలవాటు నేడు కొందరే వీటికి దూరం.. నాడు కష్టమొస్తే, కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు, నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమౌతున్నారు.. నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం, నేడు కదల కుండా కూర్చుని సంపాదిస్తూ.... తిన్నది అరగడానికి వాకింగు శ్రమిస్తున్నాం, నాడు పండ్లు, పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించాము.. ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నారు.. ఇంక పిల్లలెక్కడ🙆‍♂ అందుకేగా అన్ని చోట్లా సంతాన సాఫల్యకేంద్రాలు... గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే.. మనసు మాత్రం సాఫ్టు ఇప్పుడు అంతా 'సాప్ట్ వేర్ ఇంజనీర్లే' మనసు మాత్రం హార్డు!!!! అప్పుడు వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవాడు, అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి! ఇప్పుడు తలకాయనొప్పికే ఇళ్ళమ్ముకునేంత ఖర్చు ఔతోంది!! నాడు దొంగలు 'నట్టింట్లో' పడి దోచుకెళ్ళేవారు, నేడు దొంగలు దొరల్లాగా 'నెట్ ఇంట్లో' దోచేస్తున్నారు.... ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతిలేక .. ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువు తున్నారు సైబరు నేరగాళ్ళు.... అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడే వాళ్ళం, ఇప్పుడు క్రెడిటు కార్డు మీద అప్పుతో కొనుక్కోడమే క్రెడిటు గా ఫీలౌతున్నాం.. ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి, సొమ్ము చేయలేక తాగేవాళ్ళం.. ఇప్పుడు రెడీ మేడు చపాతీలు , పొంగలి దాంటో కూరతో సహా కొనుక్కొచ్చుకొని తింటున్నాం... చైనా నుండి ఒకనాడు పింగాణీ వస్తువు లొచ్చేవి.... నేడు తినే కంచం నుంచి దాంట్లోకి ప్లాస్టిక్ బియ్యం తో సహా అక్కడినుంచే... ఇది మనం సాధించిన పురోగతా............? లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా....? ఈ పోస్ట్ కి మనకి సంబంధం ఏంటిలే అనుకోకు... ఇలా ఉన్న వాళ్ళ మధ్యలోనే కదా మనం బతుకుతోంది... కాస్త ఆలోచించండి మీ మంచికే ! Please forward to others🙏� 🙇🏻....

19, మే 2018, శనివారం

ప్రతి రోజూ walking చేసేటప్పుడు నేను వినే ..నన్ను నడిపించే ...సుప్రభాతం ఈ పాటే. మరి మీకో?........................................................................ ............................ ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ... విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా ..... నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా... సంద్రమెంత పెద్దదైనఈదుతున్న చేపపిల్లమొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా నిశా విలాసమెంత సేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా.... ఎప్పుడూ.................. నొప్పి లేని నిముషమేది జననమైన, మరణమైన జీవితాన అడుగడుగునా... నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణా.. దేహముంది ప్రాణముంది,నెత్తురుంది ,సత్తువుంది అంతకన్న సైన్యముండునా.. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము సారధౌనురా..నిరంతర ప్రయత్నమున్నఛో నిరాశకే నిరాశ పుట్టదా ఆయువంటు ఉన్నవరకు చావు కూడ నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా.... ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ... విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా ....

*జెండాపై కపిరాజు ముందు సిత వాజశ్రేణియుం కూర్చి నే- దండంబుం గొని తోలు స్యందనము మీద న్నారిసారించుచుం- గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పు డొ- క్కండు న్నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్*

ఆటవెలది మనుషు లైన మనము , నొనరించు తప్పిది జగతి నెవరు జెప్ప , సగమె వినుచు పావు నర్ధ మవగ , వాని యోచన సున్న రెచ్చి పోయి గోల , రెండు రెట్లు ! దేశినేని