19, మే 2018, శనివారం

ప్రతి రోజూ walking చేసేటప్పుడు నేను వినే ..నన్ను నడిపించే ...సుప్రభాతం ఈ పాటే. మరి మీకో?........................................................................ ............................ ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ... విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా ..... నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా... సంద్రమెంత పెద్దదైనఈదుతున్న చేపపిల్లమొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా నిశా విలాసమెంత సేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా.... ఎప్పుడూ.................. నొప్పి లేని నిముషమేది జననమైన, మరణమైన జీవితాన అడుగడుగునా... నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణా.. దేహముంది ప్రాణముంది,నెత్తురుంది ,సత్తువుంది అంతకన్న సైన్యముండునా.. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము సారధౌనురా..నిరంతర ప్రయత్నమున్నఛో నిరాశకే నిరాశ పుట్టదా ఆయువంటు ఉన్నవరకు చావు కూడ నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా.... ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ... విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి