2, మే 2018, బుధవారం

మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి, పుట్టీ జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దోచుకొనే తనయులు మీరు మగసిరితో బ్రతకలేక మదమెక్కిన కీచకులై కుటిల కామ నీచకులై స్త్రీజాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో, మీ అక్కల రక్తంతో రాసుకోవాలి మరో మహాభారతం.. ` కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి మీ కండలు పెంచినది ఆ గుండెలతో కాదా ఎఱ్ఱని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి పెంచిన తల్లి ఓ ఆడదని మరిచారు కనబడడం లేదా ఆతల్లుల స్థనాలపై పాపలుగా మీ చరిత్ర ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగల్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా పుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని దృతరాష్ట్రులపాలనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్యసమాజం ఏమైపోతుంది మానవధర్మం ఏమైపోతుంది ఈ భారతదేశం మన భారతదేశం ప్రతిఘటన మీ శ్రీకృష్ణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి