6, మే 2018, ఆదివారం
రవీంద్రుని గీతాంజలికి ఇరువురు ప్రముఖుల అనువాదాలు -------------------------------------- (ఇది చలం అనువాదం) ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ కార్యాలలోకీ నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు.. (ఇది రజనీకాంతరావు అనువాదం) _____________________ చిత్తమెచట భయ శూన్యమో శీర్షమెచట ఉత్తుంగమో జ్ఞానమెచట ఉన్ముక్తమొ భవప్రాచీగృహప్రాంగణ తలమున దివారాత్ర మృత్తికారేణువుల క్షుద్ర ఖండములుకావో వాక్కులెచట హృదయోద్గతోచ్ఛ్వసన మొరసి వెలువడునొ కర్మధార యెట అజస్ర సహస్ర విధాల చరితార్థంబై అనివారితస్రోతంబై దేశ దేశముల దెసదెస పరచునొ తుచ్ఛాచారపు మరుప్రాంతమున విచార స్రోతస్విని ఎట నింకునొ శతవిధాల పురుషయత్న మెచ్చట నిత్యము నీయిచ్ఛావిధి నెగడునొ అట్టి స్వర్గతలి భారత భూస్థలి నిజ హస్తమ్మున నిర్భయాహతిని జాగరితను గావింపవో పితా సర్వకర్మ సుఖ దుఃఖ విధాతా....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి