13, మే 2018, ఆదివారం
*అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె ద్దమ్మ సురారులమ్మ కడుపారడిపుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్* **భావం: అందరు అమ్మలకు అమ్మ, ముగ్గురు అమ్మలకూ మూలమైన అమ్మ, అమ్మలందరి కంటె గొప్పది అయిన అమ్మ, రాక్షసుల తల్లుల కడుపులకు చిచ్చుపెట్టిన అమ్మ (రాక్షసులను చంపి వారి తల్లులకు శోకం మిగిల్చిన తల్లి), తనను మనస్ఫూర్తిగా నమ్మిన దేవతల తల్లుల మనసులో నిలిచి ఉండే తల్లి, దయా గుణంలో సముద్రమంత పెద్ద మనసు గల తల్లి అయిన దుర్గాభవాని, మహత్తులు కల కవిత్వ పటుత్వ సంపదలను ప్రసాదించుగాక!**
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి