29, అక్టోబర్ 2014, బుధవారం

 రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత! భ
గ్నోరుతరోరు జేయుధారుణిదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్!
కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్!

28, అక్టోబర్ 2014, మంగళవారం

మానసికంగా బలహీనమైనవారు తీగ లాంటి వారు
స్నేహం , బంధం , కులం మతం లాంటి ఆసరా కోరుకుంటారు , ఆధారపడతారు
మానసికంగా బలంగా ఉన్నవారు చెట్టులాంటి వారు
చెట్టుకి ఆలంబన అక్కర లేదు , భూమిలోపల వ్రేళ్ళు పాదుకుని ఉంటే చాలు ...

24, అక్టోబర్ 2014, శుక్రవారం



సంతోషమంటే ఆరోగ్యంగా ఉండటం, చేదు జ్ఞాపకాలను మరచిపోవటమే.


ఒక వయసు, కొన్ని అర్హతలు, కొన్ని పదవులు వచ్చాక..మనం వాడవలసిన పదాలు సరళంగా ఉండాలి.. శత్రువుని ఆక్షేపించేటప్పుడుకూడా మన వ్యక్తిత్వాని దర్పణం పట్టేట్లు ఉండాలి. పరుష పదజాల ప్రయోగం జనాలకు ఉత్ప్రేరకాలు కావొచ్చేమోకాని.. మన స్థాయిని అవి తగ్గిస్తాయి.

17, అక్టోబర్ 2014, శుక్రవారం

రాముడు పుట్టిందెప్పుడు? .... క్రీస్తు పూర్వం 7323 డిసెంబర్‌ 4న రాముడు జన్మించాడు. ఆరోజు సోమవారం. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య సమయంలో రాముడు జన్మించాడు. క్రీస్తుపూర్వం 7307 ఏప్రిల్‌ 7న సీతమ్మను రామచంద్రుడు శివధనుస్సును విరిచి వివాహం చేసుకున్నాడు. క్రీస్తుపూర్వం 7306 నవంబర్‌ 29న సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు. 7293 ఆగస్టు 7న రావణుడు సీతను అపహరించుకుని వెళ్లాడు. ఆరోజు అమావాస్య. ఆరోజు సూర్యగ్రహణం కూడా వచ్చింది. హనుమంతుడు సీత జాడను తెలుసుకోవటానికి 7292 సెప్టెంబర్‌ 1వ తేదీన లంకలో ప్రవేశించాడు. సెప్టెంబర్‌ 2న సీతాదేవిని దర్శించుకున్నాడు.. అదేరోజు రాత్రి లంకాదహనం జరిగింది. 7292 అక్టోబర్‌ 2న రామసైన్యం లంకకు బయలు దేరింది. 7292 అక్టోబర్‌ 31న లంకలో వానరసైన్యం ప్రవేశించింది. అంతకు ముందు అక్టోబర్‌ 26 నుంచి 30 మధ్య రోజుల్లో రామసేన సముద్రంపై అసాధారణమైన వారధిని నిర్మించింది. రామ రావణ యుద్ధం మొదలైంది 7292 నవంబర్‌ 3 న. నవంబర్‌ 7న రావణ సోదరుడు కుంభకర్ణుని రాముడు హతమార్చాడు. క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 15న రావణ వధ జరిగింది. క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 19కి రాముడి 14ఏళ్ల వనవాస కాలం ముగిసింది. ... (ఇలాంటి మరెన్నో ఆసక్తికర వివరాలతో వచ్చేస్తోంది.. సీనియర్ జర్నలిస్టు Kovela Santoshkumar రాసిన ‘దేవ రహస్యం’)

రాముడు పుట్టిందెప్పుడు?
....
క్రీస్తు పూర్వం 7323 డిసెంబర్‌ 4న రాముడు జన్మించాడు. ఆరోజు సోమవారం. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య సమయంలో రాముడు జన్మించాడు. 
క్రీస్తుపూర్వం 7307 ఏప్రిల్‌ 7న సీతమ్మను రామచంద్రుడు శివధనుస్సును విరిచి వివాహం చేసుకున్నాడు. క్రీస్తుపూర్వం 7306 నవంబర్‌ 29న సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు. 7293 ఆగస్టు 7న రావణుడు సీతను అపహరించుకుని వెళ్లాడు. ఆరోజు అమావాస్య. ఆరోజు సూర్యగ్రహణం కూడా వచ్చింది. హనుమంతుడు సీత జాడను తెలుసుకోవటానికి 7292 సెప్టెంబర్‌ 1వ తేదీన లంకలో ప్రవేశించాడు. సెప్టెంబర్‌ 2న సీతాదేవిని దర్శించుకున్నాడు.. అదేరోజు రాత్రి లంకాదహనం జరిగింది. 7292 అక్టోబర్‌ 2న రామసైన్యం లంకకు బయలు దేరింది. 7292 అక్టోబర్‌ 31న లంకలో వానరసైన్యం ప్రవేశించింది. అంతకు ముందు అక్టోబర్‌ 26 నుంచి 30 మధ్య రోజుల్లో రామసేన సముద్రంపై అసాధారణమైన వారధిని నిర్మించింది.
రామ రావణ యుద్ధం మొదలైంది 7292 నవంబర్‌ 3 న. నవంబర్‌ 7న రావణ సోదరుడు కుంభకర్ణుని రాముడు హతమార్చాడు.
క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 15న రావణ వధ జరిగింది.
క్రీస్తుపూర్వం 7292 నవంబర్‌ 19కి రాముడి 14ఏళ్ల వనవాస కాలం ముగిసింది.
...
(ఇలాంటి మరెన్నో ఆసక్తికర వివరాలతో వచ్చేస్తోంది.. సీనియర్ జర్నలిస్టు Kovela Santoshkumar రాసిన ‘దేవ రహస్యం’)

14, అక్టోబర్ 2014, మంగళవారం

భూమి అంటే 'అమ్మ' మనకు అన్నం పెడుతుంది 
మొక్క తొలుచుకు వచ్చే ప్రతి సారీ ప్రసవ వేదన పడుతుంది 
కాయ, పండు తిని,కడుపు నిండిన బిడ్డలను 
మురిపెంగా చూసుకుంటుంది 
అలాంటి అమ్మకు ప్రపంచీకరణ అంటూ 
ఆధునికత పాఠాలు నేర్పి
అందమైన బొమ్మ
మురిపాల కొమ్మ
సేద తీర్చ దిగొచ్చిన రంభకి అమ్మ అంటూ
నగరీకరణ మోజుతో
పచ్చటి పల్లెలను
పార్కులుగా మారుస్తానంటే
సిమెంట్ కోక కట్టిచ్చి
రంగుటద్దాలు కుడతానంటే
ఆ పచ్చటి పల్లె తల్లి
కన్నీరు పెడుతుంది
నన్ను బిడ్డల కడుపాకలి తీర్చే
అమ్మగానే ఉండనివ్వమ౦టుంది
గద్దెనెక్కిన గాడ్దెకొడుకులకి
బుద్ధి చెప్పమంటూ
నిన్నూ నన్నూ అడుగుతుంది
గుండెలవిసేలా ఏడుస్తుంది....

గోదారొడ్డున రెల్లుగడ్డితో పాకొకటి వెయ్యాలి...ఆ పాకకి ఆనంద కుటీరమని పేరొకటి పెట్టాలి...పాపికొండలమీంచి పాక్కుంటూ పైకొచ్చే

నిన్న పోలవరం లో అచ్చం అలాంటి ఆశ్రమం నన్ను అహ్వానించింది.
నవంబర్ నుండి అది మా ట్రస్ట్ కార్యకలాపాలకు కేంద్రం కాబోతోంది.
అచ్చం నేను కలగన్నట్లే గోదావరి ఒడ్డు...ఇసుక తిన్నెలు...ఆకుపచ్చటి కొండలు...విస్తారంగా విరగబూసిన రెల్లు పూలు.భలే ఆనందం గా ఉంది.)
గోదారొడ్డున రెల్లుగడ్డితో పాకొకటి వెయ్యాలి...ఆ పాకకి ఆనంద కుటీరమని పేరొకటి పెట్టాలి...పాపికొండలమీంచి పాక్కుంటూ పైకొచ్చే
చందమామనో,సూర్యమామనో చూస్తూ కూర్చోవాలి.....ఆకుపచ్చటి కొండల మీంచి జల జల పారే జలపాతంలో నిలువెల్లా స్నానించాలి....
రెల్లుపూల పానుపుపై జల్లు జల్లుగా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా అంటూ హాయిగా పాడుకోవాలి.....బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుకతిన్నెల మీద ఎదురెదురుగా కూర్చుని పిచ్చుక గూళ్ళు కట్టుకోవాలి.....అమావాశ్యనాటి రాత్రి ఆకాశం నిండా వెలిగిపోయే నక్షత్రాల సొగసును తనివితీరా చూసెయ్యాలి.....నిండుపున్నమి రాత్రి వెన్నెల్లో పాపిడి కొండల మధ్య పడవ ప్రయాణం చెయ్యాలి......
నేస్తమా...నా ప్రాణ నేస్తమా...నా ఆనంద కుటీరం లో నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను.ఎవరి పనుల్లో వాళ్ళం బిజినే....ఎవరి జీవితానికి వాళ్ళం బాధ్యులమే.
అయితేనేం.....మనిద్దరం కలగంటున్న గోదారొడ్డున ఆనంద కుటీరం....అబ్బ!!! ఎంత సమ్మోహనపరుస్తుందో!!!
నువ్వూ నేనూ కలిసి పంచుకునే కబుర్ల జలపాతం లో తన్మయమవ్వాలని.....
గోదారొడ్డున మన ఆనంద కుటీరం ఆత్రుతగా ఎదురు చూస్తోంది.