31, ఆగస్టు 2014, ఆదివారం

కాలువా నెనూ పక్క పక్కనే నాదిశాం ..కొంత దూరం తర్వాత అది పొలంలో కలిసింది. నేను స్వార్దమనే హాలాహలం లో కలిసా ..!!

29, ఆగస్టు 2014, శుక్రవారం

                   గాంధి గురించి వాడ్రేవు                         రెండురోజులకిందట గాంధీజీ ఆత్మకథ గురించి నాలుగు వాక్యాలు రాయకుండా ఉండలేకపోయానేగాని, నిజానికి ఆ పుస్తకం గురించీ,గాంధీజీ జీవితం గురించీ నా మనసులో కదలాడుతున్న భావాలన్నిటికీ నేను అక్షరరూపం ఇవ్వలేకపోయాను. 1927-29 మధ్యకాలంలో ఆ మానవుడు రాసుకున్న అనుభవాలు 2014 లో నన్నెట్లా చలింపచేస్తున్నాయో, ఆ వాక్యాలు చదివి నేనెందుకు స్పందిస్తున్నానో మాటల్లో పెట్టలేకపోతున్నాను.
1869 నుంచి 1921 దాకా తన జీవితంలోని యాభై ఏళ్ళ అనుభవాలు మాత్రమే గాంధీజీ అందులో రాసుకొచ్చారు. ఆ తరువాత తన జీవితంలో సంభవించిందంతా దేశానికి తెలుసనీ అందువల్ల వాటిని ప్రత్యేకంగా రాయవలసిన పనిలేదనీ ఆయన భావించారు. ఆ యాభై ఏళ్ళ జీవీతంలో కూడా ముఖ్యంగా ముఫ్ఫై ఏళ్ళ అనుభవాలు, అంటే తాను బారిష్టరు చదువుకోవడానికి ఇంగ్లాండు వెళ్ళినప్పటినుంచి సహాయనిరాకరణ తీర్మానం కాంగ్రెస్ తో ఆమోదింపచేసుకునేదాకా అనుభవాలు. ఆ అనుభవాలన్నిటిలోనూ రాజకీయాలకీ, సమాజానికీ, స్వాతంత్ర్యానికీ సంబంధించిన భావాలది కేవలం రెండో స్థానం మాత్రమే. ఆ జీవితమంతా ప్రధానంగా కనబడే పదాలు- ఉపవాసాలు, శాకాహారం, బ్రహ్మచర్యం,ప్రార్థన,రామనామం, రామకృప మాత్రమే.
నాక్కూడా యాభయ్యేళ్ళు పూర్తయ్యాయి. గాంధీజీ జీవితంలో 20 ఏళ్ళనుంచి యాభై ఏళ్ళదాకా ముఫ్ఫై ఏళ్ళ పాటు సత్యంతో ప్రయోగాలు జరిపితే నేను గత ముఫ్ఫై ఏళ్ళుగా అసత్యంతో ప్రయోగాలు చేపడుతూ వచ్చాను. పుస్తకమంతా చదివిన తరువాత చాలా దీర్ఘంగా ఆలోచించాను. గాంధీజీని సత్యం వైపు నెట్టిందేమై ఉండవచ్చునని? ఆయన చెప్పుకున్నదాని ప్రకారమే ఆయన మీద అయిదు ప్రభావాలున్నాయి.
ఒకటి, తను చిన్నప్పుడు తప్పులు చేసి ఆ తప్పుల్ని ఒప్పుకుంటూ తండ్రికి ఉత్తరం రాసినప్పుడు, ఆ తండ్రి కళ్ళవెంట స్రవించిన అశ్రువులు. ఆ దృశ్యాన్నిట్లా రాసుకున్నారాయన:
'ఆయన ఆ ఉత్తరాన్ని ఆసాంతం చదివారు. ఆయన చెంపలమీదుగా ముత్యాల్లాంటి అశ్రుబిందువులు టపటపా జారి కాగితాన్ని తడిపేసాయి.ఒక క్షణంపాటు ఆయన ఆలోచనలో పడి కళ్ళుమూసుకున్నారు, ఆ మీదట ఆ చీటీని చింపేసారు. ఆయన లేచి కూచుని ఆ ఉత్తరం చదవవలసి వచ్చింది. మళ్ళా పక్కమీద వాలారు. నేను కూడా ఏడ్చేసాను. నా తండ్రి హృదయంలో ఘూర్ణిల్లిన దు:ఖాన్ని నేను చూడగలిగాను. నేనే కనుక ఓ చిత్రకారుణ్ణై ఉంటే ఆ మొత్తం దృశ్యాన్నంతా ఈ రోజు చిత్రించగలిగి ఉండేవాణ్ణి. ఆ దృశ్యం ఇప్పటికీ నా మనసులో అంత స్పష్టంగానూ ఉంది. ఆ ప్రేమ మౌక్తికాలు నా హృదయాన్ని ప్రక్షాళనం చేసేసాయి. అటువంటి ప్రేమని అనుభవించినవాడు మాత్రమే అదేమిటో తెలుసుకోగలడు.ప్రేమబాణం హృదయాన్ని చీల్చినవాడికే దాని శక్తి ఏమిటో అనుభవానికొస్తుంది. నా వరకూ నాకు అది అహింసా పాఠమనే అనిపించింది. ఆ రోజు నేనందులో ఒక తండ్రి ప్రేమను మించి మరేమీ చూడలేకపోయానుగాని, ఈ రోజు అది పూర్తిగా అహింస తప్ప మరేమీ కాదని గ్రహిస్తున్నాను.'
రెండవ ప్రభావం, తమ ఇంట్లో పరిచారిక రంభ ద్వారా విన్న రామనామమహిమ. ఒక హంతకుడి తుపాకిగుండు ముందు కూడా ఆ రామనామాన్ని ఆయన వదల్లేదు. మూడవ ప్రభావం, తన రాజ్ కోట్ మిత్రుడు రాయచంద్ భాయి స్నేహం. అతణ్ణి తన ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకోలేకపోయినప్పటికీ అతణ్ణి తన మార్గదర్శకుడిగానూ, ఆప్తుడిగానూ చెప్పుకున్నారాయన. ఇక నాల్గవ ప్రభావం, గాంధీజీ చదివిన రెండు పుస్తకాలు: టాల్ స్టాయి రాసిన The Kingdom of God is Within You,రస్కిన్ రాసిన Unto This Last. రస్కిన్ పుస్తకమైతే ఆయన బాహ్యాంతర జీవితాల్ని రెండింటినీ కూడా మార్చేసింది.
కాని ఈ ప్రభావాలన్నీ ఒక ఎత్తూ, ఆయన ఇంగ్లాండు వెళ్ళబోయే ముందు తల్లి ముందు ఒక జైన సాధువు సమక్షంలో చేసిన మూడు ప్రమాణాలూ ఒక ఎత్తు. తండ్రి చెప్పిన మాట పాటించడం రాముడు జీవితాన్ని రామాయణంగా మార్చినట్టే, తల్లికిచ్చిన మాట మోహన్ దాస్ ని మహాత్ముడిగా మార్చిందని స్పష్టంగా అర్థమవుతూ ఉంది.
మద్యం, మాంసం, మగువ- అనే మూడింటినీ ముట్టనని చేసిన ప్రమాణమే ఆయన జీవితాన్ని 'సత్యం నుంచి సత్యం ' వైపుకు నడిపిస్తూ పోయిందని గ్రహించాను. ఆ మూడింటిలోనూ మద్యం ఆయన్ని వ్యక్తిగతంగా ఎక్కువ పరీక్షించలేదు. ( అది తరువాత రోజుల్లో ఆయన పెద్దకొడుకు హరిలాల్ రూపంలో ఒక జీవితకాలంపాటు ఆయన్న్ని వేధించింది). కాని తక్కిన రెండూ ఆయన్ని చాలా నిశిత పరీక్షకు గురిచేసాయి. తన ప్రాణం, తన భార్య ప్రాణం ,తన కోడుకు మణిలాల్ ప్రాణం పొయ్యే పరిస్థితి సంభవించినప్పుడు కూడా మాంసాహారాన్ని ముట్టననే ప్రమాణాన్ని ఆయన వదులుకోలేదు. ఆ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునేవారు, ఆత్మకథ 3వ భాగంలో 22వ అధ్యాయం ఒకసారి చదివితే బాగుంటుంది.
కాని అన్నిటికన్నా ముఖ్యమైన పరీక్ష తన కామవాంఛ కోసం పరస్త్రీవైపు చూడకుండా ఉండటమనేది. బహుశా గాంధీజీ  గాంధి గురించి వాడ్రేవుజీవితంలో అత్యంత కీలకమైన ప్రమాణమిదే అనుకుంటాను. ఇంద్రియనిగ్రహం, బ్రహ్మచర్యం వంటి పదాల్ని శుష్కపదాలుగానూ,అర్థరహితంగానూ భావించే కాలంలో నేను పెరిగి పెద్దవాణ్ణవడం నా జీవితంలో అత్యంత దురదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితంలో కూడా ఏదో ఒక దశలో నన్ను బడికి పంపేటప్పుడో, ఇల్లు విడిచి దూరప్రాంతానికి వెళ్ళేటప్పుడో, ఉద్యోగంలో చేరేటప్పుడో- నా తల్లి, తండ్రి, గురువు ఎవరో ఒకరు నాతో కూడా అట్లాంటి ప్రమాణం చేయించుకుని ఉంటే ఎంతబాగుండేది! ఈ రోజు నాకు స్పష్టంగా తెలుస్తున్నదేమంటే, నువ్వెంతైనా చదివివుండవచ్చుగాక, ఎంతైనా నేర్చి ఉండవచ్చుగాక, నీ ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవడమెలానో తెలుసుకోకపోతే ఆ చదువు వృథా.
ఇంద్రియ నిగ్రహమంటే, కేవలం జననేంద్రియ నిగ్రహం గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు. ముఖ్యంగా నీ నోరు, నీ మాట. ఇతరులపట్ల దయాన్వితంగా మసులుకోవడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు సంపాదించుకొవడమే బ్రహ్మచర్యమని నేనిప్పుడు గ్రహిస్తున్నాను.
స్త్రీని కాముకంగా చూడటంలో ఉన్న ప్రధానదోషమేమిటంటే, ఆ చూపువల్ల నువ్వొక మనిషిని, నిండువ్యక్తిత్వాన్ని కనీసం కొన్ని క్షణాలపాటైనా ఒక మనిషిగా కాక ఒక object గా చూస్తావు. ఈ objectification ఇదే అత్యంత అమానవీయమైన అంశం. పరస్త్రీవైపు చూడకూడదన్న ప్రమాణం గాంధికి నెమ్మదిగా కలిగించిన ఎరుక ఏమిటంటే ,తన భార్యని కూడ తానట్లా చూడకూడదని. Objectification ఎదుటి స్త్రీ పట్ల ఎంత తప్పో, తన భార్య పట్ల కూడా అంతే తప్పు. తాను తన కోరిక వల్ల తన భార్యని కూడా ఒక object గా చూస్తున్నాడన్న గ్రహింపు రాగానే ఆయనకు తను తన భార్య దేహాన్ని colonize చేస్తున్నాడనీ , తద్వారా ఆమెనొక inferior being గానూ, second rate citizen గానూ భావిస్తున్నాడనీ అర్థం చేసుకున్నాడు. అప్పుడాయనకి దక్షిణ ఆఫ్రికాలో బ్రిటిష్ వాళ్ళు భారతీయులతో వ్యవహరిస్తున్న తీరుకీ, భారతదేశంలో సవర్ణహిందువులు దళితకులాలతో వ్యవహరిస్తున్న తీరుకీ మూలకారణమెక్కడుందో తెలిసిపోయింది. తోటి మనిషి దేహాన్ని object గా భావించడంలోంచే సమస్త ఆధిపత్యభావజాలమూ పుట్టిపెరుగుతోందని గుర్తించాడు. నీ పక్కవాడు ఆధిపత్య భావజాలాన్ని చూపిస్తున్నాడని నువ్వతణ్ణి ప్రశ్నించే ముందు నీలో నిగూఢంగా ఉన్న అధిపత్య భావజాలం నుంచి నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకొమ్మనే ఆయన చెప్తున్నాడు.
ముఫ్ఫై ఏళ్ళ కిందట గాంధీజీ ఆత్మకథని రాజమండ్రిలో నా మిత్రుడు గోపీచంద్ కి చదవమని ఇచ్చినప్పుడు అతడొక వాక్యాన్ని ఎత్తిచూపి గాంధీ రాసిన ఆ వాక్యం నిజమే అయితే కనుక ఆయన నిస్సందేహంగా మహాత్ముడు అన్నాడు. ఆ వాక్యమెక్క్డడుందా అని ఈ సారి చదివినప్పుడు శ్రద్ధగా వెతికాను. 2వ భాగం ఇరవయ్యవ అధ్యాయంలో ఆ చివరి వాక్యం ఇలా ఉంది:
It has always been a mystery to me how men can feel themselves honored by the humiliation of their fellow-beings.
most of the people in these states use railway tracks and all public places as their lavatories and urinals-
most of the streets in these states block public roads for festivals for no of days causing nu sense with loud speakers-
all the people walk in the middle of the roads for want of foot paths-
wine shops and liquor bars are spread all over the states and people are served drinks on the public roads-
50% of the vehicles are driven by drunkards killing pedestrians-
30% of the vehicles ignore traffic signals and drive in as u like way-
Most of the police take bribes openly on all main roads from law breakers-
all govt officers and staff collect bribes openly with out any fear-
goondas are given free hand by police and courts as there r no severe laws framed to curb the menace-
courts take minimum 20 years to finalize most of the cases-
rapes are way of life for many-
celebrities and high level people run brothel houses for high govt officials and politicians-
corruption is main business of politicians-
with all these and many more such incurable diseases would any one with sound mind dream about such absurd things?

28, ఆగస్టు 2014, గురువారం

వయసును వెక్కిరిస్తూ మానసోల్లాసమును వొలకబోస్తూ 

శ్రీ శ్రీ గారొకసారి ఆరు బయట తుండు గుడ్డ కట్టుకొని స్నానం చేస్తున్నారట.

శ్రీ శ్రీ గారొకసారి ఆరు బయట తుండు గుడ్డ కట్టుకొని స్నానం చేస్తున్నారట. 
శిష్య వాత్సల్యము చేత శ్రీ శ్రీ ని చూడటానికొచ్చిన కవి సామ్రాట్ విశ్వనాధ వారు ఆ దృశ్యాన్ని చూసారు. స్నానం చేస్తున్నది మహా కవి. చూసినది కవి సామ్రాట్ ...
ఇంకేముంది ...
విశ్వనాధ వారు "మహాకవి ఆరు బయట నీల్లాడె" అని ఎత్తి పొడిచారు .
మరి శ్రీ శ్రీ ఊరుకుంటారా ? తక్షణం "కవి సమ్రాట్టు గనుచుండ మహా కవి నీల్లాడే " అని ప్రత్యుత్తరమిచ్చారట!
ఇక్కడ గమనించ వలసినదేమిటంటే నీల్లాడే అని విశ్వనాధ వారు "శ్రీ శ్రీ ప్రసవిస్తున్నాడు" అనే అర్ధముతో చెబితే అదే అర్ధం వచ్చేలా "కవి సమ్రాట్టు కనుచుండే " అని రిటార్డు నిచ్చారు !
అదీ సంగతి! విద్వత్తు ఏ ఒక్కరి సొత్తు కాదన్నది గ్రహించాలిసిన పరమార్ధము కాదా!
అన్యాపదేశంగా శ్రీ శ్రీ చెప్పింది ఇదే !

మూతి మీద మీసాలు, శిరస్సు పైన శిరోజాలూ వెండి నగిషీలు పెట్టినట్లు మెరసిపోతున్నాయి...!

మూతి మీద మీసాలు, శిరస్సు పైన శిరోజాలూ
వెండి నగిషీలు పెట్టినట్లు మెరసిపోతున్నాయి...!
ఎగిరి ఎగిరి గంతులు వేసావో
అడ్డం గా విరిగిపోతాయి నడ్దిలోన ఎముకలు అని హెచ్చరిస్తున్నట్లు ..!
This silver hair is an indicator designed by God in human body to remind us that " if you jump the walls, your bones will break"
పులికీ పెళ్ళానికి తొందరపడి ఎదురు చెప్పకు ..పులి చంపి పులిహోర చేస్తుంది .పెళ్ళాం పులిహోర చేసి చంపుతుంది...

" పెళ్ళికుమారుడి తరఫువాళ్ళు నిలబడండి" అన్నాడు.
మరో ఇరవై అయిదు మంది నిలబడ్డారు.
"ఇప్పుడు నిలబడ్డవారంతా బయటకు దయచేస్తారా! ఇది పుట్టినరోజు పార్టీ" అన్నాడు విక్కీరావు నవ్వుతూ.
ఎంత చేసినా కూటికే
ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే..!!

26, ఆగస్టు 2014, మంగళవారం

జై జవాన్... జై కిసాన్ ...జై జై జై హిందూస్తాన్...!! జై జవాన్ జై కిసాన్ స్లోగానుగా మిగిలిందా ?

జై జవాన్... జై కిసాన్ ...జై జై జై హిందూస్తాన్...!!
జై జవాన్ జై కిసాన్ స్లోగానుగా మిగిలిందా ?
స్వారాజ్యపు జన్మ హక్కు బ్రతకలేక పోయిందా
విప్లవాల వీర బాట విసృన్ఖలమయ్యిందా..??
త్యాగధనుల ఖర్మపలం తుళ్ళి కుళ్ళి పోయిందా ..?/
స్వారాజ్యపు వెలుతురంత అంధకార మావుతుందా
పంచశీల ఫలితమంత నింగి కెగిరి పోయిందా
ఏమయింది పౌరుషం ఎందులో నిమజ్జనం
నిస్తేజపు దృక్కులతో నీరశించి నీరాజనం
నిదుర వదలి దులుపు మత్తు నీతోనే ప్రభంజనం
నేతాజీ ఘందీజీ, నెహ్రూజీ శాస్త్రీజీ భగత్సిన్ఘ,
అల్లూరి, ప్రకాశం.టంగుటూరి. సర్వేపల్లి. ఇందిరమ్మ ప్వ్ జీ. వాజ్పాయి'
భారతక్జాతి చరిత్రలో మేధావులే తరం తరం
నిస్సువద్దు నిరాసోడ్డు నిన్గికైన లేదు హద్దు
ఉత్షాహం ఉల్లాసం, వూపిరింక మరవొద్దు
భారత జాతి బిడ్డలహ్కు ప్రపంచం విరిపోడ్డు
భారతజాతి పౌరులకూ ప్రపంచాన లేదు హద్దు
జై జవాన్... జై కిసాన్ ...జై జై జై హిందూస్తాన్...!!
జై జై జై హిందూస్తాన్...!!జై జవాన్... జై కిసాన్ ...






మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
చెమటనీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మావూరు
మా ఊరు వెడుతున్నాను ఈ మాట ఈ భావం నన్ను స్థిమితంగా 
వుండనీయదు. ఆ పచ్చదనం గుర్తుకురాగనే
ప్రశాంతంగా హాయిగా మనసు ప్రక్రుతితో
వూయలలూగుతుంది..
ఈ కంక్రీటు అరణ్యంలో బస్సు ఎక్కి
కూర్చుని కళ్ళు మూసుకుంటే ....
చిన్నప్పటి ఆటలూ,పాటలూ,కబుర్లూ,
తొటలూ,వాగులూ,వంకలూ,పొలాలూ,
గట్లూ,వాన నీటితో ఆటలూ..
ఎండాకలంలో చెరువులో ఈతా,
చలికాలంలో చలిమంటలూ...
చిన్న నాటి నేస్తాలూ,ఆనాటి ఎన్నో
అనుభూతులన్నీ
మళ్ళీ అనుభవిస్తున్నంత ఆహ్లాదంగా వుంటాయి..
అసలే వర్షాకాలం హడావిడీ..పొలాల్లో
నాట్లూ,
నీళ్ళు పెట్టడాలూ,కలుపు
తీయటాలూ.....
పొద్దున్న పొలం లో వచ్చి
వాలిన కొంగలు మొక్కలు
పాడుచేయకుండా తోలటం..
ఇంటిలో భోజనాల తయారీలో
అమ్మా ననమ్మా పిన్నులూ పెద్దమ్మల
హడావిడీ,
నాగళ్ళూ,ఎద్దుల గంటల చప్పుడులూ..
వాటిని తీసుకెళ్ళే
పాలేర్లూ,కమతందార్లూ ఇంటి
మనుషుల ఇల్లంతా హడావిడీ....
ఎంత పనిలో వున్నా...మాకు స్కూలుకు
భోజనం,
మమ్మల్ని తయారు చేయటం
మరచిపోని అమ్మ..
రెండుజడలు వేసి రెండుజడలలోనూ
పూలు పెట్టి ముద్దు చేసి జాగ్రత్త తల్లీ
అంటూ
ప్రతీ ఒక్కరికీ చెబుతూ మేము
కనుమరుగయ్యేవరకూ
గుమ్మంలోనే వుండే అమ్మ ఇప్పటికీ
కళ్ళముందే వున్నట్టుంటుంది..
ఇంటికి పదీళ్ళ ఆవల వుండే స్కూలుకు
వెళుతూ
రోడ్డు పక్కన కనిపించే పోలీసు కాయలూ,కోడిపుంజుల
పూలు(గుల్మొహర్)పూలు వీటితో
ఆడుతూ..
మధ్యలో కనిపించే నీటి మడుగులో
కాగితపు పడవలు వేస్తూ సమయాన్ని
మరిచిన మాకు..
చుట్టుపక్కల వారు పిల్లల్లూ స్కూలు టైం
అయింది అని
గుర్తు చేస్తే ఎవరు ముందు వెడతారో అని
పందెం పెట్టుకుని పరిగెత్తే ఆ బాల్యం అమూల్యం..
స్కూలులో పాఠాలు...తటాకుల
పైకప్పులో దాగి జారిపడే
నీటి బిందువులూ..
పుస్తకాల మధ్య దాచుకున్న
నెమలీకలూ,
రంగు కాగితాల కోసం బంతి,చిలగ్గోరింత
పూవులను పేపరుపై రుద్దడం..
స్కూలులో గిల్లికజ్జాలు,ఆటపాటలూ,అన్నీ
ఆనందమే...
స్కూల్ అవ్వగానే పుస్తకలసంచీ చంకన
పెట్టుకుని
కాలికి పరుగందించి ఇంటికివెళ్ళి
అమ్మ ఒడిలో వాలి కాసేపు
ననమ్మా,అందరితో కబూర్లూ..
మళ్ళీ ఆటకు పరుగులు..
ఇసకలో లెక్కలు చేయటం,బొమ్మరిళ్ళు
కట్టడం...
కొబ్బరాకులతో బొమ్మలు చేయటం,
ఆ బొమ్మలను అలకరించి బొమ్మల
పెళ్ళిళ్ళు చేయటం,
భోజనాలూ,ఆటలూ,పాటలూ..
పక్షి గూళ్ళలో పెట్టిన గుడ్లు,
అది ఎప్పుడు పిల్లలు పెడుతుందో
ఎదురుచూడటం..
పుట్టాక వాటిని దూరం నుండీ చూడటం..
ఇంటివెనుక జామ తోటలో పళ్ళు
కోసుకుతినటం..
ఎక్కువ తింటే కడుపునొప్పివస్తుందని
అరిస్తే పారిపోవటం..
గడ్డిమోపులు తెచ్చే వాటినుండి గడ్డిపీకి
వారికందకుండా పరుగుపెట్టడం..
గడ్డిలో దొరికే పూలతో ఆడటం.గీదలకు
గిత్తదూడో,పెయ్యిదూడో
తెలుసుకునెందుకు గద్దిలో దొరికే
ఓరకమైన గడ్దిని చీల్చటం..
సందెవేళకి పక్షుల కిలకిలతో మా
నవ్వులతో..
అమ్మ పిలుపుతో మళ్ళీ ఇళ్ళకు
పరుగులుపెడుతూ ..
పొలం నుండి ఇంటికి వచ్చే వారితో
మళ్ళీ కాసేఫు హడావిడి..
వేడి వేడి మొక్కజొన్నపొత్తులు తింటూ
మస్టారిచ్చిన హోంవర్కు చేసుకుంటూ
మధ్య మధ్య అమ్మని పిలుస్తూ..
ఇలా నా బాల్యం నేను వూరు వెళ్ళిన
ప్రతీసారీ నా ముందు కదలాడుతుంది..
ఆ పల్లెలా ఈ రోజు మాపల్లె లేదు కానీ
ఈ రోజుకీ అది పల్లే..
పచ్చని పచ్చిక పరిచిన మా పసిడి సీమయే...@సంధ్య తులసి..

ప్రేమిచుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు,
కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి
"కలవారికి కునుకు రాదు! ఆ నవ్వేమిటమ్మాయ్… ఆడపల్ల కాలు గడపదాటకూడదు. నవ్వు పెదవి దాటకూడదు…
.
తెలుసా? కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూరములని బూరె పనికి రాదన్నాడు 
.లేనివారికి మేలుకువరాదు" 
డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.
భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేదించే పద్ధతికి సరైన నిర్వచనం :- 
పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క - ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచెక్క, 
నీ పీకనొక్క
మాజీ ప్రియుడు
ఇద్దరమ్మాయిలు బజారులో వెళుతున్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.
బిచ్చగాడు: అమ్మా... కొంచెం దయ చూపించండి
ఒకమ్మాయి అతని జోలెలో వంద రూపాయల నోటు వేసింది.
రెండో అమ్మాయి: (ఆశ్చర్యంగా అడిగింది...) ఏమే ఎందుకంత వేశావ్ ?
మొదటి అమ్మాయి: పాపం అతను ఇంతకు ముందు ఇలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులే....
అందంగా కన్పించాలని
రమేష్‌ : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.
వివేక్‌ : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని
 ...యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు ... ఓడించడం ...
దేవుడు మనుషులని ప్రేమించడానికి, వస్తువులని వాడుకోవడానికి ఇచాడు.
మనం మనుషులని వాడి, వస్తువులని ప్రేమిస్తున్నాం.


ఇటునుంచే అటు వెళ్ళారు విజయం సాదించిన వారంతా
దివినుచేమీ దిగిరాలేదుప్రపంచాన్ని ఎలినవారంతా 
మీలోనూ వుండివుంటారు ఆ కాబోయే ఘనులంతా 
పైకొస్తే జై కొడతారు మీకు అబిమానులంతా



23, ఆగస్టు 2014, శనివారం

                                                                               
ఒక ఇంటికెళ్తే
ఇంట్లో ఎవరూ లేకపోయినా
ఆ ఇంట్లో ఆడపిల్ల వుందో లేదో చెప్పెయ్యచ్చు..!
ఏ ఇంట్లో ఆడపిల్ల లేదో...
ఆ ఇంటికి ఓ దిక్కూ మొక్కూ వుండదు..!
ఎవరు ఎప్పుడొచ్చినా అడిగే వాళ్ళుండరు.. అనే వాళ్ళుండరు.!
తిట్టే వాళ్ళుండరు .. తిట్టించుకునే వాళ్ళుండరు
పట్టించుకునే వాళ్ళుండరు పెట్టే వాళ్ళుండరు
ఏ ఇంట్లో ఆడపిల్ల లేదో...
అది ఎంత ఇంద్రభవనమైనా ఏదో బూజు పట్తినట్టు..
నిండు ముత్తైదువకు బొట్టులేనట్టు..
ఇల్లాంత బోసిపోయినట్టు...
చంద్రుడికి వెన్నెల లేక వెలవెల బోయినట్టు...
ఏదో  ఓ పాడు బడిన సత్రం చూస్తున్నట్టు వుంటుంది.!

నేను మళ్లీ చెప్తున్నాను..
ఎన్ని మార్లైనా ఈ మాట అంటూనే వుంటాను.!
సాక్షాతూ ఆ నారాయణుడే అయినా సరే
ఆయన ఎంత గొప్పవాడైనా,
ఎంత లోక రక్షకుడైనా
ఎన్ని చేతులున్నా
ఆ తల్లి, లక్ష్మిలేని నారాయణుడు
లక్ష్మీ నారాయణుడౌతాడా?
'వొఠ్ఠి' మామూలు' నాయాణుడౌతాడు గానీ...

ఓ కిలకిల వుంటేనే' ఇకఇకలూ.. పకపకలూ..వుంటేనే....
ఓ పట్టు పావడా కట్టి
కట్టూ బొట్టుతో ఓ చిట్టి తల్లి తిరుగుతూ వుంటేనే...
జెడకుప్పెలు పూలజెడలూ,
పండిన గోరింటాకు చేతులూ...
పెరుగుతున్న జుట్టు చూసుకుని మురిసిపోతూ నవ్వుకునే
ముసిముసి నవ్వులు వుంటేనే...
పసిబుగ్గల పిల్లలుంటేనే
ఆ ఇంట్లో కలలూ... కలకలలూ... కళ కళలూ...
చెంకీలు, జుంకీలు మెరుపులుంటేనే...
ఆ ఇంటికి తళతళలూ...పెళ పెళలూ...
అందుకే ఓ ఆడపిల్ల వుంటేనే అది
అసలైన ఇల్లు.!
మీ కడుపున ఆడపిల్ల పుట్టకపోతే ఏం
ఒకాడపిల్లను తెచ్చి పెంచండి.
అప్పుడే తెలుస్తుంది అందం ఆనందం అంటే ఎంతో కొంత.!



ప్రతి ఇంట్లోనూ ఓ చిట్టి తల్లి, నడయాడాలి...
ఆ తల్లి చక్కని లక్షణమైన తల్లై
మనందరికీ దారి చూపాలి.
మన అందరిళ్లల్లోనూ చిరునవ్వులు చిందించాలి,
మన నట్టింట ఆ తల్లి పసి 'పాపల్ని ఎత్తుకోవాలి.
ఆ పసిపాపల 'సిరి' సిరి' మువ్వల్నీ మోగించాలి.
''లక్షణమైన 'కుటుంబం''గా
మన అందరి కుటుంబాలు వెలగాలి.! విలసిల్లాలి.!

ఎక్కడైనా ఓ లక్షణమైన తల్లిని చూసినప్పుడు
అప్పటికప్పుడు,
కాసేపు మీ పనులన్నీకాసేపు వదిలేసి,
సమయం మరిచిపోయి,
ఆలోచనలన్నీ ఆపేసి,
ఆత్మీయంగా గడపండి..
అంత కంటె ముఖ్యమైన వ్యాపారాలూ..
మీరు జీవితంలో సంపాయించే గొప్ప సంతోషాలూ
ఇంకేవీ లేవు..!
వుండవు కూడా..!!                  -  గౌతమ్ కశ్యప్          Author - Gautham Kashyap