ఒక ఇంటికెళ్తే
ఇంట్లో ఎవరూ లేకపోయినా
ఆ ఇంట్లో ఆడపిల్ల వుందో లేదో చెప్పెయ్యచ్చు..!
ఏ ఇంట్లో ఆడపిల్ల లేదో...
ఆ ఇంటికి ఓ దిక్కూ మొక్కూ వుండదు..!
ఎవరు ఎప్పుడొచ్చినా అడిగే వాళ్ళుండరు.. అనే వాళ్ళుండరు.!
తిట్టే వాళ్ళుండరు .. తిట్టించుకునే వాళ్ళుండరు
పట్టించుకునే వాళ్ళుండరు పెట్టే వాళ్ళుండరు
ఏ ఇంట్లో ఆడపిల్ల లేదో...
అది ఎంత ఇంద్రభవనమైనా ఏదో బూజు పట్తినట్టు..
నిండు ముత్తైదువకు బొట్టులేనట్టు..
ఇల్లాంత బోసిపోయినట్టు...
చంద్రుడికి వెన్నెల లేక వెలవెల బోయినట్టు...
ఏదో ఓ పాడు బడిన సత్రం చూస్తున్నట్టు వుంటుంది.!
నేను మళ్లీ చెప్తున్నాను..
ఎన్ని మార్లైనా ఈ మాట అంటూనే వుంటాను.!
సాక్షాతూ ఆ నారాయణుడే అయినా సరే
ఆయన ఎంత గొప్పవాడైనా,
ఎంత లోక రక్షకుడైనా
ఎన్ని చేతులున్నా
ఆ తల్లి, లక్ష్మిలేని నారాయణుడు
లక్ష్మీ నారాయణుడౌతాడా?
'వొఠ్ఠి' మామూలు' నాయాణుడౌతాడు గానీ...
ఓ కిలకిల వుంటేనే' ఇకఇకలూ.. పకపకలూ..వుంటేనే....
ఓ పట్టు పావడా కట్టి
కట్టూ బొట్టుతో ఓ చిట్టి తల్లి తిరుగుతూ వుంటేనే...
జెడకుప్పెలు పూలజెడలూ,
పండిన గోరింటాకు చేతులూ...
పెరుగుతున్న జుట్టు చూసుకుని మురిసిపోతూ నవ్వుకునే
ముసిముసి నవ్వులు వుంటేనే...
పసిబుగ్గల పిల్లలుంటేనే
ఆ ఇంట్లో కలలూ... కలకలలూ... కళ కళలూ...
చెంకీలు, జుంకీలు మెరుపులుంటేనే...
ఆ ఇంటికి తళతళలూ...పెళ పెళలూ...
అందుకే ఓ ఆడపిల్ల వుంటేనే అది
అసలైన ఇల్లు.!
మీ కడుపున ఆడపిల్ల పుట్టకపోతే ఏం
ఒకాడపిల్లను తెచ్చి పెంచండి.
అప్పుడే తెలుస్తుంది అందం ఆనందం అంటే ఎంతో కొంత.!
ప్రతి ఇంట్లోనూ ఓ చిట్టి తల్లి, నడయాడాలి...
ఆ తల్లి చక్కని లక్షణమైన తల్లై
మనందరికీ దారి చూపాలి.
మన అందరిళ్లల్లోనూ చిరునవ్వులు చిందించాలి,
మన నట్టింట ఆ తల్లి పసి 'పాపల్ని ఎత్తుకోవాలి.
ఆ పసిపాపల 'సిరి' సిరి' మువ్వల్నీ మోగించాలి.
''లక్షణమైన 'కుటుంబం''గా
మన అందరి కుటుంబాలు వెలగాలి.! విలసిల్లాలి.!
ఎక్కడైనా ఓ లక్షణమైన తల్లిని చూసినప్పుడు
అప్పటికప్పుడు,
కాసేపు మీ పనులన్నీకాసేపు వదిలేసి,
సమయం మరిచిపోయి,
ఆలోచనలన్నీ ఆపేసి,
ఆత్మీయంగా గడపండి..
అంత కంటె ముఖ్యమైన వ్యాపారాలూ..
మీరు జీవితంలో సంపాయించే గొప్ప సంతోషాలూ
ఇంకేవీ లేవు..!
వుండవు కూడా..!! - గౌతమ్ కశ్యప్ Author - Gautham Kashyap
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి