మావూరు
మా ఊరు వెడుతున్నాను ఈ మాట ఈ భావం నన్ను స్థిమితంగా
మా ఊరు వెడుతున్నాను ఈ మాట ఈ భావం నన్ను స్థిమితంగా
వుండనీయదు. ఆ పచ్చదనం గుర్తుకురాగనే
ప్రశాంతంగా హాయిగా మనసు ప్రక్రుతితో
వూయలలూగుతుంది..
ప్రశాంతంగా హాయిగా మనసు ప్రక్రుతితో
వూయలలూగుతుంది..
ఈ కంక్రీటు అరణ్యంలో బస్సు ఎక్కి
కూర్చుని కళ్ళు మూసుకుంటే ....
చిన్నప్పటి ఆటలూ,పాటలూ,కబుర్లూ,
తొటలూ,వాగులూ,వంకలూ,పొలాలూ,
గట్లూ,వాన నీటితో ఆటలూ..
ఎండాకలంలో చెరువులో ఈతా,
చలికాలంలో చలిమంటలూ...
చిన్న నాటి నేస్తాలూ,ఆనాటి ఎన్నో
అనుభూతులన్నీ
మళ్ళీ అనుభవిస్తున్నంత ఆహ్లాదంగా వుంటాయి..
కూర్చుని కళ్ళు మూసుకుంటే ....
చిన్నప్పటి ఆటలూ,పాటలూ,కబుర్లూ,
తొటలూ,వాగులూ,వంకలూ,పొలాలూ,
గట్లూ,వాన నీటితో ఆటలూ..
ఎండాకలంలో చెరువులో ఈతా,
చలికాలంలో చలిమంటలూ...
చిన్న నాటి నేస్తాలూ,ఆనాటి ఎన్నో
అనుభూతులన్నీ
మళ్ళీ అనుభవిస్తున్నంత ఆహ్లాదంగా వుంటాయి..
అసలే వర్షాకాలం హడావిడీ..పొలాల్లో
నాట్లూ,
నీళ్ళు పెట్టడాలూ,కలుపు
తీయటాలూ.....
పొద్దున్న పొలం లో వచ్చి
వాలిన కొంగలు మొక్కలు
పాడుచేయకుండా తోలటం..
నాట్లూ,
నీళ్ళు పెట్టడాలూ,కలుపు
తీయటాలూ.....
పొద్దున్న పొలం లో వచ్చి
వాలిన కొంగలు మొక్కలు
పాడుచేయకుండా తోలటం..
ఇంటిలో భోజనాల తయారీలో
అమ్మా ననమ్మా పిన్నులూ పెద్దమ్మల
హడావిడీ,
నాగళ్ళూ,ఎద్దుల గంటల చప్పుడులూ..
వాటిని తీసుకెళ్ళే
పాలేర్లూ,కమతందార్లూ ఇంటి
మనుషుల ఇల్లంతా హడావిడీ....
అమ్మా ననమ్మా పిన్నులూ పెద్దమ్మల
హడావిడీ,
నాగళ్ళూ,ఎద్దుల గంటల చప్పుడులూ..
వాటిని తీసుకెళ్ళే
పాలేర్లూ,కమతందార్లూ ఇంటి
మనుషుల ఇల్లంతా హడావిడీ....
ఎంత పనిలో వున్నా...మాకు స్కూలుకు
భోజనం,
మమ్మల్ని తయారు చేయటం
మరచిపోని అమ్మ..
రెండుజడలు వేసి రెండుజడలలోనూ
పూలు పెట్టి ముద్దు చేసి జాగ్రత్త తల్లీ
అంటూ
ప్రతీ ఒక్కరికీ చెబుతూ మేము
కనుమరుగయ్యేవరకూ
గుమ్మంలోనే వుండే అమ్మ ఇప్పటికీ
కళ్ళముందే వున్నట్టుంటుంది..
భోజనం,
మమ్మల్ని తయారు చేయటం
మరచిపోని అమ్మ..
రెండుజడలు వేసి రెండుజడలలోనూ
పూలు పెట్టి ముద్దు చేసి జాగ్రత్త తల్లీ
అంటూ
ప్రతీ ఒక్కరికీ చెబుతూ మేము
కనుమరుగయ్యేవరకూ
గుమ్మంలోనే వుండే అమ్మ ఇప్పటికీ
కళ్ళముందే వున్నట్టుంటుంది..
ఇంటికి పదీళ్ళ ఆవల వుండే స్కూలుకు
వెళుతూ
రోడ్డు పక్కన కనిపించే పోలీసు కాయలూ,కోడిపుంజుల
పూలు(గుల్మొహర్)పూలు వీటితో
ఆడుతూ..
వెళుతూ
రోడ్డు పక్కన కనిపించే పోలీసు కాయలూ,కోడిపుంజుల
పూలు(గుల్మొహర్)పూలు వీటితో
ఆడుతూ..
మధ్యలో కనిపించే నీటి మడుగులో
కాగితపు పడవలు వేస్తూ సమయాన్ని
మరిచిన మాకు..
చుట్టుపక్కల వారు పిల్లల్లూ స్కూలు టైం
అయింది అని
గుర్తు చేస్తే ఎవరు ముందు వెడతారో అని
పందెం పెట్టుకుని పరిగెత్తే ఆ బాల్యం అమూల్యం..
కాగితపు పడవలు వేస్తూ సమయాన్ని
మరిచిన మాకు..
చుట్టుపక్కల వారు పిల్లల్లూ స్కూలు టైం
అయింది అని
గుర్తు చేస్తే ఎవరు ముందు వెడతారో అని
పందెం పెట్టుకుని పరిగెత్తే ఆ బాల్యం అమూల్యం..
స్కూలులో పాఠాలు...తటాకుల
పైకప్పులో దాగి జారిపడే
నీటి బిందువులూ..
పుస్తకాల మధ్య దాచుకున్న
నెమలీకలూ,
రంగు కాగితాల కోసం బంతి,చిలగ్గోరింత
పూవులను పేపరుపై రుద్దడం..
స్కూలులో గిల్లికజ్జాలు,ఆటపాటలూ,అన్నీ
ఆనందమే...
పైకప్పులో దాగి జారిపడే
నీటి బిందువులూ..
పుస్తకాల మధ్య దాచుకున్న
నెమలీకలూ,
రంగు కాగితాల కోసం బంతి,చిలగ్గోరింత
పూవులను పేపరుపై రుద్దడం..
స్కూలులో గిల్లికజ్జాలు,ఆటపాటలూ,అన్నీ
ఆనందమే...
స్కూల్ అవ్వగానే పుస్తకలసంచీ చంకన
పెట్టుకుని
కాలికి పరుగందించి ఇంటికివెళ్ళి
అమ్మ ఒడిలో వాలి కాసేపు
ననమ్మా,అందరితో కబూర్లూ..
మళ్ళీ ఆటకు పరుగులు..
పెట్టుకుని
కాలికి పరుగందించి ఇంటికివెళ్ళి
అమ్మ ఒడిలో వాలి కాసేపు
ననమ్మా,అందరితో కబూర్లూ..
మళ్ళీ ఆటకు పరుగులు..
ఇసకలో లెక్కలు చేయటం,బొమ్మరిళ్ళు
కట్టడం...
కొబ్బరాకులతో బొమ్మలు చేయటం,
ఆ బొమ్మలను అలకరించి బొమ్మల
పెళ్ళిళ్ళు చేయటం,
భోజనాలూ,ఆటలూ,పాటలూ..
పక్షి గూళ్ళలో పెట్టిన గుడ్లు,
అది ఎప్పుడు పిల్లలు పెడుతుందో
ఎదురుచూడటం..
పుట్టాక వాటిని దూరం నుండీ చూడటం..
కట్టడం...
కొబ్బరాకులతో బొమ్మలు చేయటం,
ఆ బొమ్మలను అలకరించి బొమ్మల
పెళ్ళిళ్ళు చేయటం,
భోజనాలూ,ఆటలూ,పాటలూ..
పక్షి గూళ్ళలో పెట్టిన గుడ్లు,
అది ఎప్పుడు పిల్లలు పెడుతుందో
ఎదురుచూడటం..
పుట్టాక వాటిని దూరం నుండీ చూడటం..
ఇంటివెనుక జామ తోటలో పళ్ళు
కోసుకుతినటం..
ఎక్కువ తింటే కడుపునొప్పివస్తుందని
అరిస్తే పారిపోవటం..
గడ్డిమోపులు తెచ్చే వాటినుండి గడ్డిపీకి
వారికందకుండా పరుగుపెట్టడం..
గడ్డిలో దొరికే పూలతో ఆడటం.గీదలకు
గిత్తదూడో,పెయ్యిదూడో
తెలుసుకునెందుకు గద్దిలో దొరికే
ఓరకమైన గడ్దిని చీల్చటం..
కోసుకుతినటం..
ఎక్కువ తింటే కడుపునొప్పివస్తుందని
అరిస్తే పారిపోవటం..
గడ్డిమోపులు తెచ్చే వాటినుండి గడ్డిపీకి
వారికందకుండా పరుగుపెట్టడం..
గడ్డిలో దొరికే పూలతో ఆడటం.గీదలకు
గిత్తదూడో,పెయ్యిదూడో
తెలుసుకునెందుకు గద్దిలో దొరికే
ఓరకమైన గడ్దిని చీల్చటం..
సందెవేళకి పక్షుల కిలకిలతో మా
నవ్వులతో..
అమ్మ పిలుపుతో మళ్ళీ ఇళ్ళకు
పరుగులుపెడుతూ ..
పొలం నుండి ఇంటికి వచ్చే వారితో
మళ్ళీ కాసేఫు హడావిడి..
నవ్వులతో..
అమ్మ పిలుపుతో మళ్ళీ ఇళ్ళకు
పరుగులుపెడుతూ ..
పొలం నుండి ఇంటికి వచ్చే వారితో
మళ్ళీ కాసేఫు హడావిడి..
వేడి వేడి మొక్కజొన్నపొత్తులు తింటూ
మస్టారిచ్చిన హోంవర్కు చేసుకుంటూ
మధ్య మధ్య అమ్మని పిలుస్తూ..
మస్టారిచ్చిన హోంవర్కు చేసుకుంటూ
మధ్య మధ్య అమ్మని పిలుస్తూ..
ఇలా నా బాల్యం నేను వూరు వెళ్ళిన
ప్రతీసారీ నా ముందు కదలాడుతుంది..
ఆ పల్లెలా ఈ రోజు మాపల్లె లేదు కానీ
ఈ రోజుకీ అది పల్లే..
పచ్చని పచ్చిక పరిచిన మా పసిడి సీమయే...@సంధ్య తులసి..
ప్రతీసారీ నా ముందు కదలాడుతుంది..
ఆ పల్లెలా ఈ రోజు మాపల్లె లేదు కానీ
ఈ రోజుకీ అది పల్లే..
పచ్చని పచ్చిక పరిచిన మా పసిడి సీమయే...@సంధ్య తులసి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి