26, జులై 2015, ఆదివారం

,తలయెత్తి జీవించు తమ్ముడా...కాపు కులములో మొలకెథ్థినాననె౩ఎ..కనుక నిలువెత్తునా ఎదుగుతాననీ
తలవంచి కైమోడ్చు తమ్ముడా కాపు జాతి నను కనిపెంచినాద్ఫానీ..కనుక తులలేని జన్మంబు నాదనీ
అత్మీయతల్కులం. నైతికతనే నమ్ము.స్వేదమ్ము విరజిమ్ము ..ఎదనిండననిండుగా పౌరుషంబు..
 చాపకూటితో నాడు సమతే చాటినా.. బ్రహ్మనాయుడు చాలున్ నీఖ్యాతికీ
దేశబాషలందు తెలుగులేస్సయన్న... కృష్ణరాయలుచాలు నీపేరు ప్రక్యాతికి
బెజావాడ బెబ్బులి ..వంవీటి రంగ.. గుండె దైర్యంబుచాలురా నీదీప్తికీ
పవనమల్లె వీచి... ఆంద్ర ప్రభుత్వాన్నే మార్చినా.. పవరుస్టారున్నాడు నీ స్పూర్తికి.....//తల ఎత్తి//
గాంధేయ వాదముతో నాయకత్వము నడుపు... మండలివున్నాడు ఈనాటికీ
ఆన్ద్రదేసమునందు అభినవరారాజు.. ఆచంట తో పోటీఎదిరా ఈనాటికి...
అభినయంబు లోన..మన ఆడపడుచు అభినేత్రి సావిత్రికేదురేది ఏనాటికీ
తెలుగు చిత్ర సీమకే తాండ్ర పాపయ్య.. మన ఎస్.వి. రంగారావు ముమ్మాటికీ.....//తలయెత్తి//

23, జులై 2015, గురువారం

వేదంలాఘో షించే గోదావరీ ....
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ....
వేదంలాఘో షించే గోదావరీ
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రీ

శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం//వేదంలా//

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరూ //వేదంలా//

శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో     వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం    స్త్రీపుంసయోగోద్భవాం ...
తే వేదత్రయ మూర్తాయ స్త్రీపురుషా సంపూజితా వసురైర్భూయాసుహుఊఊఉ
పురుషోత్తమాం భుజభవథ్  శ్రీఖంధరాశ్రేయసే...............

ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసమూ పెద్ద ముచ్చట ప్తులకు కమ్మని కావ్యం...
కవి సార్వభౌములకిది ఆలవాలమూ
నవ కవితలు వికసించే నందనవనమూ//వేదంలా//

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలూ //వేదంలా//

6, జులై 2015, సోమవారం




నిదురవోచుంటివో లేక బెదిరి పల్కు
చుంటివో? కాక నీవు తొల్లింటి భీమ
సేనుడవె కావొ యెన్నడీచెవులు వినని
కనులు చూడని శాంతంబు గాన వచ్చె.

5, జులై 2015, ఆదివారం

నువ్వు కాలాన్ని సంపాదించ లేవు 
అందువలన దానిని సక్రమంగా వినియోగించు 
నీ సమయాన్ని నువ్వు ఎవరికొసమైనా ఇచ్చావంటే 
నీ జీవితాన్ని ఇచ్చావన్నమాట 
The best present that you can give to your family and friends is your TIME.
అంతా శాస్వతం అన్నీ శాశ్వతం 
అనుకోవడం లోనే ఉంది చిక్కంతా
ఏదీ శాశ్వతంగా అలాగే ఉండిపోదు
ప్రతీదీ మారుతూనే ఉంటుంది
ఒక సంతోషం ఒక సంబరం
అలాగే ఉండి పోవు
ఒక దుఖశకలం ఈ రోజు కాల్చేయొచ్చు
రేపటికి ఒక రోజు గడిచిపోయిన దుఖం
ఒక నదిలో తాగిన నీటినే రెండోసారి తాగలేవు
హిమాలయాల్లో మంచు నిశ్చలంగా కనబడుతుంది
కానీ కరుగుతూనే ఉంటుంది
కొత్త హిమం చేరుతూనే ఉంటుంది
ఈ రోజు చూస్తే ఎర్రటి కిసలయం
రేపటికి ఆకుపచ్చని పత్రం
ఈ రోజు నీ వయస్సుకి
రేపటి నీ వయస్సుకి లోటు ఒక రోజు
మార్పే జీవన నాదం
మార్పే అభ్యుదయానికి అసలు చిరునామా
శిలాజంలా ఉండిపోవడం
చాలా చింతించాల్సిన విషయం
మార్పుతో చెట్టాపట్టాల్ కట్టి చూడు
మహదానందానికి అదే కాలిబాట.

1, జులై 2015, బుధవారం

పల్లవి: 
సభికులార అందుకోండి స్పందన అభివందనం 
స్పందించే హృదయాలకు అభినందన చందనం
చరణం :
కళలకు కాణాచి మన గుడివాడ పట్టణం 
నందమూరి అక్కినేని కైకాలల స్వస్థలం 
రంగస్థల రత్నాలకు ఆలవాలమీపురం 
కళామతల్లి వారసులు కొలువైన స్థావరం । సభికులార । 
చరణం :
అమర గాన గంధర్వుడు ఘంటసాల కు నెలవు 
సంగీత విద్వాంసుడు పెండ్యాలకు కొలువు 
ఖండాంతర ఖ్యాతి గన్న కూచిపూడి నృత్యం 
కళాసేవ చేయనుంది స్పందన అను నిత్యం ।సభికులార। 
చరణం:
రాష్ట్రస్థాయి పోటీలలో రాణించిన నాటకాలు 
స్క్రూటినీ చేయబడ్డ స్థానిక కళారూపాలు 
మూడు నెలలకొక్కసారి ముచ్చటైన ప్రదర్సనలు 
అందించే స్పందనను ముందుకు నడిపించండి । సభికులార।